2023 Hero Xpulse : అద్భుతమైన ఫీచర్లతో కొత్త హీరో Xpluse బైక్ వచ్చేసింది.. భారత్‌లో ధర ఎంతో తెలిస్తే ఇప్పుడే కొనేస్తారు..!

2023 Hero Xpulse : కొత్త బైక్ కొనేందుకు చూస్తున్నారా? సరికొత్త ఫీచర్లతో హీరో Xpluse బైక్ భారత మార్కెట్లో లాంచ్ అయింది. ఈ బైక్‌లో ప్రో వేరియంట్ కూడా రిలీజ్ చేసింది. లాంగ్ విండ్‌స్క్రీన్, కొత్త ప్రొజెక్టర్ LED హెడ్‌ల్యాంప్‌లు, రైడింగ్ మోడ్‌లతో ధర రూ. 1.44 లక్షల నుంచి అందుబాటులో ఉంది.

2023 Hero Xpulse 200 4V launched in India at Rs 1.44 lakh, Pro variant added

2023 Hero Xpulse 200 4V : కొత్త బైక్ కొంటున్నారా? అయితే హీరో మోటోకార్పొరేషన్ (Hero MotoCorp) నుంచి సరికొత్త (Hero Xpulse 200 4V) కొత్త బైక్ వచ్చేసింది. భారత మార్కెట్లో Hero Xpulse బైక్ మోడల్ అప్‌డేట్‌ను లాంచ్ చేసింది. ఈ బైక్ ధర రూ. 1.44 లక్షల (ఎక్స్-షోరూమ్) నుంచి ప్రారంభమవుతుంది. కొత్త రేంజ్-టాపింగ్ ప్రో వేరియంట్ లైనప్‌లో చేరింది. ఈ బైక్ ధర రూ. 1.51. లక్ష (ఎక్స్-షోరూమ్)గా ఉంటుంది. 2023 Xpulse 200 4V బైక్‌లో చాలా కొత్త ఫీచర్‌లను అందిస్తుంది. అయితే, ఇప్పుడు హీరో సరికొత్త Xpulse నుంచి ఎలాంటి వివరాలను పొందవచ్చు ఇప్పుడు తెలుసుకుందాం..

ఈ అప్‌డేట్‌లో ఇంజన్ లేదా మెకానికల్స్‌లో దాదాపుగా ఎలాంటి మార్పులు లేవు. ఈ అప్‌డేట్ చేసిన వెర్షన్ E20 కంప్లైంట్‌గా ఉంది. ఇంజెక్షన్ సిస్టమ్ ఇప్పుడు 80:20 నిష్పత్తి వరకు ఇంధన-ఇథనాల్ మిశ్రమంతో రన్ అవుతుంది. సులభంగా డయాగ్నస్టిక్స్ హీరో OBD2 కంపైలెన్స్ కూడా కలిగి ఉంది. వినియోగదారుల నుంచి వచ్చిన ఫీడ్‌బ్యాక్ ఆధారంగా కంపెనీ కొన్ని కాస్మెటిక్ అంశాలను కూడా అప్‌డేట్ చేసింది. ఇందులో ఎక్కువ భాగం ఫ్రంట్ ఫాసియాపై దృష్టిసారించింది. గాలి ప్రొటెక్షన్ పెంచడానికి రూపొందించిన లాంగ్ విండ్‌స్క్రీన్ అలాగే ప్రొజెక్టర్‌తో కూడిన కొత్త LED హెడ్‌ల్యాంప్ యూనిట్‌ను కలిగి ఉంది. హెడ్‌ల్యాంప్‌లో కాంతి తీవ్రతను 230 శాతం పెంచుకోవచ్చు.

Read Also : Realme 11 Pro Series : వచ్చే జూన్‌లో రియల్‌మి 11 ప్రో సిరీస్ వచ్చేస్తోంది.. లాంచ్‌కు ముందే ఫీచర్లు.. ధర ఎంత ఉండొచ్చుంటే?

ఈ కొత్త బైక్ స్పోర్టింగ్ రైడింగ్ మోడ్‌లతో ఎలక్ట్రానిక్స్ కూడా అప్‌గ్రేడ్ అయింది. తప్పనిసరిగా ABS రెస్పాన్స్ ఎడ్జెస్ట్ చేస్తుంది. మూడు మోడల్‌లలో రోడ్, ఆఫ్-రోడ్, ర్యాలీ ఉన్నాయి. సింగిల్-ఛానల్ ABS మాడ్యూల్‌ సహా కొత్త మోడ్‌లు మూడు విభిన్న స్థాయిలలో అందిస్తుంది. రోడ్ మోడ్‌లో, బ్రేకింగ్ పర్ఫార్మెన్స్ పెంచడానికి స్లిప్‌ను తగ్గించడానికి ABS ట్యూన్ చేసింది.

2023 Hero Xpulse 200 4V launched in India at Rs 1.44 lakh, Pro variant added

ఆఫ్-రోడ్ మోడ్‌లో లెవల్ తక్కువగా ఉంటుంది. ఈ బైక్ మరింత స్లిప్‌ను అనుమతిస్తుంది. ఆఫ్-రోడ్ రైడింగ్ చేసేటప్పుడు కంట్రోల్, లాక్‌ని పెంచుతుంది. ర్యాలీ మోడ్ ఫ్రంట్ వీల్‌పై ABS స్విచ్ ఆఫ్ చేస్తుంది. పూర్తిగా ఫ్రంట్ లాక్‌ని అనుమతిస్తుంది. లివర్‌ల వద్ద కంట్రోలింగ్ అసాధారణంగా ఉండే ప్రొఫెషనల్ ర్యాలీ రైడింగ్‌ను లక్ష్యంగా చేసుకుంది.

ఇంతలో, (Xpulse Rally) ఇప్పుడు ప్రోగా తిరిగి వస్తుంది. ఫ్రంట్, బ్యాక్ రెండింటిలోనూ పూర్తిగా ఎడ్జెస్ట్ చేయగల సస్పెన్షన్‌తో పాటు లాంగ్ సీటు, హ్యాండిల్‌బార్ రైసర్ ఉంటాయి. అదనంగా, ఈ కొత్త ప్రో-వెర్షన్ కూడా బల్కీయర్ రైడింగ్ బూట్‌లకు అనుగుణంగా పొడవైన గేర్ లివర్‌ను కలిగి ఉంది. ఇంకా ఎత్తు పెంచుకోవాలంటే ప్రో లాంగ్ సైడ్ స్టాండ్‌ను కూడా కలిగి ఉంది.

ముఖ్యంగా ఆఫ్-రోడ్‌లో పార్కింగ్ చేసేటప్పుడు మరింత సురక్షితంగా ఉంటుంది. 2023 Xpulse బైక్ మొత్తం మాట్ నెక్సస్ బ్లూ, టెక్నో బ్లూ, బ్లాక్ స్పోర్ట్స్ రెడ్, ర్యాలీ ఎడిషన్ గ్రాఫిక్స్ అనే 4 పెయింట్ థీమ్‌లలో అందుబాటులో ఉంది. అన్ని హీరో డీలర్‌షిప్‌లలో బైక్‌కి సంబంధించిన బుకింగ్‌లు ఇప్పటికే ప్రారంభమయ్యాయి. రాబోయే రోజుల్లో ఈ కొత్త బైక్ డెలివరీలు ప్రారంభమయ్యే అవకాశం ఉంది.

Read Also : Toyota Kirloskar Motor: మొదటి ‘గ్రేట్ 4×4 X-పెడిషన్’ ప్రకటించిన టయోటా కిర్లోస్కర్ మోటర్