2023 Honda Activa Models : అదిరిపోయే ఫీచర్లతో హోండా యాక్టివా రెండు మోడల్స్.. ధర ఎంతో తెలిస్తే ఇప్పుడే కొనేస్తారు!

2023 Honda Activa Models : కొత్త బైకు కోసం చూస్తున్నారా? హోండా యాక్టివా నుంచి రెండు సరికొత్త బైకులు వచ్చేశాయి. హోండా యాక్టివా 125, 2023 SP125 అనే మోడల్స్ తక్కువ ధరకే మార్కెట్లో అందుబాటులో ఉన్నాయి. మీకు నచ్చిన మోడల్ బైక్ కొనేసుకోండి.

2023 Honda Activa Models

2023 Honda Activa Models : ప్రముఖ హోండా మోటార్‌సైకిల్ & స్కూటర్ ఇండియా BS6 ఫేజ్ 2-కంప్లైంట్ 2023 Activa 125, 2023 SP125 యూపీలో అందుబాటులో ఉన్నాయని ప్రకటించింది. (2023 Activa 125) ధర రూ. 79,798, రూ. 88,971 (ఎక్స్-షోరూమ్) మధ్య ఉండగా, 2023 SP125 ధర రూ. 84,957 నుంచి రూ. 88,957 (ఎక్స్-షోరూమ్) పరిధిలో ఉంది.

2023 హోండా యాక్టివా 125 :
ఈ స్కూటర్ 125cc PGM-FI ఇంజన్‌తో వచ్చింది. BS6 ఫేజ్ 2 నిబంధనలకు అనుగుణంగా ఉంటుంది. LED హెడ్‌ల్యాంప్, ఫుల్-డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్, ఇంజన్ ఇన్హిబిటర్‌తో కూడిన సైడ్ స్టాండ్ వంటి ఫీచర్లతో లోడ్ అయింది. 2023 Activa 125 టూ-క్యాప్ ఫ్యూయల్ ఓపెనింగ్ సిస్టమ్, 18-లీటర్ స్టోరేజ్ స్పేస్‌ను కలిగి ఉంది. అదనపు స్టోరేజీ కోసం కొత్త ఓపెన్ ఫ్రంట్ గ్లోవ్ బాక్స్ ఉంది.

Read Also : Samsung Galaxy M14 5G : శాంసంగ్ గెలాక్సీ M14 5G ఫోన్ వచ్చేసిందోచ్.. ధర కేవలం రూ. 13,490 మాత్రమే.. ఇప్పుడే కొనేసుకోండి!

స్కూటర్‌తో పాటు కొత్త హోండా స్మార్ట్ కీ కూడా అందుబాటులో ఉంది. 2023 హోండా యాక్టివా 125 స్మార్ట్, డిస్క్, డ్రమ్ అల్లాయ్, డ్రమ్ అనే 4 వేరియంట్‌లలో అందుబాటులో ఉంది. పెర్ల్ నైట్ స్టార్ట్ బ్లాక్, హెవీ గ్రే మెటాలిక్, రెబెల్ రెడ్ మెటాలిక్, పర్ల్ ప్రెషియస్ వైట్, మిడ్ నైట్ బ్లూ మెటాలిక్ అనే 5 కలర్ ఆప్షన్‌లు ఉన్నాయి. వేరియంట్ వారీగా 2023 హోండా యాక్టివా 125 (ఎక్స్-షోరూమ్) ధరలు ఈ కింది విధంగా ఉన్నాయి.

2023 Honda Activa Models

* డ్రమ్ – రూ. 79,798
* డ్రమ్ అల్లాయ్ – రూ. 83,466
* డిస్క్ – రూ. 86,971
* స్మార్ట్ – రూ. 88,971
* 2023 హోండా SP125

మోటార్‌సైకిల్ 125cc PGM-FI ఇంజిన్‌తో వచ్చింది. ఇప్పుడు BS6 ఫేజ్ 2-కంప్లైంట్. LED హెడ్‌ల్యాంప్, ఫుల్-డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్, ఇంటిగ్రేటెడ్ హెడ్‌ల్యాంప్ బీమ్, పాసింగ్ స్విచ్, ఐదు-దశల ఎడ్జిట్ సస్పెన్షన్, 5-స్పోక్ స్ప్లిట్ అల్లాయ్ వీల్స్, విస్తృత 100mm బ్యాక్ టైర్, ఈక్వలైజర్‌తో కూడిన కాంబి-బ్రేక్ సిస్టమ్ వంటి ఫీచర్లతో వస్తుంది.

SP125 డ్రమ్, డిస్క్ అనే రెండు వేరియంట్లలో వస్తుంది. అంతేకాదు.. బ్లాక్, మ్యాట్ యాక్సిస్ గ్రే మెటాలిక్, ఇంపీరియల్ రెడ్ మెటాలిక్, పెరల్ సైరన్ బ్లూ, మ్యాట్ మార్వెల్ బ్లూ మెటాలిక్ అనే ఐదు కలర్ ఆప్షన్లలో వస్తుంది. వేరియంట్ వారీగా 2023 హోండా SP125 ధరలు (ఎక్స్-షోరూమ్)లో డ్రమ్ ధర రూ. 84,957, డిస్క్ ధర రూ. 88,957గా ఉన్నాయి.

Read Also : Best Laptops 2023 : కొత్త ల్యాప్‌టాప్ కొంటున్నారా? రూ.80వేల లోపు బెస్ట్ ల్యాప్‌టాప్స్ ఇవే.. మీకు నచ్చిన మోడల్ ఎంచుకోండి..!