2023 Hyundai Verna : 14 వేరియంట్లలో హ్యుందాయ్ వెర్నా మిడ్-సైజ్ సెడాన్ కారు వచ్చేస్తోంది.. మార్చి 21నే లాంచ్.. బుకింగ్ చేసుకున్నారా?

2023 Hyundai Verna : కొత్త కారు కొనేందుకు చూస్తున్నారా? అయితే, ఇదే బెస్ట్ టైమ్.. 2023 హ్యుందాయ్ వెర్నా మిడ్-సైజ్ సెడాన్ కారు వచ్చేస్తోంది.

2023 Hyundai Verna : 14 వేరియంట్లలో హ్యుందాయ్ వెర్నా మిడ్-సైజ్ సెడాన్ కారు వచ్చేస్తోంది.. మార్చి 21నే లాంచ్.. బుకింగ్ చేసుకున్నారా?

2023 Hyundai Verna gets 14 variants, Full Details Here

Updated On : February 23, 2023 / 8:32 PM IST

2023 Hyundai Verna : కొత్త కారు కొనేందుకు చూస్తున్నారా? అయితే, ఇదే బెస్ట్ టైమ్.. 2023 హ్యుందాయ్ వెర్నా మిడ్-సైజ్ సెడాన్ కారు వచ్చేస్తోంది. మార్చి 21న 6వ జనరేషన్ కొత్త కారును భారత మార్కెట్లో లాంచ్ చేయనున్నట్లు హ్యుందాయ్ మోటార్ ఇండియా ఇప్పటికే ప్రకటించింది. ఈ కొత్త కారు బుకింగ్‌లు కూడా ఇప్పటికే మొదలయ్యాయి. మీరు కంపెనీ అధికారిక వెబ్‌సైట్ ద్వారా లేదా హ్యుందాయ్ డీలర్‌షిప్‌ల వద్ద రూ. 25వేల టోకెన్ మొత్తాన్ని చెల్లించి మీకోసం రిజర్వ్ చేసుకోవచ్చు. కొత్త వెర్నా వేరియంట్‌ల గురించి పూర్తి వివరాలను ఓసారి పరిశీలిద్దాం..

2023 హ్యుందాయ్ వెర్నా నాలుగు ట్రిమ్‌లలో EX, S, SX, SX(O) అందుబాటులోకి రానుంది. మీరు 6-స్పీడ్ MT, IVT ఆటోమేటిక్ ఆప్షన్‌లతో 1.5-లీటర్ MPi పెట్రోల్ ఇంజన్ లేదా 6-స్పీడ్ MT, 7-స్పీడ్ DCT ఆటోమేటిక్ ఆప్షన్‌లతో 1.5-లీటర్ టర్బో GDi పెట్రోల్ ఇంజన్‌ని ఎంచుకోవచ్చు. అంతేకాకుండా, 7 మోనో-టోన్, 2 డ్యూయల్-టోన్ కలర్ ఆప్షన్‌లు ఉన్నాయి. ట్రిమ్, పవర్‌ట్రెయిన్, కలర్ కాంబినేషన్‌పై ఆధారపడి కొత్త వెర్నా మొత్తం 14 వేరియంట్‌లను కలిగి ఉంది.

2023 Hyundai Verna gets 14 variants, Full Details Here

2023 Hyundai Verna gets 14 variants

Read Also : 2023 Honda City Facelift : హోండా కార్స్ ఇండియా నుంచి కొత్త కారు ఇదే.. హోండా సిటీ ఫేస్‌లిఫ్ట్ లాంచ్‌కు ముందే ఫొటోలు లీక్..! ధర ఎంత ఉండొచ్చుంటే?

1. Verna 1.5 MPi MT EX

2. Verna 1.5 MPi MT S

3. Verna 1.5 MPi MT SX

4. Verna 1.5 MPi MT SX(O)

5. Verna 1.5 MPi iVT SX

6. Verna 1.5 MPi iVT SX(O)

7. Verna 1.5 Turbo GDi MT SX

8. Verna 1.5 Turbo GDi MT SX Dual Tone

9. Verna 1.5 Turbo GDi MT SX(O)

10. Verna 1.5 Turbo GDi MT SX(O) Dual Tone

11. Verna 1.5 Turbo GDi DCT SX

12. Verna 1.5 Turbo GDi DCT SX Dual Tone

13. Verna 1.5 Turbo GDi DCT SX(O)

14. Verna 1.5 Turbo GDi DCT SX(O) Dual Tone

పాత వెర్నా కారు ధర రూ. 9.64 లక్షల నుంచి రూ. 15.72 లక్షల (ఎక్స్-షోరూమ్)లో ఉండగా, 2023 హ్యుందాయ్ వెర్నా ధర రూ. 9.99 లక్షల నుంచి రూ. 17 లక్షల (ఎక్స్-షోరూమ్) వరకు ఉంటుందని అంచనా. మునుపటిలాగే, కొత్త వెర్నా హోండా సిటీ, స్కోడా స్లావియా, ఫోక్స్‌వ్యాగన్ వర్టస్, మారుతి సుజుకి సియాజ్‌లకు పోటీగా మార్కెట్లోకి అడుగుపెడుతోంది. హోండా కార్స్ ఇండియా త్వరలో 2023 హోండా సిటీ ఫేస్‌లిఫ్ట్‌ను లాంచ్ చేయనుంది.

Read Also : Xiaomi 12 Pro 5G Offer : అమెజాన్‌లో షావోమీ 12ప్రో 5G ఫోన్‌పై భారీ తగ్గింపు.. మళ్లీ ధర పెరగొచ్చు.. ఇప్పుడే కొనేసుకోండి..!