2023 Honda City Facelift : హోండా కార్స్ ఇండియా నుంచి కొత్త కారు ఇదే.. హోండా సిటీ ఫేస్‌లిఫ్ట్ లాంచ్‌కు ముందే ఫొటోలు లీక్..! ధర ఎంత ఉండొచ్చుంటే?

2023 Honda City Facelift : ప్రముఖ ఆటోమొబైల్ కంపెనీ హోండా కార్స్ ఇండియా (Honda Cars India) నుంచి సరికొత్త మోడల్ కారు భారత మార్కెట్లోకి రానుంది. 2023 హోండా సిటీ ఫేస్‌లిఫ్ట్ కారు లాంచ్‌కు రెడీ అవుతోంది.

2023 Honda City Facelift : హోండా కార్స్ ఇండియా నుంచి కొత్త కారు ఇదే.. హోండా సిటీ ఫేస్‌లిఫ్ట్ లాంచ్‌కు ముందే ఫొటోలు లీక్..! ధర ఎంత ఉండొచ్చుంటే?

2023 Honda City Facelift _ Honda Cars India Facelift's images Leaked Ahead of Launch

Updated On : February 21, 2023 / 10:00 PM IST

2023 Honda City Facelift : ప్రముఖ ఆటోమొబైల్ కంపెనీ హోండా కార్స్ ఇండియా (Honda Cars India) నుంచి సరికొత్త మోడల్ కారు భారత మార్కెట్లోకి రానుంది. 2023 హోండా సిటీ ఫేస్‌లిఫ్ట్ కారు లాంచ్‌కు రెడీ అవుతోంది. ఈ కొత్త 2023 హోండా సిటీ కారు మోడల్ సంబంధించిన ఫొటోలు అధికారిక లాంచ్ లాంచ్‌కు ముందే ఆన్‌లైన్‌లో లీకయ్యాయి. ఇప్పటికే ఈ కొత్త హోండా సిటీ కారుపై హోండా డీలర్‌షిప్‌లు రూ. 21వేల టోకెన్ మొత్తానికి బుకింగ్‌లను ప్రారంభించాయి. లీకైన ఫొటోల ప్రకారం.. 2023 హోండా సిటీలో పెద్దగా మార్పులు లేవని తెలుస్తోంది. హోండా సిటీ కారు ముందు భాగంలో, కొద్దిగా రీడిజైన్ చేసిన ఫాగ్ ల్యాంప్ హౌసింగ్‌తో బంపర్ ఉంటుంది. క్రోమ్ స్లాట్ కూడా వస్తుంది.

LED హెడ్‌ల్యాంప్ యూనిట్, 9 LED ఇన్‌లైన్ షెల్‌లు, ఇంటిగ్రేటెడ్ LED DRLలు అలాగే ఉంటాయి. హోండా సిటీ ఫేస్‌లిఫ్ట్ వెనుక బంపర్ కూడా రీడిజైన్ చేసినట్టు తెలుస్తోంది. కారులోని రిఫ్లెక్టర్లు కిందికి మూవ్ చేసినట్టు కనిపిస్తోంది. ఇప్పుడు అవుట్‌గోయింగ్ మోడల్‌లో వర్టికల్ ప్లేస్‌మెంట్‌కు బదులుగా అడ్డంగా ఉండనున్నాయి. Z-ఆకారపు 3D ర్యాప్-అరౌండ్ LED టెయిల్ ల్యాంప్స్ టచ్ చేయలేదు. ఈ స్వల్ప మార్పులతో 2023 హోండా సిటీ కారు మార్కెట్లోకి రానుంది. డిజైన్‌కు సంబంధించినంతవరకు పెద్ద మార్పులు ఉండకపోవచ్చు. ఎందుకంటే మిడ్-లైఫ్ అప్‌డేట్ ఫుల్ మోడల్ మార్పు కాదని కొనుగోలుదారులు గమనించాలి.

2023 Honda City Facelift _ Honda Cars India Facelift's images Leaked Ahead of Launch

2023 Honda City Facelift _ Honda Cars India Facelift’s images Leaked Ahead of Launch

Read Also : Honda City Discounts : హోండా కార్స్ ఇండియా బంపర్ ఆఫర్.. ఈ హోండా సిటీ కార్లపై కళ్లుచెదిరే క్యాష్ డిస్కౌంట్లు, మరెన్నో ఆఫర్లు.. డోంట్ మిస్..!

హుడ్ కింద కొన్ని ముఖ్యమైన మార్పులు ఉండనున్నాయి. హోండా సిటీ కారులో 1.5-లీటర్ i-DTEC డీజిల్ ఇంజిన్‌ ఇక కనిపించదు. దాని స్థానంలో సిటీ ఫేస్‌లిఫ్ట్ 6-స్పీడ్ MT, CVT ఆటోమేటిక్ ఆప్షన్లతో 1.5-లీటర్ i-VTEC పెట్రోల్ ఇంజన్‌ను మాత్రమే కలిగి ఉంటుంది. అంతేకాకుండా, హోండా సిటీ e:HEV (హైబ్రిడ్)కి మరిన్ని వేరియంట్‌లను యాడ్ చేయనుంది.

ప్రస్తుతం ఒకే ట్రిమ్, ZXలో అందుబాటులో ఉంది. దీని ధర రూ. 19.89 లక్షలు (ఎక్స్-షోరూమ్)గా ఉండనుంది. ప్రస్తుతం, నాన్-హైబ్రిడ్ సిటీ ధర రూ. 11.87 లక్షల నుంచి రూ. 15.62 లక్షల (ఎక్స్-షోరూమ్) మధ్య ఉంది. 2023 హోండా సిటీ ధరలు బహుశా రూ. 12 లక్షల నుంచి రూ. 16 లక్షల (ఎక్స్-షోరూమ్) పరిధిలో ఉండవచ్చు. సిటీ ఫేస్‌లిఫ్ట్ ఫిబ్రవరి చివరి నాటికి డీలర్‌షిప్‌ల వద్దకు చేరుకునే అవకాశం ఉంది. మార్చి 2న షోరూమ్‌లలో అందుబాటులోకి రానుంది.

Read Also : Lenovo ThinkBook Plus : రెండు డిస్‌ప్లేలతో లెనోవా థింక్‌బుక్ ప్లస్ జెన్ 3 ల్యాప్‌టాప్ లాంచ్.. అదిరే ఫీచర్లు.. భారత్‌లో ధర ఎంతో తెలుసా?