2023 Skoda Kodiaq launched at Rs 37.99 lakh, India allocation increased
2023 Skoda Kodiaq SUV : ప్రముఖ స్కోడా ఆటో ఇండియా (Skoda Auto India) భారత మార్కెట్లో 2023 స్కోడా కొడియాక్ (2023 Skoda Kodiaq)ను రూ. 37.99 లక్షలకు (ఎక్స్-షోరూమ్) లాంచ్ చేసింది. ఈ SUV కారు ఇప్పుడు BS6 ఫేజ్ 2కి సపోర్టు చేసేలా ఉంది. మునుపటిలాగా మూడు ట్రిమ్ స్థాయిలలో అందిస్తుంది. అదనంగా, బ్రాండ్ కోడియాక్ భారత కేటాయింపును 3,000 యూనిట్లకు పెంచింది. గత ఏడాదిలో 1,200 యూనిట్లతో పోలిస్తే.. అన్ని మొదటి 24 గంటల్లోనే బుక్ అయ్యాయి. దీనిపై కంపెనీ డైరెక్టర్ పీటర్ సోల్క్ (Petr Solc) మాట్లాడుతూ.. ఫల్ సైజ్ SUV ఫోల్డ్‌లోకి కొడియాక్ మొట్టమొదటిసారిగా ప్రవేశించిందన్నారు.
అంతర్జాతీయంగా, భారత మార్కెట్లో స్కోడా కొడియాక్ కార్లకు ఆదరణ పెరిగిందని తెలిపారు. ఈ కారు ప్రీమియం మోడల్ అయినప్పటికీ, హైవాల్యూ లగ్జరీ 4×4, ఫ్యామిలీకి అందించే ఫుల్ ఆఫ్-రోడ్ లగ్జరీ ప్యాకేజీతో వచ్చింది. దాంతో భారతీయ వినియోగదారుల నుంచి భారీ డిమాండ్ పెరిగింది. పెరిగిన కేటాయింపులతో కోడియాక్ కార్లను మరింత మంది SUV కస్టమర్‌లకు అందుబాటులోకి రానుంది. ఈ SUV కారు ఆఫ్-రోడ్ సామర్థ్యంతో సెక్యూరిటీ, లగ్జరీ వాల్యూ కలిగి ఉంది.
2023 స్కోడా కొడియాక్ ఇంజన్ :
స్కోడా కొడియాక్ 2.0-లీటర్ టర్బో-పెట్రోల్ ఇంజన్ కొనసాగిస్తోంది. ఈ కొత్త BS6 ఫేజ్ 2 నిబంధనలకు అనుగుణంగా ఇంజిన్ ఇప్పుడు మునుపటి కన్నా 4.2 శాతం ఎక్కువ సామర్థ్యాన్ని కలిగి ఉంది. ఇప్పటికీ 190bhp, 320Nm టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. 7-స్పీడ్ DSGతో వస్తుంది. భారీ SUV కేవలం 7.8 సెకన్లలో 0 నుంచి 100kmph వరకు దూసుకెళ్లగలదు. SUV కారు 4×4 సిస్టమ్, డైనమిక్ ఛాసిస్ కంట్రోల్‌తో వస్తుంది. కారును 15 మిమీ పెంచవచ్చు లేదా తగ్గించవచ్చు.
2023 Skoda Kodiaq SUV launched at Rs 37.99 lakh, India allocation increased
2023 స్కోడా కొడియాక్ ధరలు (ఎక్స్-షోరూమ్) :
కొడియాక్ స్టైల్ : రూ. 37.99 లక్షలు
కొడియాక్ స్పోర్ట్‌లైన్ : రూ. 39.39 లక్షలు
కొడియాక్ L & K : రూ. 41.39 లక్షలు
2023 స్కోడా కొడియాక్ ఫీచర్లు :
ఫీచర్ల విషయానికొస్తే.. 2023 స్కోడా కొడియాక్ ఇప్పుడు డోర్-ఎడ్జ్ ప్రొటెక్టర్‌లతో వస్తుంది. డోర్లు ఓపెన్ చేసినప్పుడు ఆటోమేటిక్‌గా అమర్చబడి ఉంటుంది. డోర్‌ను గీతలు లేదా డ్యామేజ్ కాకుండా ప్రొటెక్ట్ చేస్తుంది. SUV ఏరోడైనమిక్స్‌ను మెరుగుపరిచే AI ఎయిర్‌ఫ్లో అదనపు ఫిన్‌లెట్‌లతో వెనుక స్పాయిలర్ ఎడ్జిట్ కలిగి ఉంది. వెనుక సీటు సౌకర్యంగా కోటియంట్ కొత్త లాంజ్ స్టెప్‌తో వచ్చింది. హెడ్‌రెస్ట్ కోసం వినియోగించుకోవచ్చు. వైర్‌లెస్ ఆపిల్ కార్‌ప్లే, ఆండ్రాయిడ్ ఆటోతో కూడిన 8.0-అంగుళాల ఇన్ఫోటైన్‌మెంట్ డిస్‌ప్లే మునుపటి మాదిరిగానే ఉంది. టాప్-స్పెక్ లారిన్ & క్లెమెంట్ (L&K) ట్రిమ్‌లో కాంటన్ 12-స్పీకర్ ఆడియో సిస్టమ్‌తో వచ్చింది. స్టైల్ ఎంట్రీ ట్రిమ్‌కు 8-అంగుళాల ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్ లభిస్తుంది. అధిక ట్రిమ్‌లు పెద్ద 10.25-అంగుళాల ఇన్‌స్ట్రుమెంట్ డిస్‌ప్లేను అందిస్తుంది.
2023 స్కోడా కొడియాక్ సెక్యూరిటీ ఫీచర్లు :
స్కోడా కొడియాక్ 5-స్టార్ యూరో NCAP క్రాష్ సేఫ్టీ రేటింగ్‌పై 9 ఎయిర్‌బ్యాగ్‌లతో స్టాండర్డ్‌గా వస్తుంది. ఇతర ఫీచర్లలో స్టెబిలిటీ కంట్రోల్, మల్టీ-కొలిజన్ బ్రేకింగ్, పార్క్ అసిస్ట్‌తో హ్యాండ్స్-ఫ్రీ పార్కింగ్ ఉన్నాయి. అదనంగా, ఫ్లాగ్‌షిప్ L&K ట్రిమ్ టైర్ ప్రెజర్ మానిటరింగ్ సిస్టమ్ (TPMS), 360-డిగ్రీ కెమెరాను కలిగి ఉంది.
Read Also : Google Employee : గూగుల్ ఉద్యోగి ఆత్మహత్య.. న్యూయార్క్ ఆఫీసు భవనంపై నుంచి దూకేశాడు.. ఉద్యోగాల్లో కోత కారణమా?