Google Employee : గూగుల్ ఉద్యోగి ఆత్మహత్య.. న్యూయార్క్ ఆఫీసు భవనంపై నుంచి దూకేశాడు.. ఉద్యోగాల్లో కోత కారణమా?

Google Employee : న్యూయార్క్ పోస్ట్ ప్రకారం.. 31 ఏళ్ల సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ చెల్సియాలోని గూగుల్ ప్రధాన కార్యాలయ భవనంపై నుంచి దూకి ఆత్మహత్య చేసుకున్నాడు.

Google Employee : గూగుల్ ఉద్యోగి ఆత్మహత్య.. న్యూయార్క్ ఆఫీసు భవనంపై నుంచి దూకేశాడు.. ఉద్యోగాల్లో కోత కారణమా?

31-year-old Google employee jumps to death from office building in New York

Google Employee : ప్రముఖ సెర్చ్ ఇంజిన్ దిగ్గజం గూగుల్ (Google)లో పనిచేసే సీనియర్ ఉద్యోగి ఆత్మహత్య చేసుకున్నాడు. న్యూయార్క్ పోస్ట్ ప్రకారం.. 31 ఏళ్ల సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ చెల్సియాలోని గూగుల్ ప్రధాన కార్యాలయ 14వ అంతస్తు భవనంపై నుంచి ఉద్యోగి దూకి మృతి చెందినట్లు నివేదిక పేర్కొంది. ఇంతకీ ఆ ఉద్యోగి ఎవరనేది పోలీసులు, అధికారులు వెల్లడించలేదు. మృతుడి కుటుంబ సభ్యులకు ఇంకా సమాచారం కూడా ఇవ్వలేదు. ఫిబ్రవరిలో ఓ గూగుల్ ఉద్యోగి (Google Employee) ఆత్మహత్య చేసుకున్న తర్వాత జరిగిన రెండో సంఘటన ఇది.. ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా గూగుల్ కంపెనీల్లో ఉద్యోగాల కోత కొనసాగుతోంది. చాలామంది ఉద్యోగులను తొలగించడంతో తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.

గూగుల్ తన గ్లోబల్ వర్క్‌ఫోర్స్‌లో దాదాపు 12వేల మంది ఉద్యోగులను (Google Layoffs) తొలగించిన కొద్దిసేపటికే ఇద్దరు గూగుల్ ఉద్యోగుల మరణాలు సంభవించాయి. ఈ నేపథ్యంలో గూగుల్ ఉద్యోగి ఆత్మహత్య చేసుకోవడానికి ఏమైనా ఆర్థిక సమస్యలా? లేదా దీని వెనుక అసలు కారణం ఏంటి? అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. వాస్తవానికి గూగుల్ ఉద్యోగి ఎందుకు భవనం పైనుంచి దూకి ఆత్మహత్య చేసుకున్నాడో అధికారికంగా ఎలాంటి వివరాలు వెల్లడి కాలేదు. ఆత్మహత్యకు పాల్పడిన ఇద్దరు గూగుల్ ఉద్యోగులను కూడా కంపెనీ తొలగించిందా? లేదా అనేది క్లారిటీ లేదు. దీనిపై గూగుల్ కూడా ఇప్పటివరకూ స్పందించలేదు.

Read Also : Google Employees : కాస్ట్ కటింగ్ అన్నారు.. సీఈఓ పిచాయ్‌‌‌ వేతనం భారీగా పెంచారు.. గూగుల్ ఉద్యోగుల్లో తీవ్ర అసంతృప్తి.. నెట్లింట్లో మీమ్స్ వైరల్..!

న్యూయార్క్ పోస్ట్ ప్రకారం.. 15-అంతస్తుల ఆర్ట్ డెకో భవనానికి ఎదురుగా వెస్ట్ 15వ వీధికి ఎదురుగా అపస్మారక స్థితిలో వ్యక్తి నేలపై పడి ఉన్నట్లు కొందరు గుర్తించారు. వెంటనే అమెరికాలోని ఎమర్జెన్సీ నెంబర్ 911కి కాల్ చేశారు. పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని అతన్ని బెల్లేవ్ ఆస్పత్రికి తీసుకెళ్లారు. అప్పటికే గూగుల్ ఉద్యోగి మరణించినట్లు ప్రకటించారు. 14వ అంతస్థులోని ఓపెన్-ఎయిర్ టెర్రస్ అంచుపై హ్యాండ్‌ప్రింట్‌లను పోలీసులు గుర్తించారు. అయితే, ఆ ఉద్యోగి అక్కడి నుంచే దూకి ఉంటాడని భావిస్తున్నారు.

31-year-old Google employee jumps to death from office building in New York

31-year-old Google employee jumps to death from office building in New York

ఘటనా స్థలంలో ఎలాంటి సూసైడ్ నోట్ లేదా ఘటనకు సంబంధించిన వీడియో లభ్యం కాలేదు. ఈ సంఘటనకు కొన్ని నెలల ముందు.. జాకబ్ ప్రాట్ (Jacob Pratt) అనే మరో గూగుల్ ఉద్యోగి ఆత్మహత్య చేసుకున్నట్లు గుర్తించారు. ప్రాట్ 33 ఏళ్ల సాఫ్ట్‌వేర్ ఇంజనీర్.. కంపెనీ మాన్‌హాటన్ ప్రధాన కార్యాలయంలో పనిచేశాడు. ఫిబ్రవరి 16న చెల్సియాలోని వెస్ట్ 26వ వీధి, 6వ అవెన్యూ కూడలిలో ఉన్న అపార్ట్‌మెంట్‌లో ఉరి వేసుకుని కనిపించాడు.

జాకబ్ ప్రాట్ లింక్డ్ఇన్ ప్రొఫైల్‌ (Jacob Pratt LinkedIn) వివరాల ఆధారంగా గూగుల్‌ కంపెనీలో ఉన్నత స్థాయి హోదా కలిగి ఉన్నాడు. కంపెనీలో అకౌంటింగ్ మేనేజర్ గా పనిచేసినట్టు కూడా కొన్ని నివేదికలు సూచించాయి. గూగుల్ కంపెనీలో దాదాపు నాలుగు ఏళ్లు పనిచేశాడు. ప్రాట్ బ్రూక్లిన్‌లోని బుష్‌విక్ పరిసరాల్లో నివసించాడు. దురదృష్టవశాత్తూ.. ఫిబ్రవరి 16న విగతజీవిగా కనిపించాడు. లాన్సింగ్ స్టేట్ జర్నల్ ప్రకారం.. 33 ఏళ్ల గూగుల్ ఉద్యోగి చికాగోలోని నార్త్‌వెస్ట్రన్ యూనివర్శిటీలో డిగ్రీని పూర్తి చేశాడు. అయితే, అతడి ఆత్మహత్య వెనుక కారణం తెలియరాలేదు.

Read Also : 5 Best Wireless Earbuds : అమెజాన్, ఫ్లిప్‌కార్ట్‌లో అదిరే సేల్.. రూ.3వేల లోపు ధరకే 5 బెస్ట్ వైర్‌లెస్ ఇయర్‌బడ్స్.. డోంట్ మిస్..!