5 Best Wireless Earbuds : అమెజాన్, ఫ్లిప్‌కార్ట్‌లో అదిరే సేల్.. రూ.3వేల లోపు ధరకే 5 బెస్ట్ వైర్‌లెస్ ఇయర్‌బడ్స్.. డోంట్ మిస్..!

5 Best Wireless Earbuds : కొత్త వైర్‌లెస్ ఇయర్‌బడ్స్ కొనేందుకు చూస్తున్నారా? అయితే ఇదే సరైన సమయం.. అమెజాన్, ఫ్లిప్‌కార్ట్‌ సరికొత్త ఆఫర్లను అందించనుంది.

5 Best Wireless Earbuds : అమెజాన్, ఫ్లిప్‌కార్ట్‌లో అదిరే సేల్.. రూ.3వేల లోపు ధరకే 5 బెస్ట్ వైర్‌లెస్ ఇయర్‌బడ్స్.. డోంట్ మిస్..!

5 best wireless earbuds under Rs 3K to check out at ongoing Amazon and Flipkart sale

5 Best Wireless Earbuds : ప్రముఖ ఈ-కామర్స్ దిగ్గజాలైన అమెజాన్ గ్రేట్ సమ్మర్ (Amazon Great Summer Sale), ఫ్లిప్‌కార్ట్ బిగ్ సేవింగ్ డే సేల్ (Flipkart Big Saving Days Sale) ఈవెంట్‌ కొనసాగుతోంది. మీరు కొత్త వైర్‌లెస్ ఇయర్‌బడ్‌లను కొనుగోలు చేయాలని ప్లాన్ చేస్తుంటే.. ఇదే బెస్ట్ టైమ్.. స్మార్ట్‌ఫోన్‌లు వైర్డు ఇయర్‌ఫోన్‌లపై అదిరే ఆఫర్లు అందుబాటులో ఉన్నాయి. కొన్ని 3.5mm ఆడియో జాక్‌ను కూడా తొలగించాయి. అంతేకాదు.. విడిగా ఆడియో ప్రొడక్టులను కూడా కొనుగోలు చేస్తున్నాయి.

మీ స్మార్ట్‌ఫోన్‌లో ఇప్పటికీ ఆడియో పోర్ట్ ఉంటే.. వైర్డు ఇయర్‌ఫోన్‌లను కొనుగోలు చేయొచ్చు. తక్కువ ఖర్చుతో కూడుకున్న బెస్ట్ ఆప్షన్. ఎందుకంటే ఈ ఇయర్‌ఫోన్లు లాగ్-ఫ్రీ ఆడియోను అందిస్తాయి. వైర్‌లెస్ ఇయర్‌ఫోన్‌లపై అనేక బెనిఫిట్స్ పొందవచ్చు. రూ. 3వేల లోపు బెస్ట్ ఆప్షన్లతో అందుబాటులో ఉన్నాయి. ఈ వైర్‌లెస్ ఆడియో సెగ్మెంట్ బడ్జెట్‌లో ANC, ట్రాన్స్‌పరెన్సీ మోడ్,, హై-టెక్ బ్లూటూత్ కోడెక్‌లు వంటి ఫీచర్‌లను పొందవచ్చు.

ఫ్లెక్స్‌నెస్ట్ ఫ్లెక్స్‌డబ్స్ :
ఆడియో స్పేస్‌లో పెద్దగా తెలియని బ్రాండ్ (Flexnest). ఈ బ్రాండ్ కొంతకాలం బెస్ట్ స్పోర్ట్ డివైజ్‌లను ఉత్పత్తి చేస్తోంది. మొదటి వైర్‌లెస్ ఇయర్‌బడ్‌లు, ఫ్లెక్స్‌నెస్ట్ అందించింది. ఈ సేల్ సీజన్‌లో అత్యంత విలువైన ఇయర్‌బడ్‌లలో ఒకటిగా చెప్పవచ్చు. ఇయర్‌బడ్‌లు బెస్ట్ ఫిట్‌ని అందిస్తాయి. తేలికపాటి డిజైన్‌ను కలిగి ఉంటాయి. ANCని కూడా పొందవచ్చు. Flexnest Flexdubs బ్లాక్ రంగులో మాత్రమే అందుబాటులో ఉన్నాయి. వీటికి ఎలాంటి యాప్ సపోర్టు లేదు. ధర రూ. 1,999 (రూ. 50-విలువైన కూపన్ మినహా)కు పొందవచ్చు.

Read Also : Ola Electric Offer : ఓలా కస్టమర్లకు అదిరే ఆఫర్.. బైక్ ఛార్జర్ డబ్బులను రీఫండ్ చేస్తోంది.. వారికి మాత్రమేనట..!

ఒప్పో ఎన్కో ఎయిర్ 3 :
ఒప్పో Enco Air 3లో ANC, స్పేషియల్ ఆడియో వంటి అధునాతన ఫీచర్లు లేవు. ఇయర్‌బడ్‌లు ఇప్పటికీ క్లీన్, బ్యాలెన్స్‌డ్ సౌండ్‌ను అందిస్తాయి. బ్యాలెన్స్‌డ్ సౌండ్ ప్రొఫైల్‌ కలిగిన ఒప్పో ఎన్కో ఎయిర్ 3 కొనుగోలు చేయొచ్చు. ఎన్కో ఎయిర్ 3ని (HeyMelody) యాప్ ద్వారా కొనుగోలు చేయొచ్చు. ఈ యాప్ ఆండ్రాయిడ్, ఐఫోన్‌లు రెండింటిలోనూ వర్క్ అవుతుంది. దీని వాడకం చాలా ఈజీ కూడా. నాన్-టెక్ యూజర్లు ఎక్కువగా ఇష్టపడతారు. డిజైన్ పరంగా చూస్తే.. యూజర్లు ఇష్టపడే అసలైన ఆపిల్ AirPods లాంటి హార్డ్ కేస్ డిజైన్‌ను పొందవచ్చు. ఛార్జింగ్ కేస్ కూడా ఆకర్షణీయమైన ఎండ్ కలిగి ఉంది. ప్లాస్టిక్ బిల్డ్ క్వాలిటీగా అనిపించదు. దీని ధర రూ. 2,999 నుంచి అందుబాటులో ఉంది.

5 best wireless earbuds under Rs 3K to check out at ongoing Amazon and Flipkart sale

5 best wireless earbuds under Rs 3K to check out

రియల్‌మి బడ్స్ ఎయిర్ 3 నియో :
మీరు (Flexnest Flexdubs) కన్నా తక్కువ ధర కోసం చూస్తున్నారా? Realme Buds Air 3 Neo ఆదర్శవంతమైన డివైజ్ అని చెప్పవచ్చు. ఈ బడ్స్ డిజైన్ కాంపాక్ట్, ఇయర్‌బడ్‌లు కూడా తేలికగా ఉంటాయి. బడ్ చూడటానికి చాలా పొడవుగా ఉంటాయి. కానీ, బెస్ట్ ఇన్-లైన్ కంట్రోల్ కలిగి ఉంటాయి. మొత్తం మీద ఇయర్‌బడ్‌లు నో-ఫ్రిల్స్ పర్ఫార్మెన్స్ అందిస్తాయి. ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్‌లతో బాగా పని చేస్తాయి. ధర రూ. 1,899 వరకు ఉంటుంది.

Jabra Elite 2 :
జాబ్రా ఎలైట్ 2 ధర తగ్గింపుతో అందుబాటులో ఉంది. ఇయర్‌బడ్‌లు తగిన క్లారిటీతో బాస్‌తో అద్భుతమైన ఆడియోను అందిస్తాయి. ANC లేదు. కానీ, నాయిస్ ఐసోలేషన్ యూజర్లను నిరాశపరచదు. ఈ కేసుతో 21 గంటల బ్యాటరీ లైఫ్ అందించిందని కంపెనీ పేర్కొంది. ఇయర్‌బడ్స్ ఆన్‌బోర్డ్ మైక్ కూడా కాల్స్ చేసేందుకు అనువైనది. ఈ జాబ్రా ఎలైట్ ధర రూ. 2,470 నుంచి అందుబాటులో ఉంటుంది.

వన్‌ప్లస్ నోర్డ్ బడ్స్ :
జాబ్రా ఇయర్‌బడ్‌ల మాదిరిగానే (OnePlus Nord Buds)లో ఫోన్ కాల్‌ చేసేందుకు మైక్‌లు ఉన్నాయి. ఆటోమేటిక్ వేర్ డిటెక్షన్, ANC సపోర్ట్ వంటి కీలక ఫీచర్లు లేవు. డిఫాల్ట్ ఆడియో బిగ్ బాస్ కలిగి ఉంటుంది. కంపెనీ 24 గంటల వరకు బ్యాటరీ లైఫ్ అందిస్తుంది. ఇయర్‌ఫోన్ బాస్ కావాలంటే.. నార్డ్ బడ్స్ బెస్ట్ ఆప్షన్‌గా ఎంచుకోవచ్చు. భారత మార్కెట్లో ఈ నోర్డ్ బడ్స్ ధర రూ. 2,799 నుంచి అందుబాటులో ఉంది.

Read Also : Realme 11 Pro+ Launch : రియల్‌మి 11ప్రో ప్లస్ వచ్చేస్తోంది.. లాంచ్‌కు ముందే కీలక స్పెషిఫికేషన్లు లీక్.. ధర ఎంత ఉండొచ్చుంటే?