2024 Kia Sonet Facelift : అద్భుతమైన ఫీచర్లతో 2024 కియా సోనెట్ ఫేస్‌లిఫ్ట్ కారు.. లాంచ్, బుకింగ్, డెలివరీ ఎప్పుడంటే? పూర్తి వివరాలివే..

2024 Kia Sonet Facelift : 2024 కియా సోనెట్ ఫేస్‌లిఫ్ట్ టాటా నెక్సాన్, మారుతి సుజుకి బ్రెజ్జా, హ్యుందాయ్ వెన్యూ, మహీంద్రా XUV300లతో పోటీపడుతుంది.

2024 Kia Sonet Facelift : అద్భుతమైన ఫీచర్లతో 2024 కియా సోనెట్ ఫేస్‌లిఫ్ట్ కారు.. లాంచ్, బుకింగ్, డెలివరీ ఎప్పుడంటే? పూర్తి వివరాలివే..

2024 Kia Sonet facelift _ Launch, bookings, deliveries

Updated On : December 23, 2023 / 10:18 PM IST

2024 Kia Sonet facelift : ప్రముఖ ఆటోమొబైల్ తయారీ కంపెనీ కియా ఇండియా దేశంలో 2024 కియా సోనెట్ ఫేస్‌లిఫ్ట్‌ను ప్రవేశపెట్టేందుకు రెడీ అవుతోంది. సోనెట్ భారత మార్కెట్లో అత్యధికంగా అమ్ముడవుతున్న కాంపాక్ట్ ఎస్‌యూవీలలో ఒకటిగా నిలిచింది. అంతేకాదు.. కియా వాల్యూమ్ డ్రైవర్లలో ఒకటిగా చెప్పవచ్చు.

ఈ నెల ప్రారంభంలో ఆవిష్కరించిన 2024 కియా సోనెట్ ఫేస్‌లిఫ్ట్ లాంచ్ తర్వాత టాటా నెక్సాన్, మారుతి సుజుకి బ్రెజ్జా, హ్యుందాయ్ వెన్యూ, మహీంద్రా XUV300లకు పోటీగా నిలుస్తుంది. అప్‌డేట్ కాంపాక్ట్ ఎస్‌యూవీ గురించి తెలుసుకోవలసిన కొన్ని ముఖ్యమైన వివరాలను ఓసారి లుక్కేయండి.

Read Also : Poco M6 5G Launch : భారత్‌కు పోకో M6 5జీ ఫోన్ వచ్చేసింది.. ధర కేవలం రూ.9,499 మాత్రమే..!

2024 కియా సోనెట్ ఫేస్‌లిఫ్ట్ లాంచ్ :
2024 సోనెట్ జనవరిలో భారత మార్కెట్లో లాంచ్ అయింది.

2024 కియా సోనెట్ ఫేస్‌లిఫ్ట్ బుకింగ్‌లు :
కియా ఇప్పటికే 2024 సోనెట్‌కు సంబంధించి బుకింగ్‌లను ప్రారంభించింది.

2024 కియా సోనెట్ ఫేస్‌లిఫ్ట్ డెలివరీలు :
సోనెట్ డెలివరీలు జనవరిలో ప్రారంభం కానున్నాయి. అయితే, డీజిల్ ఎంటీ వేరియంట్‌ల డెలివరీ ఫిబ్రవరిలో ప్రారంభం కానుంది.

2024 కియా సోనెట్ ఫేస్‌లిఫ్ట్ వేరియంట్‌లు :
సోనెట్ నాలుగు ట్రిమ్‌లను కలిగి ఉంది. అందులో HTE, HTK, HTK+, HTX, HTX+, GTX+, X-లైన్ వంటి వేరియంట్లు ఉన్నాయి. ఈ వాహనం మొత్తం 19 వేరియంట్లలో అందుబాటులో ఉంది.

2024 Kia Sonet facelift _ Launch, bookings, deliveries

2024 Kia Sonet facelift Launch 

కియా సోనెట్ ఫేస్‌లిఫ్ట్ ఇంజన్, ట్రాన్స్‌మిషన్ :
2024 సోనెట్ మూడు ఇంజన్ ఆప్షన్లను కలిగి ఉంది. స్మార్ట్ స్ట్రీమ్ జీ1.2-లీటర్ పెట్రోల్ (83పీఎస్/115ఎన్ఎమ్), స్మార్ట్‌స్ట్రీమ్ జీ1.0-లీటర్ టీ-జీడీఐ పెట్రోల్ (120పీఎస్/172ఎన్ఎమ్), 1.5-లీటర్ సీఆర్‌డీఐ వీజీటీ డీజిల్ (116పీఎస్/250ఎన్ఎమ్). ట్రాన్స్‌మిషన్ ఆప్షన్లలో 1.2 పెట్రోల్‌తో 5-స్పీడ్ ఎంటీ, 1.0 టర్బో పెట్రోల్‌తో 6-స్పీడ్ ఐఎంటీ, 7-స్పీడ్ డీసీటీ, 1.5 డీజిల్‌తో 6-స్పీడ్ ఎంటీ, 6-స్పీడ్ ఐఎంటీ, 6-స్పీడ్ ఏటీ ఉన్నాయి. 6-స్పీడ్ ఎంటీ 1.5 డీజిల్‌తో వస్తుంది.

కియా సోనెట్ ఫేస్‌లిఫ్ట్ ఫీచర్లు :
2024 సోనెట్‌లో ఆరు ఎయిర్‌బ్యాగ్‌లు, ఎల్ఈడీ సౌండ్-యాంబియంట్ లైటింగ్, కనెక్ట్ చేసిన 10.25-అంగుళాల హెచ్‌డీ టచ్‌స్క్రీన్ నావిగేషన్, 10.25-అంగుళాల ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్ ప్యానెల్, సరౌండ్ వ్యూ మానిటర్ వంటి ఫీచర్లు ఉన్నాయి. 15 హై-సేఫ్టీ ప్యాకేజీ, 10 అడాస్ ఫీచర్‌లతో సహా 25 భద్రతా ఫీచర్లను కలిగి ఉంది. 70 కన్నా ఎక్కువ కనెక్ట్ చేసిన కారు ఫీచర్లు ఉన్నాయి.

Read Also : Oppo A59 5G : కొత్త ఫోన్ కొంటున్నారా? ఒప్పో ఎ59 ఫోన్ వచ్చేసింది.. ధర ఎంతో తెలిస్తే కొనకుండా ఉండలేరు!