2025 TVS Apache RTR 160 4V Launched
Apache RTR 160 4V Launch : కొత్త బైక్ కొంటున్నారా? భారత మార్కెట్లోకి టూవీలర్ దిగ్గజం టీవీఎస్ ఎట్టకేలకు అపాచీ ఆర్టీఆర్ 160 4వీ కొత్త ట్రాక్-ఓరియెంటెడ్ వెర్షన్‌ను విడుదల చేసింది. ఈ కొత్త మోడల్ లిమిటెడ్ ఎడిషన్ అపాచీ 165 ఆర్‌పీ లాంచ్ తర్వాత వస్తుంది. ఈ మోటార్‌సైకిల్ ప్రారంభ ధర రూ. 1.4 లక్షలు (ఢిల్లీలో ఎక్స్-షోరూమ్)తో అందుబాటులో ఉంటుంది.
ఈ కొత్త అపాచీ బైక్ మొత్తం మ్యాట్ బ్లాక్, గ్రానైట్ గ్రే, పెర్ల్ వైట్ అనే 3 కలర్ ఆప్షన్లలో లభిస్తుంది. ఆసక్తి గల కస్టమర్‌లు బ్రాండ్ నుంచి లేటెస్ట్ ఆఫర్‌ను కొనుగోలుకు సమీపంలోని అధీకృత డీలర్‌షిప్‌ను సంప్రదించవచ్చు. మోడల్ టీవీఎస్ అధికారిక వెబ్‌సైట్‌లో కూడా అందుబాటులో ఉంది.
సస్పెన్షన్ సెటప్, డిజైన్ :
కొత్తగా లాంచ్ చేసిన ఆర్టీఆర్ 160 4వీ కొన్ని ముఖ్యమైన ఫీచర్లతో వస్తుంది. సెగ్మెంట్‌లో బెస్ట్ ఆప్షన్లు కలిగి ఉంది. గోల్డెన్ షేడ్‌లో ఫ్రంట్ సైడ్ అప్‌సైడ్ డౌన్ (USD) టెలిస్కోపిక్ ఫోర్క్‌లను పొందుతుంది. బ్యాక్ సైడ్ షాక్ అబ్జార్బర్‌తో సపోర్టు ఇస్తుంది. బ్రాండ్ బోల్డ్‌గా కనిపించేలా బుల్‌పప్ ఎగ్జాస్ట్‌ను కూడా కలిగి ఉంది.
ఇంధన ట్యాంక్, సైడ్ ఫెండర్‌తో సహా ఆకట్టుకునే ఫీచర్లను కలిగి ఉంది. ఫ్రంట్ సైడ్‌లో ఆర్టీఆర్ 160 4వి ఎల్ఈడీ హెడ్‌లైట్ యూనిట్‌ను పొందుతుంది. రెండు చివర్లలో హాలోజన్ ఇండికేటర్లతో కూడిన ఇంటిగ్రేటెడ్ డీఆర్ఎల్ కలిగి ఉంది. మోడల్‌కు ఏదో ఒకవిధంగా ఇంజిన్‌ను ప్రొటెక్ట్ చేసే కవర్ కలిగి ఉంది. సౌకర్యం కోసం బ్యాక్ సైడ్ ప్రయాణీకులకు గ్రాబ్ హ్యాండిల్స్‌తో సింగిల్ సీటింగ్‌తో వస్తుంది.
ఇంజిన్ పవర్ ఫీచర్లు :
టీవీఎస్ అపాచీ 160 4వీ 159.7సీసీ ఇంజిన్‌ను ఉపయోగిస్తుంది. స్పోర్ట్స్ మోడ్‌లో ఉంచినప్పుడు గరిష్టంగా 17బీహెచ్‌పీ 14.73ఎన్ఎమ్ గరిష్ట టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. అర్బన్ వంటి ఇతర మోడ్‌ల విషయానికి వస్తే.. టార్క్ అవుట్‌పుట్ 14.14Nm వద్ద ఉంది. పవర్ సోర్స్ 5-స్పీడ్ ట్రాన్స్‌మిషన్‌తో వస్తుంది. పోటీదారుల విషయానికొస్తే.. హోండా హార్నెట్ 2.0, హీరో ఎక్స్‌ట్రీమ్ 160ఆర్, కొత్తగా పల్సర్ ఎన్160, పల్సర్ ఎన్ఎస్160లకు పోటీగా వస్తుంది.