చికాగోలో ఉంటూ వ్యాపారంలో అబద్ధపు లాభాలు సృష్టిస్తున్నారని ముగ్గురు భారత సంతతికి చెందిన వ్యక్తులపై ఆరోపణలు గుప్పుమన్నాయి. ఈ ఘటనను ఫెడరల్ అథారిటీ సీరియస్‌గా తీసుకుంది. అవుట్ కమ్ హెల్త్ సహ వ్యవస్థాపకులు అయిన రిషి షా(33), శ్రద్ధా అగర్వాల్ 34, మాజీ ఉద్యోగి ఆశిక్ దేశాయ్ 26లతో సహా ఆరుగురు ఈ మోసానికి పాల్పడ్డారని అధికారులు తెలిపారు.
ఏదైనా కంపెనీ విలువను బట్టి అది పొందుతున్న ఆర్థిక లాభాలను బేరీజు వేసుకుని పెట్టుబడులకు ముందుకు వస్తారు. ఇదే కోణంలో ఆలోచించి లెండర్లను, ఇన్వెస్టర్లను, ఆడిటర్లను మోసం చేస్తూ అదనపు ఆధాయాన్ని లెక్కల్లో చూపించారు. ఓ స్టార్టప్ కంపెనీ ఇంతటి త్వరగా ఎదుగుతుందని షేర్లు కొనుగోలు చేసేందుకు భారీగా ముందుకు వచ్చారు.
తమ బ్రాండింగ్‌పై మార్కెట్లో రూమర్లు పుట్టించి అడ్వర్టైజింగ్‌కు భారీగా వసూలు చేశారు. ఆదాయం 1బిలియన్ అమెరికన్ డాలర్లు వస్తున్నట్లుగా చిత్రీకరించారు. ఫలితంగా షా, అగర్వాల్, పూర్డీలపై మెయిల్ మోసం, బ్యాంక్ మోసం లాంటి కేసులు నమోదయ్యాయి. చీటింగ్ కు పాల్పడిన ప్రతి ఒక్కరిపై ఫోకస్ పెట్టిన అధికారులు శిక్షలు విధించారు.