DA Allowance
DA Allowance : కేంద్ర సర్కారు ఉద్యోగులు, పెన్షనర్లకు అతి భారీ గుడ్ న్యూస్.. పండగ వేళ డీఏ, డీఆర్ పెంపుపై కేంద్ర కేబినెట్ కీలక నిర్ణయం తీసుకున్నట్టు సమాచారం.. నివేదికల ప్రకారం.. కేబినెట్ ఆమోదం తర్వాత పెరిగిన కొత్త డీఏ జూలై 1, 2025 నుంచి అమల్లోకి వస్తుంది. ఈ పెంపుతో కేంద్ర ప్రభుత్వంలో పనిచేసే దాదాపు 1.15 కోట్ల మంది ఉద్యోగులు, పెన్షనర్లకు భారీ రిలీఫ్ కలగనుంది.
వాస్తవానికి, డీఏ అనేది జీవన వ్యయంపై (DA Allowance) అందించే వేతనం. ఈ ఏడాది జనవరిలో 53శాతం నుంచి 55శాతానికి (2శాతం పెంపు) పెరిగింది. ఇప్పుడు 3శాతం కొత్త పెంపుతో కేంద్ర ఉద్యోగుల జీతాలు, పెన్షన్లు భారీగా పెరగనున్నాయి. ఏడాదికి రెండుసార్లు డీఏను సవరించి లెక్కిస్తారు. వినియోగదారుల ధరల సూచిక (CPI) డేటా ఆధారంగా ఈ పెంపు ఉంటుంది. పెరుగుతున్న ధరలకు అనుగుణంగా సాధారణంగా ప్రతి ఏడాది జనవరి, జూలైలలో డీఏ సవరిస్తుంటారు.
డీఏ, డీఆర్ అంటే ఏంటి? :
ప్రభుత్వ జీతాలు, పెన్షన్లలో డీఏ, డీఆర్ అత్యంత ముఖ్యమైనది. ద్రవ్యోల్బణం ప్రభావాన్ని తగ్గించడం, కొనుగోలు శక్తిని పెంచడమే ఉద్దేశ్యం. కేంద్ర ప్రభుత్వం ఈ డీఏ, డీఆర్ సంవత్సరానికి రెండుసార్లు (జనవరి, జూలైలో) సమీక్షిస్తుంది. ప్రతి 6 నెలలకు ఉద్యోగులు, పెన్షనర్ల ఆదాయాలపై ప్రత్యక్ష ప్రభావం పడుతుంది.
చివరి పెరుగుదల ఎంత? :
మార్చి 2025లో కేంద్ర ప్రభుత్వం జనవరి 1, 2025 నుంచి డీఏ, డీఆర్‌లను 2శాతం పెంచింది. ఈ పెరుగుదల రేటును 55శాతానికి తీసుకువచ్చింది. ఆ సమయంలో, జనవరి నుంచి మార్చి వరకు బకాయిలు కూడా సకాలంలో చెల్లించింది. ఉద్యోగులు, పెన్షనర్లకు భారీ ఉపశమనం కలిగించింది.
జీతం ఎంత పెరుగుతుంది? :
ఈ 3శాతం డీఏ పెంపు ఉంటే.. 7వ వేతన సంఘం ప్రకారం.. కనీస ప్రాథమిక జీతం రూ. 18వేలు పొందే ఉద్యోగి నెలవారీ ఆదాయం సుమారు రూ. 540 పెరుగుతుంది. దాంతో వారి మొత్తం జీతం రూ. 28,440 అవుతుంది. అలాగే, కనీస పెన్షన్ రూ. 9వేలు పొందే పెన్షనర్ల పెన్షన్ రూ. 270 పెరుగుతుంది. వారి మొత్తం జీతం రూ. 14,220 అవుతుంది.
ప్రతిపాదిత పెంపుదల అంటే.. రూ. 60వేలు కనీస వేతనం ఉన్న ఉద్యోగికి అదనంగా రూ. 34,800 డీఏ లభిస్తుంది. మార్చి పెంపు తర్వాత వారికి చెల్లించే రూ. 33వేలు డీఏ పెరుగుతుంది. ఉదాహరణకు.. ఉద్యోగి కనీసం వేతనం రూ.50వేలు ఉంటే.. గత డీఏ పెంపుతో రూ.26,500 పొందుతారు. దీపావళికి ముందు ఈ ప్రకటనతో ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లకు భారీగా ప్రయోజనం కలుగుతుంది.