Samsung Galaxy S26 Ultra : శాంసంగ్ కొత్త ఫ్లాగ్‌షిప్ S26 అల్ట్రా ఫోన్ వచ్చేస్తోందోచ్.. లాంచ్‌కు ముందే కీలక ఫీచర్లు లీక్.. ధర ఎంత ఉండొచ్చంటే? ఫుల్ డిటెయిల్స్

Samsung Galaxy S26 Ultra : శాంసంగ్ నుంచి నెక్స్ట్ ఫ్లాగ్‌షిప్ ఫోన్‌ వస్తోంది. లీక్‌ల ప్రకారం.. గెలాక్సీ S26 అల్ట్రా ఫోన్ ఫీచర్లు లీక్ అయ్యాయి.

Samsung Galaxy S26 Ultra : శాంసంగ్ కొత్త ఫ్లాగ్‌షిప్ S26 అల్ట్రా ఫోన్ వచ్చేస్తోందోచ్.. లాంచ్‌కు ముందే కీలక ఫీచర్లు లీక్.. ధర ఎంత ఉండొచ్చంటే? ఫుల్ డిటెయిల్స్

Samsung Galaxy S26 Ultra

Updated On : October 1, 2025 / 1:27 PM IST

Samsung Galaxy S26 Ultra : కొత్త శాంసంగ్ ఫోన్ కోసం చూస్తున్నారా? అతి త్వరలో శాంసంగ్ గెలాక్సీ S26 అల్ట్రా ఫోన్ రాబోతుంది. ఈ బ్రాండ్ ఫ్లాగ్‌షిప్ లైనప్‌లో మరో సరికొత్త గెలాక్సీ S26 అల్ట్రా లాంచ్ కానుంది. 2026లో రాబోయే స్మార్ట్‌ఫోన్‌లలో ఇదొకటి. అధికారిక లాంచ్ ఇప్పట్లో లేనప్పటికీ డిజైన్, స్పెక్స్, ధర లాంచ్ తేదీ వరకు అనేక లీకులు బయటకు వచ్చాయి.. అవేంటో ఓసారి లుక్కేయండి.

శాంసంగ్ గెలాక్సీ S26 అల్ట్రా డిజైన్ :
లేటెస్ట్ రెండర్‌లను పరిశీలిస్తే.. శాంసంగ్ గెలాక్సీ S26 అల్ట్రా డిజైన్ విషయంలో (Samsung Galaxy S26 Ultra) ఎలాంటి మార్పులు చేయడం లేదని సూచిస్తున్నాయి. శాంసంగ్ S25 అల్ట్రాతో సమానంగా ఎడ్జ్, కొద్దిగా కర్వడ్ కార్నర్ కలిగి ఉంటుంది. అయితే, మైక్రో అప్‌గ్రేడ్స్ ఉన్నాయి.

లీకైన కొలతలు ఒక మిల్లీమీటర్ కన్నా తక్కువ పొడవు, వెడల్పుగా ఉంటుందని సూచిస్తున్నాయి. అయితే, మందం 8.2mm నుంచి 7.9mm వరకు తగ్గింది. శాంసంగ్ కొత్త లెన్స్ డిజైన్‌ను ప్రవేశపెట్టినట్లు కనిపిస్తోంది. గెలాక్సీ Z ఫోల్డ్ 7లో మాదిరిగా కెమెరా సెటప్ ఉండొచ్చు. ప్రీమియం లుక్‌ను అందిస్తుంది.

Read Also : RBI Repo Rate : మళ్లీ నిరాశే.. రెండోసారి కీలక వడ్డీ రేట్లు మారలేదు.. ఆర్బీఐ రెపో రేటు 5.5 శాతం వద్దనే..!

శాంసంగ్ గెలాక్సీ S26 అల్ట్రా కెమెరా, స్పెసిఫికేషన్లు (అంచనా) :
హుడ్ కింద, శాంసంగ్ గెలాక్సీ S26 అల్ట్రా క్వాల్‌కామ్ లేటెస్ట్ స్నాప్‌డ్రాగన్ 8 ఎలైట్ జెన్ 5 ప్రాసెసర్‌తో వస్తుందని భావిస్తున్నారు. 12GB ర్యామ్, 256GB ఇంటర్నల్ స్టోరేజీతో వస్తుంది. ఫ్రంట్ సైడ్ 120Hz రిఫ్రెష్ రేట్‌తో 6.9-అంగుళాల భారీ OLED డిస్‌ప్లేతో పొందవచ్చు.

60W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్‌తో 5500mAh యూనిట్‌తో వస్తుందని భావిస్తున్నారు. లీక్‌ల ప్రకారం.. శాంసంగ్ S26 అల్ట్రా ఫోన్ 200MP సోనీ ప్రైమరీ సెన్సార్ (S25 అల్ట్రాలో ISOCELL షూటర్), 50MP పెరిస్కోప్ టెలిఫోటో 50MP అల్ట్రా-వైడ్, 12MP టెలిఫోటో లెన్స్‌, క్వాడ్ రియర్ కెమెరా సెటప్‌ ఉండవచ్చు.

భారత్‌లో శాంసంగ్ గెలాక్సీ S26 అల్ట్రా ధర, లాంచ్ తేదీ (అంచనా) :
శాంసంగ్ సాధారణ షెడ్యూల్‌ ఫాలో అయితే.. శాంసంగ్ గెలాక్సీ S26 అల్ట్రా ఫోన్ జనవరి 2026 ద్వితీయార్థంలో బహుశా జనవరి 15 నుంచి జనవరి 25 మధ్య ప్రపంచవ్యాప్తంగా లాంచ్ అయ్యే అవకాశం ఉంది. ధర విషయానికి వస్తే.. ముందస్తు లీక్‌లు ఇలా సూచిస్తున్నాయి..

భారత్ ధర : రూ. 1,34,999
అమెరికా : 1,299 డాలర్లు
దుబాయ్ : 4,699 (AED)