×
Ad

Best Selfie Camera Phones : కొత్త ఫోన్ కావాలా? రూ. 25వేల లోపు 5 బెస్ట్ సెల్ఫీ కెమెరా స్మార్ట్‌ఫోన్లు ఇవే.. ఏది కొంటారో మీ ఇష్టం..!

Best Selfie Camera Phones : కొత్త స్మార్ట్‌ఫోన్ కావాలా? 2025లో భారత మార్కెట్లో 5 బెస్ట్ సెల్ఫీ కెమెరా ఫోన్లు లభ్యమవుతున్నాయి. ఇందులో ఏ ఫోన్ కొంటారో కొనేసుకోండి.

Best Selfie Camera Phones

Best Selfie Camera Phones : కొత్త స్మార్ట్‌ఫోన్ కొనేందుకు చూస్తున్నారా? ప్రత్యేకించి సెల్ఫీ కెమెరా ఫోన్ కోసం చూస్తుంటే ఇది మీకోసమే.. ప్రస్తుతం మార్కెట్లో సెల్ఫీ కెమెరా స్మార్ట్‌ఫోన్లు లభ్యమవుతున్నాయి. ఈ స్మార్ట్‌ఫోన్‌లు కూడా మీ బడ్జెట్ ధరలోనే అందుబాటులో ఉన్నాయి. రూ. 25వేల లోపు ధరలో 5 అద్భుతమైన బెస్ట్ సెల్ఫీ కెమెరా ఫోన్లు ఉండగా ఇందులో ఏ ఫోన్ కొంటారో మీరు కొనేసుకోండి.

రియల్‌మి P4 ప్రో (రూ. 23,999) :
రియల్‌మి P4 ప్రో ఫోన్ 50ఎంపీ సెల్ఫీ కెమెరా (Best Selfie Camera Phones) కలిగి ఉంది. పవర్‌ఫుల్ ఫొటోలను క్యాప్చర్ చేస్తుంది. బ్యాక్ సైడ్ డ్యూయల్ 50ఎంపీ + 8ఎంపీ కెమెరాతో వస్తుంది. ఈ ధర రేంజ్‌లో రియల్‌మి P4 ప్రో భారీ 7000ఎంఏహెచ్ బ్యాటరీతో అద్భుతమైన కెమెరా ఫీచర్లను అందిస్తుంది.

వివో T4 (రూ. 20,999)
ఈ ఏడాది ప్రారంభంలో వివో 32MP సెల్ఫీ కెమెరాతో వివో T4 ఆవిష్కరించింది. బ్యాక్ సైడ్ స్టూడియో లాంటి పోర్ట్రెయిట్ ఫొటోలను క్లిక్ చేసేందుకు స్మార్ట్‌ఫోన్‌లో డ్యూయల్ 50MP కెమెరా ఉంది. సూర్యకాంతిలో ఫొటోలను క్లిక్ చేసేందుకు 5000-నిట్ పీక్ బ్రైట్‌నెస్, 7300mAh బ్యాటరీతో వస్తుంది. బ్యాటరీపరంగా ఎలాంటి ఇబ్బంది పడాల్సిన అవసరం ఉండదు.

Read Also : Redmi Note 14 Pro Plus : కొత్త ఫోన్ కొంటున్నారా? భారీగా తగ్గిన రెడ్‌మి నోట్ 14 ప్రో ప్లస్.. ఫ్లిప్‌కార్ట్‌లో జస్ట్ ఎంతంటే?

మోటోరోలా G96 (రూ. 19,899) :
32MP వైడ్ కెమెరాతో మోటోరోలా G96 అద్భుతమైన సెల్ఫీలు తీసుకోవచ్చు. డ్యూయల్ 50MP+8MP బ్యాక్ కెమెరా కలిగి ఉంది. స్నాప్‌డ్రాగన్ 7s జెన్ 2, ఆండ్రాయిడ్ 15 ద్వారా ఆధారితమైన ఈ స్మార్ట్‌ఫోన్ అద్భుతమైన ఎక్స్‌పీరియన్స్ అందిస్తుంది.

ఐక్యూ Z10 (రూ. 20,221) :
ఐక్యూ Z10 ఫోన్ 32MP సెల్ఫీ కెమెరా, 50MP డ్యూయల్ మెయిన్ కెమెరాతో వస్తుంది. ఐక్యూ Z10 ప్రొఫెషనల్ లాంటి ఫొటోలు క్లిక్ చేయొచ్చు. భారీ 7300mAh బ్యాటరీతో ఈ ఐక్యూ ఫోన్ సాధారణం కన్నా ఎక్కువసేపు ఉంటుంది.

నథింగ్ ఫోన్ 3a (రూ. 24,759) :
నథింగ్ ఫోన్ 3aలో 32MP సెల్ఫీ కెమెరా, ట్రిపుల్ బ్యాక్ కెమెరా సెటప్ ఉన్నాయి. ఇందులో 50MP + 50MP + 8MP 2x ఆప్టికల్ జూమ్‌తో వస్తుంది. 5000mAh బ్యాటరీ, 50W వైర్డ్ ఛార్జర్‌తో ఈ ఫోన్ కేవలం 56 నిమిషాల్లో 100శాతం ఛార్జ్ అవుతుందని కంపెనీ పేర్కొంది.