5 Mistakes That Can Negatively Impact Your CIBIL Score
CIBIL Score : మీ సిబిల్ స్కోరు తగ్గిందా? ఎందుకు ఇలా సడెన్‌గా సిబిల్ స్కోరు తగ్గిందో తెలియడం లేదా? అందుకు అనేక కారణాలు ఉంటాయి. మందుగా మీకు తెలిసో తెలియకో కొన్నిసార్లు పొరపాట్లు చేస్తుంటారు. ఈ పొరపాట్ల కారణంగానే మీ సిబిల్ స్కోరు అమాంతం పడిపోతుంటుంది. ఏదైనా అత్యవసరమైనప్పుడు బ్యాంకుల్లో లోన్ కోసం ట్రై చేస్తుంటే సిబిల్ స్కోరు తగ్గడం కారణంగా ఆయా బ్యాంకులు లోన్లను మంజూరు చేసేందుకు నిరాకరిస్తాయి.
మీకు కూడా ఇలాంటి అనుభవమే ఎదురైందా? అయితే, గతంలో మీ సిబిల్ స్కోరు ఎందుకు తగ్గడమే ఇందుకు కారణాలుగా చెప్పవచ్చు. మీ సిబిల్ స్కోరు తగ్గడానికి కారణాలపై తప్పక అవగాహన ఉండాలి. ఇంతకీ సిబిల్ స్కోరు అంటే ఏంటి? ఇది మీ ఆర్థిక లావాదేవీలపై ఎలాంటి ప్రభావం చూపిస్తుందో వివరంగా పరిశీలిద్దాం.
సిబిల్ స్కోరు అంటే ఏంటి? :
సిబిల్ స్కోరు అనేది ప్రతిఒక్కరికి అత్యంత ముఖ్యమైనది. కానీ, చాలామందికి ఈ సిబిల్ స్కోరు ఎలా పనిచేస్తుంది అనేది అవగాహన ఉండదు. సిబిల్ స్కోర్ ప్రాముఖ్యత గురించి తెలియదు. సిబిల్ స్కోర్ అనేది ఒక వ్యక్తి క్రెడిట్ హిస్టరీని తెలియజేస్తుంది. వారి చెల్లింపు అలవాట్లను స్కోరు ద్వారానే ఫైనాన్స్ సంస్థలు, బ్యాంకులు లెక్కిస్తాయి.
ప్రతి వ్యక్తి గుడ్ సిబిల్ స్కోర్‌ను కలిగి ఉండటం చాలా ముఖ్యం. కానీ, చాలా మంది తమ సిబిల్ స్కోర్ గురించి తీవ్రంగా ఆలోచించరు. దీని కారణంగా వారి సిబిల్ స్కోర్ క్షీణిస్తూనే ఉంటుంది. భవిష్యత్తులో ఆర్థికపరంగా అనేక ఇబ్బందులను ఎదుర్కోవలసి ఉంటుంది.
గుడ్ సిబిల్ స్కోరు కలిగి ఉండటం ద్వారా బ్యాంకు నుంచి లోన్ తీసుకోవడం ద్వారా భవిష్యత్తులో మీ ఆర్థిక అవసరాలను సులభంగా తీర్చుకోవచ్చు. మరోవైపు, మీ సిబిల్ స్కోరు బాగాలేదంటే క్లిష్ట సమయాల్లో మీరు బ్యాంకు నుంచి పొందలేరు. ఇలాంటి పరిస్థితిలో, ప్రతి వ్యక్తి తన సిబిల్ స్కోర్‌ను మంచిగా ఉంచుకోవడం చాలా ముఖ్యం. మీ సిబిల్ స్కోరు నేరుగా ప్రభావితం చేసే 5 మిస్టేక్స్ గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
1. మీ బిల్లులు, ఈఎంఐలను సకాలంలో చెల్లించకపోవడం :
మీ లోన్ ఈఎంఐ లేదా మీ క్రెడిట్ కార్డ్ బిల్లును సకాలంలో చెల్లించకపోవడం వల్ల మీ సిబిల్ స్కోర్‌పై ప్రత్యక్ష ప్రభావాన్ని చూపుతుంది. ఇలాంటి పరిస్థితిలో మీ లోన్ ఈఎంఐ, క్రెడిట్ కార్డ్ బిల్లులను ఎల్లప్పుడూ సకాలంలో చెల్లించండి.
2. క్రెడిట్‌ను సరిగ్గా వాడకపోవడం :
మీరు క్రెడిట్ కార్డ్ యూజర్ అయితే, మీరు చాలా విషయాలను గుర్తుంచుకోవాలి. మీ క్రెడిట్ కార్డ్ లిమిట్‌కు మించి ఖర్చు చేయవద్దు. అదే సమయంలో, ఎల్లప్పుడూ క్రెడిట్ కార్డ్ పరిమితిలో 30 శాతం మాత్రమే ఖర్చు చేసేందుకు ప్రయత్నించండి. క్రెడిట్‌ను ఎక్కువగా ఉపయోగించడం వల్ల మీ సిబిల్ స్కోర్ దెబ్బతింటుంది.
3. క్రెడిట్ కార్డు క్లోజ్ చేయడం :
క్రెడిట్ కార్డు కోసం పదే పదే దరఖాస్తు చేయడం వల్ల మీ సిబిల్ స్కోర్ కూడా దెబ్బతింటుంది. క్రెడిట్ కార్డు తీసుకున్నాక కొన్నాళ్లకు ఆ కార్డు వద్దనుకుని క్లోజ్ చేసినా కూడా సిబిల్ స్కోరుపై ప్రభావం పడుతుంది. మీ క్రెడిట్ కార్డును క్లోజ్ చేసిన సమయంలో మీ క్రెడిట్ వినియోగ నిష్పత్తిని పెంచుతుంది. ఫలితంగా మీ సిబిల్ స్కోర్‌ను క్రమేపి తగ్గిస్తుందని గమనించాలి.
Read Also : మీ దగ్గర ఎన్ని క్రెడిట్ కార్డులున్నాయ్.. రెండా? మూడా?.. మీ కోసమే ఈ స్టోరీ.. డోంట్ మిస్..
4. పదే పదే లోన్ కోసం అప్లయ్ చేయడం :
మీరు లోన్ కోసం దరఖాస్తు చేసుకున్నప్పుడు, బ్యాంక్ మీ సిబిల్ స్కోర్‌ను చెక్ చేస్తుంది. ఇదో క్రిటికల్ ఎంక్వైరీగా పిలుస్తారు. ఇలాంటి పరిస్థితిలో, పదే పదే దరఖాస్తు చేసుకోవడం వల్ల మీ సిబిల్ స్కోర్ కూడా భారీగా తగ్గుతుంది.
5. ఒకేసారి ఎక్కువ లోన్లు తీసుకోవడం :
ఒకేసారి ఎక్కువ రుణాలు తీసుకోవడం వల్ల కూడా మీరు ఇబ్బందుల్లో పడవచ్చు. దీని వలన మీపై ఆర్థిక ఒత్తిడి పెరుగుతుంది. మీరు సకాలంలో ఈఎంఐ చెల్లించలేరు. ఫలితంగా మీ సిబిల్ స్కోర్‌పై ప్రభావం చూపుతుంది.