మీ దగ్గర ఎన్ని క్రెడిట్ కార్డులున్నాయ్.. రెండా? మూడా?.. మీ కోసమే ఈ స్టోరీ.. డోంట్ మిస్..
Credit Cards Usage : ఒకటి కన్నా ఎక్కువ క్రెడిట్ కార్డులను వాడటం ఎంతవరకు సరైనది? ఎక్కువ క్రెడిట్ కార్డులను వాడటం వల్ల అనేక నష్టాలు ఉన్నాయి. అలాగే, కొన్ని ప్రయోజనాలు ఉన్నాయి..

Advantages And disadvantages of using more than One
Credit Cards Usage : మీరు క్రెడిట్ కార్డు వాడుతున్నారా? ఎన్ని క్రెడిట్ కార్డులను ఉపయోగిస్తున్నారు. ఒకటి కన్నా ఎక్కువ క్రెడిట్ కార్డులను వాడేవారు తప్పక కొన్ని విషయాలను తెలుసుకోవాలి. ప్రస్తుత రోజుల్లో క్రెడిట్ కార్డులు నిత్యావసరంగా మారాయి. చాలా మంది షాపింగ్, ఆర్థిక లావాదేవీల కోసం క్రెడిట్ కార్డులను తెగ వాడేస్తుంటారు.
Read Also : Personal Loan : మీరు పర్సనల్ లోన్ తీసుకున్నారా? ఈ 3 తప్పులు అసలు చేయొద్దు.. మీ జేబుకు చిల్లు పడ్డట్టే..!
కానీ, క్రెడిట్ కార్డ్ ఒక రకమైన రుణం అనే విషయాన్ని మీరు ఎల్లప్పుడూ గుర్తుంచుకోవాలి. ప్రతి నెలా మీరు క్రెడిట్ కార్డ్ బిల్లు చెల్లించాలి. ఇది కాకుండా, చాలా మంది ఒకటి కన్నా ఎక్కువ క్రెడిట్ కార్డులను కూడా ఉపయోగిస్తున్నారు. ఒకటి కన్నా ఎక్కువ క్రెడిట్ కార్డులను ఉపయోగించడం వల్ల మీకు చాలా పెద్ద సమస్యలు తలెత్తుతాయని గుర్తించాలి.
ఎక్కువ క్రెడిట్ కార్డుల వాడకం ఎంతవరకు సరైనది? :
ఒకటి కన్నా ఎక్కువ క్రెడిట్ కార్డులను వాడటం అనేది పూర్తిగా మీ వినియోగంపై ఆధారపడి ఉంటుంది. ఒకటి కన్నా ఎక్కువ క్రెడిట్ కార్డులను ఉపయోగించడం వల్ల అనేక నష్టాలు ఉన్నాయి. కానీ, ఈ కార్డుల వల్ల మీకు అనేక ప్రయోజనాలను కూడా ఉన్నాయి. ఒకటి కన్నా ఎక్కువ క్రెడిట్ కార్డులను ఉపయోగించడం వల్ల కలిగే లాభాలేంటి? నష్టాలేంటి? ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం.
క్రెడిట్ కార్డులతో కలిగే లాభాలివే :
క్రెడిట్ కార్డ్ ఉపయోగించడం వల్ల కలిగే అతిపెద్ద ప్రయోజనం డిస్కౌంట్లు, ఆఫర్లు. క్రెడిట్ కార్డ్ వాడకంతో మీకు రివార్డ్ పాయింట్లు, క్యాష్‌బ్యాక్, అనేక ఆఫర్ల బెనిఫిట్స్ లభిస్తుంది. అంతేకాదు.. సినిమా టిక్కెట్లు, హోటల్ బుకింగ్‌లపై క్రెడిట్ కార్డ్ ఆఫర్లు కూడా అందుబాటులో ఉన్నాయి.
ఇలాంటి పరిస్థితిలో, మీరు రెండు క్రెడిట్ కార్డులను ఉపయోగిస్తే.. మీకు మరిన్ని ఆఫర్లు, డిస్కౌంట్లు లభిస్తాయి. ఇది కాకుండా, మీరు ఒక క్రెడిట్ కార్డు బిల్లు చెల్లించడానికి మరొక క్రెడిట్ కార్డును కూడా ఉపయోగించవచ్చు.
క్రెడిట్ కార్డులతో కలిగే నష్టాలివే :
వార్షిక ఛార్జీల మాదిరిగానే క్రెడిట్ కార్డును వాడితే మీరు అనేక ఛార్జీలు కూడా చెల్లించాలి. ఇలాంటి పరిస్థితిలో, ఒకటి కన్నా ఎక్కువ క్రెడిట్ కార్డులు కలిగి ఉండటం వల్ల మీరు ఎక్కువ చెల్లించాల్సి ఉంటుంది.
అంతేకాదు.. మీరు క్రెడిట్ కార్డ్ పరిమితి కంటే ఎక్కువ ఖర్చు చేసినా లేదా బిల్లు చెల్లించడంలో ఆలస్యం చేసినా కూడా మీకు ఛార్జీలు భారీగా పడతాయి. మీపై ఆర్థిక భారం పెరగవచ్చు. మీరు సకాలంలో బిల్లు చెల్లించకపోతే మీరు అప్పుల ఊబిలో చిక్కుకోవచ్చు.