Personal Loan : మీరు పర్సనల్ లోన్ తీసుకున్నారా? ఈ 3 తప్పులు అసలు చేయొద్దు.. మీ జేబుకు చిల్లు పడ్డట్టే..!

Personal Loan : పర్సనల్ లోన్ తీసుకుంటున్నారా? తస్మాత్ జాగ్రత్త. ఇలాంటి పరిస్థితుల్లో ఈ మొత్తాన్ని ఇలా తప్పుగా ఉపయోగిస్తే మాత్రం మీ జేబుుకు చిల్లు పడటం ఖాయం.. పర్సనల్ లోన్ ఎక్కడ వాడకూడదో తెలుసుకోండి.

Personal Loan : మీరు పర్సనల్ లోన్ తీసుకున్నారా? ఈ 3 తప్పులు అసలు చేయొద్దు.. మీ జేబుకు చిల్లు పడ్డట్టే..!

These 3 Common Mistakes to Avoid When Taking a Personal Loan

Updated On : January 31, 2025 / 3:01 PM IST

Personal Loan : ప్రతిఒక్కరికి డబ్బు అవసరమే. ప్రతి జీవితంలో ఏదో ఒక సమయంలో డబ్బు అత్యవసరం పడుతుంది. అలాంటి సమయాల్లో చాలామందికి కనిపించే మార్గం.. పర్సనల్ లోన్ తీసుకోవడం.. మీ జీవితంలో అకస్మాత్తుగా ఏదైనా సమస్య వచ్చి మీకు చాలా డబ్బు అవసరం పడితే పర్సనల్ లోన్ తీసుకోవచ్చు. పర్సనల్ లోన్ కొలేటరల్ ఫ్రీ, ఎక్కువ పేపర్ వర్క్ అవసరం లేదు. అన్ని బ్యాంకులు రూ.40 లక్షల వరకు వ్యక్తిగత రుణాలను అందిస్తాయి.

Read Also : Gold Rates Today : సామాన్యులు కొనేదెట్టా.. ప్రపంచవ్యాప్తంగా బంగారానికి రెక్కలు.. మళ్లీ రికార్డు స్థాయిలో గరిష్టానికి.. భారత్‌‌లో ఎంత పెరిగిందో తెలిస్తే షాకవుతారు!

అయితే, పర్సనల్ లోన్ తీసుకునే ముందు.. మీరు ఎలాంటి ప్రయోజనం కోసం తీసుకుంటున్నారో జాగ్రత్తగా ఆలోచించాలి. పర్సనల్ లోన్ వడ్డీ రేట్లు ఇప్పటికే చాలా ఎక్కువగా ఉన్నాయి. అలాంటి పరిస్థితిలో, మీరు ఈ మొత్తాన్ని ఏదైనా ఇతర అనవసర విషయాల కోసం ఉపయోగిస్తే.. మీకు ఆర్థికంగా భారీ దెబ్బ పడుతుంది. మీరు ఏయే విషయాల్లో పర్సనల్ లోన్ ఉపయోగించకూడదో ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం.

1. స్టాక్ మార్కెట్‌లో పెట్టుబడి కోసం :
మీరు ట్రేడింగ్ చేస్తుంటే.. భారీ లాభాలను ఆర్జించడానికి పర్సనల్ లోన్ తీసుకోవడం లాంటి తప్పు ఎప్పుడూ చేయకండి. మితిమీరిన ఆత్మవిశ్వాసంతో తీసుకున్న ఈ అడుగు మిమ్మల్ని పెద్ద ప్రమాదంలో పడేస్తుంది. స్టాక్ మార్కెట్లో ఇప్పటికే చాలా రిస్క్ ఉంది.

అలాంటి పరిస్థితిలో మీరు వ్యక్తిగత రుణం తీసుకోవడం ద్వారా మరో పెద్ద తప్పు చేస్తారు. మీరు షేర్ మార్కెట్‌లో లాభం పొందకపోతే లేదా మీ డబ్బు నిలిచిపోయి, వ్యక్తిగత రుణ ఈఎంఐ అధిక వడ్డీతో ప్రారంభమైతే మీకు పెద్ద సమస్య తలెత్తవచ్చు.

2. రుణం తిరిగి చెల్లించేందుకు :
మీరు ఎక్కడి నుండైనా రుణం తీసుకున్నట్లయితే.. పర్సనల్ లోన్ తీసుకొని ఆ మొత్తాన్ని తిరిగి చెల్లించడం సరికాదు.. ఇలా చేయడం వల్ల మీరు కచ్చితంగా ఒకే చోట నుండి రుణవిముక్తి పొందుతారు, కానీ మీరు వ్యక్తిగత రుణ చక్రంలో చిక్కుకుపోతారు. చాలా సంవత్సరాల పాటు ఈఎంఐలు చెల్లిస్తూనే ఉంటారు. మీరు ఈ రుణాన్ని తిరిగి చెల్లించలేకపోతే.. ఆర్థిక పరిస్థితి మరింత కఠినంగా మారుతుంది. ఇలాంటి పరిస్థితిలో, మీరు బాధపడటం తప్ప ఏం చేయలేరని గమనించాలి.

3. ఖరీదైన వస్తువుల కోసం ఖర్చు :
మీకు ఏవైనా వ్యక్తిగత హాబీలు లేదా విలాసవంతమైన ఖర్చులన్నీ అనవసరమైన ఖర్చుల కిందికి వస్తాయి. ఉదాహరణకు.. మీ హాబీల కోసం డైమండ్ నెక్లెస్ లేదా ఉంగరాన్ని కొనుగోలు చేయాలని అనుకుంటున్నారు అనుకోండి లేదా ఖరీదైన మొబైల్ కొనాలని అనుకుంటే.. ఈ ఇష్టాలను నెరవేర్చుకోవడానికి పర్సనల్ లోన్‌ను ఎట్టిపరిస్థితుల్లో తీసుకోకండి.

మీ ఇంటి బడ్జెట్‌ను దృష్టిలో ఉంచుకుని మీ ఇష్టాలను ఒక్కొక్కటిగా నెరవేర్చుకోండి. హోదా కోసం ఈ కోరికలను నెరవేర్చుకోవడానికి ఇలా పర్సనల్ లోన్ తీసుకుని మీకు మీరే సమస్యలను సృష్టించుకుంటారు. ఫలితంగా ఆర్థిక ఇబ్బందుల్లో పడిపోతారు జాగ్రత్త..

Read Also : Union Budget 2025 : ఇదే జరిగితే.. సామాన్యులకు పండగే.. ఈ వస్తువుల ధరలు భారీగా తగ్గనున్నాయి.. అన్ని చౌకగానే..!

పర్సనల్ లోన్ ఎప్పుడు తీసుకోవాలి? :
మీకు చాలా డబ్బు అవసరం పడటం లేదా మెడికల్ ఎమర్జెన్సీ సమయంలో ఎక్కడి నుండైనా డబ్బును ఏర్పాటు కాకపోతే.. మీరు ఈ పర్సనల్ లోన్ ఎంచుకోవచ్చు. కానీ, అటువంటి పరిస్థితిలో కూడా మీరు లోన్ తీసుకున్నాక మీరు ఈఎంఐ సకాలంలో చెల్లించగలరా? లేదా అనేది గమనించుకోవాలి.

వీటన్నింటి తర్వాత మాత్రమే పర్సనల్ లోన్ కోసం దరఖాస్తు చేసుకోండి. మీరు అప్పటికి తిరిగి చెల్లించలేకపోతే.. మీ సిబిల్ (CIBIL) స్కోర్‌పై దెబ్బపడుతుంది. భవిష్యత్తులో మీకు లోన్ వచ్చే అవకాశాలు తగ్గిపోతాయి.