Union Budget 2025 : ఇదే జరిగితే.. సామాన్యులకు పండగే.. ఈ వస్తువుల ధరలు భారీగా తగ్గనున్నాయి.. అన్ని చౌకగానే..!
Union Budget 2025 : బడ్జెట్‌పై ప్రజల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. అనేక రోజువారీ వినియోగ వస్తువులు చౌకగా మారుతాయని భావిస్తున్నారు. విదేశీ కంపెనీలు భారత మార్కెట్లో స్మార్ట్‌ఫోన్‌లు, గాడ్జెట్‌లను తయారీపై ఆసక్తి చూపుతున్నాయి.

Mobile Phones And Electric Vehicles
Union Budget 2025 : కేంద్ర బడ్జెట్ 2025కు సమయం ఆసన్నమైంది. బడా వ్యాపారవేత్తల నుంచి సామాన్యుల వరకు అందరూ బడ్జెట్ కోసమే ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. రాబోయే బడ్జెట్‌లో ఎలాంటి ప్రోత్సాహకాలు ఉండనున్నాయో తెలుసుకునేందుకు ఎంతో ఉత్సాహంగా ఉన్నారు. సాధారణంగా ప్రతి బడ్జెట్‌లో ఏదో వస్తువులపై తగ్గింపు లేదా ధరల పెంపు కామన్. ఇది అందరికీ తెలిసిందే. ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఫిబ్రవరి 1, 2025న కేంద్ర బడ్జెట్‌ను సమర్పించనున్నారు.
Read Also : Union Budget 2025 : ఫిబ్రవరి 1న బడ్జెట్.. అప్పటిలా షేర్ మార్కెట్‌పై అదే అనవాయితీ.. వారాంతంలో ట్రేడింగ్..!
నిత్యావసర వస్తువుల నుంచి అన్నింటిపై :
ప్రతి ఏడాది మాదిరిగానే భారీ అంచనాలు నెలకొన్నాయి. రోజువారీ అవసరాల నుంచి ఆదాయపు పన్ను వరకు ప్రతి పౌరునిపై బడ్జెట్ ప్రకటనలు నేరుగా ప్రభావం చూపుతాయి. ప్రధానంగా పన్ను మార్పుల కారణంగా.. రోజువారీ అవసరాల నుంచి ఆటోమొబైల్స్, గాడ్జెట్‌ల వరకు అన్నింటి ధరలు బడ్జెట్‌పై ఆధారపడి ఉంటాయి.
ఈ సంవత్సరం, చాలా మంది ఎలక్ట్రానిక్స్‌పై దృష్టి పెట్టారు. ఎలక్ట్రానిక్స్ వస్తువులు ఏమైనా చౌకగా మారతాయా? అని ఆసక్తిగా చూస్తున్నారు. ఇదే నిజమైతే.. మొబైల్ ఫోన్లు, టీవీలు, ల్యాప్‌టాప్‌లు, ఇతర ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్ల ధరలు భారీగా తగ్గే అవకాశం కనిపిస్తోంది.
ఇప్పటికే ప్రధాన నరేంద్ర మోదీ కూడా డిజిటల్ ఇండియాను ప్రశంసించారు. డిజిటల్ ఉత్పత్తుల వినియోగాన్ని కూడా ఆయన ప్రోత్సహించారు. ఈ బడ్జెట్‌లో డిజిటల్ ఉత్పత్తులకు సంభావ్య ధర తగ్గుదలని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. ముఖ్యంగా స్మార్ట్‌ఫోన్‌లు, ల్యాప్‌టాప్‌లు, టీవీల కోసం తక్కువ ధరకే అమ్మకాలను పెంచుతాయి. తద్వారా డిజిటల్ ఇండియాను విస్తరించవచ్చు. బడ్జెట్ ఇంత తగ్గింపు అందిస్తుందా? అని అందరూ ఆసక్తిగా చూస్తున్నారు.
వీటిపై దిగుమతి సుంకాలు తగ్గిస్తేనే :
ఎలక్ట్రానిక్ తయారీ భాగాలపై దిగుమతి సుంకాలు తగ్గిస్తే, ఎలక్ట్రానిక్స్ ధరలు తగ్గవచ్చు. కొన్ని ఎలక్ట్రానిక్ వస్తువులు, ఎలక్ట్రిక్ వాహనాలు ధరలను తగ్గించవచ్చు. మొబైల్‌లు, స్మార్ట్ టీవీలు, ల్యాప్‌టాప్‌లు మరింత సరసమైనవిగా మారవచ్చు.
ఎలక్ట్రానిక్స్ విడిభాగాలకు డిస్కౌంట్లు అందిస్తే అనేక ఉత్పత్తులను చౌకగా మారుతాయి. ఫలితంగా మొబైల్ ఫోన్ ఖర్చులు కూడా తగ్గవచ్చు. ఇప్పటికే రీఛార్జ్ ప్లాన్ ధరలు పెరగడం కొంత ఆందోళన కలిగిస్తోంది. టెలికాం కంపెనీలు పెరుగుతున్న సాంకేతికత, మౌలిక సదుపాయాల ఖర్చులను ఉదహరించవచ్చు.
మేక్ ఇండియాను నరేంద్ర మోదీ ప్రభుత్వం ఎప్పుటినుంచో ప్రోత్సహిస్తోంది. అనేక రంగాలలో వస్తువులు, సేవల దేశీయ ఉత్పత్తిని కూడా ప్రోత్సహిస్తోంది. ఎలక్ట్రానిక్స్ అమ్మకాలు ప్రతి ఏడాది పెరుగుతూనే ఉన్నాయి. వీటిని దిగుమతి చేయకుండా భారత్‌లోనే తయారు చేస్తే.. విదేశీ కరెన్సీ ఆదా అవుతుంది. ఈ నేపథ్యంలో దేశీయంగా ఎలక్ట్రానిక్స్ తయారీలో వినియోగించే విడిభాగాల దిగుమతిపై సుంకాన్ని తగ్గించాలన్న డిమాండ్ బలంగా వినిపిస్తోంది.
బ్యాటరీల ధరలు కూడా తగ్గే అవకాశం :
విదేశీ కంపెనీలు భారత్‌లో ఫోన్లు, ఇతర గాడ్జెట్‌ల తయారీకి ఆసక్తి చూపుతున్నాయి. ఈ నేపథ్యంలో పరిశ్రమల డిమాండ్‌కు అనుగుణంగా డ్యూటీ తగ్గించే అవకాశం ఉందని నిపుణులు అంచనా వేస్తున్నారు. ఇదే జరిగితే, ఎలక్ట్రానిక్స్ ధరలు భారీగా తగ్గే అవకాశం లేకపోలేదు.
ఎలక్ట్రిక్ వాహనాల ఖర్చులో పెద్ద వాటా ఉన్న బ్యాటరీల తయారీకి పరిశ్రమను ప్రోత్సహించవచ్చు. ఈ అంచనాలు నిజమైతే.. ఎలక్ట్రిక్ వాహనాలతో పాటు బ్యాటరీల ధరలు కూడా భారీగా తగ్గవచ్చు. నిత్యావసర వస్తువుల ధరలు కూడా తగ్గే అవకాశం ఉంది.