iPhone SE 4 Launch : ఆపిల్ లవర్స్‌కు గుడ్ న్యూస్.. ఐఫోన్ SE 4 ఫోన్ లాంచ్ డేట్ ఇదే.. టిమ్‌కుక్ టీజర్ వదిలాడు చూశారా..!
iPhone SE 4 Launch : ఆపిల్ రిలీజ్ చేసిన ఈ 7 సెకన్ల ప్రమోషనల్ వీడియోలో మెరిసే రింగ్ మధ్య మెటాలిక్ ఆపిల్ లోగో కనిపిస్తుంది. ఈ కొత్త ఫోన్ ఆపిల్ ఏ ప్రొడక్టు సంబంధించి అనేది టీజర్ క్లారిటీ ఇవ్వలేదు.

Apple iPhone SE 4
iPhone SE 4 Launch : ఆపిల్ అభిమానులకు గుడ్ న్యూస్.. ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఐఫోన్ SE 4 ఫోన్ వచ్చేస్తోంది. ఈ ఫిబ్రవరిలో ఐఫోన్ SE 4 ఫోన్ లాంచ్ కానుంది. చాలా కాలంగా ఐఫోన్ SE 4 ఫోన్ గురించి అనేక లీకైన నివేదికలు వస్తున్నాయి. ఇప్పుడు ఆ నిరీక్షణకు ముగింపు పలకబోతోంది. కంపెనీ సీఈఓ టిమ్ కుక్ ఐఫోన్ SE 4 ఫోన్ (iPhone SE 4 Launch) టీజర్ విడుదల చేయడంతో రాబోయే ఆపిల్ ఈవెంట్ గురించి టెక్ ఔత్సాహికులు మరింత ఉత్సాహంగా ఉన్నారు.
అంచనాలు కచ్చితమైనవి అయితే, సరసమైన ధరలో ఐఫోన్ ఎస్ఈ 4 ఫోన్ మార్కెట్లోకి రానుంది. కొత్త లుక్, మెరుగైన యాక్టివిటీ వంటి అప్‌గ్రేడ్స్ ఉండవచ్చు. ఫోర్త్ జనరేషన్ మోడల్ ఐఫోన్ ఎస్ఈ సిరీస్ ట్రెండ్‌ను కొనసాగిస్తుందని మార్కెట్ విశ్లేషకులు భావిస్తున్నారు. తక్కువ ధరలో ఆకర్షణీయమైన ఫీచర్లను అందించనుంది. ఆపిల్ అధికారికంగా లాంచ్ తేదీని ప్రకటించలేదు. లీక్‌ల ప్రకారం.. ఐఫోన్ SE 4 ఫోన్ కోసం ఎక్కువసేపు వేచి ఉండాల్సిన అవసరం లేదని చెబుతున్నాయి.
ఐఫోన్ SE 4 ఫోన్ లాంచ్ తేదీ (అంచనా) :
ఆపిల్ ఈ ఏడాదిలో మొదటి ఐఫోన్ మోడల్ ప్రవేశపెట్టనుంది. ఫిబ్రవరి 19న ఐఫోన్ SE 4 ఫోన్ లాంచ్ అయ్యే అవకాశం ఉంది. “మా ఫ్యామిలీలో మరో కొత్త సభ్యుడిని కలవడానికి సిద్ధంగా ఉండండి’’ అనే క్యాప్షన్‌తో యానిమేటెడ్ ఆపిల్ లోగోతో, సీఈఓ టిమ్ కుక్ ఎక్స్ వేదికగా ఈవెంట్‌ను టీజ్ చేసి తేదీని నిర్ధారించారు. ఆపిల్ రిలీజ్ చేసిన ఈ 7 సెకన్ల ప్రమోషనల్ వీడియోలో మెరుస్తున్న రింగ్ మధ్య మెటాలిక్ ఆపిల్ లోగో కనిపిస్తుంది. అయితే, ఈ కొత్త ఫోన్ ఆపిల్ ఏ ప్రొడక్టు రేంజ్‌కు చెందుతుందో టీజర్ స్పష్టం చేయలేదు.
Get ready to meet the newest member of the family.
Wednesday, February 19. #AppleLaunch pic.twitter.com/0ML0NfMedu
— Tim Cook (@tim_cook) February 13, 2025
ఆపిల్ తన ప్లాన్లను అధికారికంగా వెల్లడించనప్పటికీ, ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఐఫోన్ ఎస్ఈ 4 ప్రధాన ఆకర్షణగా ఉంటుందని చెప్పవచ్చు. మ్యాక్‌బుక్ ఎయిర్, ఐప్యాడ్, విజన్ ప్రో హెడ్‌సెట్‌కు కూడా అప్‌గ్రేడ్స్ ఉంటాయని ఊహాగానాలు వినిపిస్తు్న్నాయి.
ఐఫోన్ ఎస్ఈ 4 ఫీచర్లు, స్పెషిఫికేషన్లు (అంచనా) :
రాబోయే ఆపిల్ ఐఫోన్ SE 4 మోడల్ రీడిజైన్‌తో రానుంది. సాంప్రదాయకంగా కాంపాక్ట్ ఫారమ్ ఫ్యాక్టర్ నుంచి ఐఫోన్ 14 నుంచి ప్రేరణ పొందుతుందని భావిస్తున్నారు. తక్కువ ధరలో ఐఫోన్‌లో పాత 4.7-అంగుళాల ఎల్‌సీడీ స్క్రీన్ స్థానంలో 60Hz రిఫ్రెష్ రేట్‌తో పెద్ద 6.1-అంగుళాల ఓఎల్ఈడీ స్క్రీన్ ఉంటుందని అంచనా. అంతేకాదు.. టచ్ ఐడీ హోమ్ బటన్‌ను ఫేస్ ఐడీతో రిప్లేస్ చేయాలని భావిస్తున్నారు. ఐఫోన్ ఎస్ఈ 2025లో భారీ కెమెరా అప్‌గ్రేడ్స్ ఉంటాయని అంచనా.
ఇందులో ఐఫోన్ SE 3 మోడల్ కనిపించే 12ఎంపీ బ్యాక్ కెమెరాకు బదులుగా 48ఎంపీ బ్యాక్ కెమెరా ఉంటుంది. ఫ్రంట్ కెమెరాకు 24ఎంపీ సెన్సార్ ఉండవచ్చు. ఐఫోన్ మొత్తం డిజైన్ ఐపాడ్ మాదిరిగా గుండ్రని అంచులతో కాకుండా ఇటీవలి మోడళ్ల మాదిరిగానే ఉంటుందని అంచనా. ఐఫోన్ డైనమిక్ ఐలాండ్ ఫీచర్ కూడా ఉండకపోవచ్చు. కానీ, 8జీబీ ర్యామ్, ఆపిల్ A18 చిప్‌తో రన్ అవుతుందని, ఆపిల్ ఇంటెలిజెన్స్‌కు సపోర్టు ఇస్తుందని పుకార్లు సూచిస్తున్నాయి.