Buy Smart TV : కొత్త స్మార్ట్‌టీవీ కొనే ముందు ఈ స్టోరీ చదివి వెళ్లండి.. లేదంటే మీ డబ్బులు గోవిందా..!
Buy Smart TV : మీరు స్మార్ట్ టీవీ కొనాలని చూస్తుంటే ఈ వార్త మీకోసమే.. నిజంగా స్మార్ట్ టీవీ కావాలంటే ఈ 5 ఫీచర్లు తప్పక తెలుసుకుని వెళ్లండి
Smart TV Buying Guide
Buy Smart TV : మీరు కొత్త స్మార్ట్ టీవీ కొనాలని ప్లాన్ చేస్తున్నారా? అయితే, ఈ స్టోరీ మీకోసమే.. ప్రస్తుత రోజుల్లో ఓటీటీ యాప్స్‌కు ఫుల్ క్రేజ్ పెరిగింది. సాధారణ టీవీల కన్నా స్మార్ట్ టీవీలకు ఎక్కువగా కొనేందుకు ఇష్టపడుతున్నారు. సౌండ్ క్వాలిటీ, అద్భుతమైన ఫొటో క్వాలిటీ, భారీ స్క్రీన్‌లు కలిగిన స్మార్ట్ టీవీలనే కొనేందుకు వినియోగదారులు ఆసక్తి చూపుతున్నారు.
చాలామంది ఈ స్మార్ట్ టీవీల వైపు (Buy Smart TV) ఎక్కువగా ఆకర్షితులవుతున్నారు. కానీ, ప్రస్తుతం మార్కెట్లో అనేక రకాల టీవీలు అందుబాటులో ఉన్నాయి. అందులో అన్ని స్మార్ట్‌గా ఉన్నప్పటికీ, కొన్ని ఫీచర్లు సరిగా ఉండటం లేదు. అందుకే మీరు స్మార్ట్ టీవీ కొనాలని చూస్తుంటే ఈ 5 ఫీచర్లు ఉన్నాయో లేదో చెక్ చేయండి. ఇంతకీ ఆయా ఫీచర్లు ఏంటో ఓసారి చూద్దాం..
యాప్ సపోర్ట్, ఆపరేటింగ్ సిస్టమ్ :
మీ టీవీ ఏ (OS)కి సపోర్టు ఇస్తుందో చెక్ చేయండి. ఆండ్రాయిడ్ టీవీ అయినా లేదా గూగుల్ టీవీ అయినా ఏదో ఒక ఆపరేటింగ్ సిస్టమ్ అయి ఉండాలి. ఈ రెండూ ఎక్కువగా యాప్ సపోర్ట్‌ను అందిస్తాయి. అలాగే, Netflix, Prime Video, Hotstar వంటి అన్ని ఓటీటీ యాప్‌లు టీవీలో రన్ అయ్యేలా ఉండాలి.
Read Also : iPhone 16 Price : అమెజాన్ బంపర్ ఆఫర్.. ఐఫోన్ 16పై ఊహించని డిస్కౌంట్.. ఇలా కొన్నారంటే చౌకైన ధరకే..!
రిఫ్రెష్ రేట్, డిస్‌ప్లే ప్యానెల్ :
మీరు టీవీ కొనేందుకు షోరూమ్‌కి వెళ్ళినప్పుడల్లా ముందుగా రిఫ్రెష్ రేట్ లేదా డిస్‌ప్లే ప్యానెల్‌ను చెక్ చేయండి. IPS లేదా VA ప్యానెల్ ఉన్న టీవీని ఎంచుకోండి. మెరుగైన కలర్ బ్రైట్‌నెస్ అందిస్తుంది. అలాగే, టీవీకి కనీసం 60Hz రిఫ్రెష్ రేట్ ఉండాలి.
ప్రాసెసర్, ర్యామ్, స్టోరేజీ :
మీరు కొనే టీవీకి కనీసం 2GB ర్యామ్, 8GB నుంచి 16GB ఇంటర్నల్ స్టోరేజ్ తప్పక ఉండాలి. తద్వారా యాప్‌లు స్పీడ్ రన్ అవుతాయి. తద్వారా పవర్‌ఫుల్ ఎక్స్‌పీరియన్స్ అందిస్తుంది.
కనెక్టివిటీ ఆప్షన్లు :
టీవీని కొనుగోలు చేసేవారు కనక్టివిటీ సమస్యలను నివారించేందుకు పోర్ట్‌లను జాగ్రత్తగా చెక్ చేయండి. USB పోర్ట్, బ్లూటూత్ డ్యూయల్-బ్యాండ్ Wi-Fi సపోర్టుతో పాటు HDMI 2.0 లేదా 2.1 పోర్ట్‌లు ఉన్నాయో లేదో చెక్ చేయండి.
సౌండ్ క్వాలిటీ ఎలా ఉంది? :
అద్భుతమైన స్క్రీన్‌తో పాటు పవర్‌ఫుల్ సౌండ్ క్వాలిటీని కోరుకుంటే.. టీవీని కొనుగోలు చేసేటప్పుడు స్పీకర్ అవుట్‌పుట్ డాల్బీ ఆడియో లేదా DTSకి సపోర్టు ఇస్తుందో లేదో చెక్ చేయండి. ఈ టీవీ అద్భుతమైన సౌండ్‌ను అందించకపోతే సౌండ్‌బార్‌ను కొనుగోలు చేయాల్సి వస్తుంది.
