FD Investment
FD Investment : సీనియర్ సిటిజన్లకు గుడ్ న్యూస్.. పెట్టుబడి పెట్టేందుకు ప్లాన్ చేస్తున్నారా? అయితే, ఫిక్స్‌డ్ డిపాజిట్లలో పెట్టుబడి పెట్టండి.. తక్కువ సమయంలో అధిక వడ్డీ రేట్లను పొందవచ్చు. సాధారణంగా చాలామంది పెట్టుబడి పెట్టే విషయంలో ఇతర ఫైనాన్స్ కంపెనీలపై ఎక్కువ ఆధారపడుతుంటారు. మరికొంతమంది ఆ డబ్బును బ్యాంకులో పెట్టుబడి పెట్టాలని భావిస్తుంటారు.
కానీ, ఫిక్స్‌డ్ డిపాజిట్లపై రాబడి స్థిరంగా ఉంటుంది. డబ్బు పెట్టుబడి పెట్టడానికి బ్యాంక్ ఎఫ్‌డీ బెస్ట్ ఆప్షన్‌గా అందిస్తోంది. అలాగే, బ్యాంక్ ఎఫ్‌డీలో డబ్బు పోతుందనే భయం లేదు. సీనియర్ సిటిజన్ల విషయానికి వస్తే.. ఫిక్స్‌డ్ డిపాజిట్లలో FDలలో పెట్టుబడి పెట్టడానికి ఇష్టపడతారు ఎందుకంటే.. బ్యాంకులు సాధారణ పౌరుల కన్నా సీనియర్ సిటిజన్లకు FDలపై అధిక వడ్డీ రేట్లను అందిస్తాయి.
ప్రతి బ్యాంకు తమ ఫిక్స్‌డ్ డిపాజిట్లపై సీనియర్ సిటిజన్లు అధిక వడ్డీ రేట్లు పొందుతారు. ఇలాంటి పరిస్థితిలో, మీరు కూడా సీనియర్ సిటిజన్ అయి ఉంటే.. మీ డబ్బును FDలో పెట్టుబడి పెట్టాలనుకుంటే.. సీనియర్ సిటిజన్లకు అత్యధిక వడ్డీ రేట్లను అందించే 5 బ్యాంకుల గురించి వివరంగా తెలుసుకుందాం.
స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI) :
భారత అతిపెద్ద ప్రభుత్వ రంగ బ్యాంకు ఎస్బీఐ అందించే FDలపై సీనియర్ సిటిజన్లకు ఆకర్షణీయమైన అధిక వడ్డీ రేట్లను అందిస్తుంది. సీనియర్ సిటిజన్లకు ఎస్బీఐ ఎఫ్‌డీ వడ్డీ రేట్లు 4 శాతం నుంచి 7.75 శాతం వరకు ఉంటాయి.
కెనరా బ్యాంకు :
కెనరా బ్యాంక్ తన కస్టమర్లకు ఆకర్షణీయమైన వడ్డీ రేట్లను కూడా అందిస్తుంది. సీనియర్ సిటిజన్లు ఈ బ్యాంకులో FDలో పెట్టుబడి పెట్టవచ్చు. 4 శాతం నుంచి 7.20 శాతం వడ్డీ రేటుతో రాబడిని పొందవచ్చు.
పంజాబ్ నేషనల్ బ్యాంక్ (PNB) :
పీఎన్‌బీలో FDలపై సీనియర్ సిటిజన్లకు చాలా అధిక వడ్డీ రేట్లను అందిస్తుంది. పీఎన్‌బీలో సీనియర్ సిటిజన్లకు FDపై వడ్డీ రేట్లు 7.30 శాతం వరకు ఉన్నాయి.
Read Also : PM Kisan : పీఎం కిసాన్ రైతులకు అలర్ట్.. ఈ 24వ తేదీన ఖాతాల్లో రూ. 2వేలు పడవు.. వెంటనే ఈ 3 పనులు చేయండి!
ఐసీఐసీఐ బ్యాంక్ :
సీనియర్ సిటిజన్లు కూడా ఐసీఐసీఐ బ్యాంక్‌లో పెట్టుబడి పెట్టడం ద్వారా మంచి లాభాలను ఆర్జించవచ్చు. ఈ బ్యాంకులో, సీనియర్ సిటిజన్లు 7.50 శాతం వరకు వడ్డీ రేటును పొందవచ్చు.
యాక్సిస్ బ్యాంక్ :
సీనియర్ సిటిజన్లు FDలో పెట్టుబడి పెట్టడానికి యాక్సిస్ బ్యాంక్ కూడా బెస్ట్ అని చెప్పవచ్చు. ఈ బ్యాంకులో పెట్టుబడి పెట్టడం ద్వారా మీరు 7.75 శాతం చొప్పున రాబడిని పొందవచ్చు.