5G Launch Cities First _ 5G to Launch in these Cities First _ Check if you city is in the list
5G Launch Cities First : భారత మార్కెట్లోకి 5G నెట్ వర్క్ (5G Services) అతి త్వరలోనే అందుబాటులోకి రానుంది. అయితే అందరూ ఊహించిన దానికంటే భారత్‌లోకి 5G సర్వీసులు ముందుగానే అందుబాటులోకి రానున్నాయి. ఇప్పటివరకూ 5G నెట్‌వర్క్ ఎప్పుడు లాంచ్ అవుతుందనేది మాత్రం క్లారిటీ లేదు. కానీ, నివేదికలను పరిశీలిస్తే.. రెండు ప్రధాన టెలికాం ఆపరేటర్లు రిలయన్స్ జియో (Reliance Jio), ఎయిర్‌టెల్ (Airtel 5G Services) ఈ నెలాఖరులోగా భారత మార్కెట్లోకి తమ 5G సేవలను ప్రారంభించే అవకాశం కనిపిస్తోంది. సెప్టెంబరు 29న ఇండియా మొబైల్ కాంగ్రెస్ (IMC) ప్రారంభోత్సవంలో భారత ప్రభుత్వం అధికారికంగా 5Gని లాంచ్ చేస్తుందని లేటెస్ట్ రిపోర్టు ఒకటి సూచించింది.
PM నరేంద్ర మోడీ భారత్‌లో 5Gని ఊహించిన దానికంటే త్వరగా ప్రారంభించనున్నట్లు చెప్పారు. 4G కన్నా 5G స్పీడ్ 10 రెట్లు ఎక్కువగా ఉంటుందని ఆయన చెప్పారు. 5G సర్వీసులు దశలవారీగా అందుబాటులోకి వస్తాయని, మొదటి దశలో ఎంపిక చేసిన నగరాలు మాత్రమే హైస్పీడ్ ఇంటర్నెట్ సర్వీసులు అందుబాటులోకి రానున్నాయని నివేదికలు సూచిస్తున్నాయి. ప్రత్యేకంగా చెప్పాలంటే.. మొదటి దశలో కేవలం 13 నగరాల్లో 5G సర్వీసులు అందుబాటులోకి రానున్నాయి. ఇంతకీ ఆ జాబితాలో ఏయే నగరాలు ఉన్నాయో ఓసారి పరిశీలిద్దాం..
– అహ్మదాబాద్
– బెంగళూరు
– చండీగఢ్
– చెన్నై
– ఢిల్లీ
– గాంధీనగర్
-గురుగ్రామ్
-హైదరాబాద్
-జామ్‌నగర్
– కోల్‌కతా
– లక్నో
-ముంబయి
– పూణె
5G Launch Cities First _ 5G to Launch in these Cities First _ Check if you city is in the list
ఇప్పుడు, ఈ నగరాల్లో నివసిస్తున్న ప్రతి ఒక్కరూ మొదటి 5G సర్వీసులను యాక్సస్ చేసుకోనే అవకాశం ఉందా అంటే.. లేదనే చెప్పాలి. అలా జరగకపోవచ్చు. ఈ నగరాల్లోని ఎంపిక చేసిన ప్రాంతాల్లో టెల్కోలు 5Gకి యాక్సెస్‌ను అందించే అవకాశం ఉంది. అవేంటి అనేది మాత్రం ఇంకా తెలియవు. మరో మాటలో చెప్పాలంటే.. ఈ నగరాల్లోని ప్రతి ఒక్కరికీ 5G సేవలు అందుబాటులోకి రావడాలంటే ఇంకా చాలా సమయం పడుతుంది. గత వారంమే టెలికాం మంత్రి అశ్విని వైష్ణవ్ స్పెక్ట్రమ్ కేటాయింపు లేఖలను జారీ చేసిన తర్వాత 5G లాంచ్‌కు సిద్ధంగా ఉండాలని టెలికాం సర్వీస్ ప్రొవైడర్లకు సూచించారు. “స్పెక్ట్రమ్ అసైన్‌మెంట్ లెటర్ జారీ అయింది. 5G లాంచ్‌కు సిద్ధం కావాలని TSPలను అభ్యర్థిస్తున్నానని టెలికాం మంత్రి చెప్పారు.
5G Launch Cities First _ 5G to Launch in these Cities First
ఇటీవల జరిగిన 5G స్పెక్ట్రమ్ వేలంలో భారతీ ఎయిర్‌టెల్, రిలయన్స్ జియో, అదానీ డేటా నెట్‌వర్క్స్, వొడాఫోన్ ఐడియా అత్యధిక బిడ్డర్లుగా నిలిచాయి. రిలయన్స్ జియో ఈ నెలాఖరులో జరగనున్న కంపెనీ AGMలో తన 5G సేవలను ప్రారంభించనుంది. ఎయిర్‌టెల్ తన 5G సేవలను IMCలో నెలాఖరులో ప్రారంభించనున్నట్లు తెలిపింది. ఎయిర్‌టెల్, జియో మధ్య గట్టి పోటీ నెలకొంది. భారత్‌లో ఏ కంపెనీ మొదట 5G సేవలను ప్రారంభిస్తుందనేది ఆసక్తికరంగా ఉంది. 2016లో భారత్‌లో 4G సేవలను జియో అన్ని ఇతర టెలికాం ఆపరేటర్‌ల కన్నా ముందే ప్రారంభించింది.