Saudi Boost Oil Price : సౌదీ అరేబియా ఆయిల్ ఉత్పత్తిలో కోత.. చమురు ధరల పెంపు?

Oil prices:చమురు ధరలను పెంచడానికి సౌదీ అరేబియా తాజాగా ఆయిల్ కోతను ప్రకటించింది.దీంతో చమురు ధరలకు రెక్కలు రానున్నాయి. ఆయిల్ ఉత్పత్తి దేశాలైన సౌదీ అరేబియా, రష్యా దేశాలు చమురు ఉత్పత్తిలో కోత విధిస్తున్నట్లు ప్రకటించాయి. ఈ వారాంతంలో 23 దేశాలు జులై నెల వరకు చమురు ఉత్పత్తిలో కోతలు పెట్టవచ్చని సంకేతాలు వెలువడ్డాయి.ఆర్థిక మాంద్యం భయంతో వియన్నా, ఆస్ట్రియా ధరలను పెంచే ప్రయత్నంలో రోజుకు ఒక మిలియన్ బ్యారెళ్ల చొప్పున ఉత్పత్తిని తగ్గించనున్నట్లు రియాద్ ఆదివారం ప్రకటించింది.

Bhagalpur bridge collapse: కుప్పకూలిన వంతెన..కాంట్రాక్టు సంస్థపై సీఎం నితీష్ కుమార్ ఆగ్రహం, విచారణకు ఆదేశం

సౌదీ అరేబియా నేతృత్వంలోని 13 మంది సభ్యుల పెట్రోలియం ఎగుమతి దేశాల సంస్థ (OPEC), రష్యా నేతృత్వంలోని దాని 10 భాగస్వాముల సమావేశం తర్వాత ఈ ప్రకటన వెలువడింది.చమురు బ్యారెళ్ల కోతలు జులై వరకు ఉంటాయని, అయితే దీన్ని పొడగించవచ్చని సౌదీ ఇంధనశాఖ మంత్రి ప్రిన్స్ అబ్దుల్ అజీజ్ బిన్ సల్మాన్ విలేకరులకు చెప్పారు. ఉక్రెయిన్‌పై రష్యా దాడి చేయడంతో చమురు ఉత్పత్తిదారులు పడిపోతున్న ధరలు, అధిక మార్కెట్ అస్థిరత పరిస్థితులు నెలకొన్నాయి.

Another rail accident : ఒడిశాలో మరో రైలు ప్రమాదం.. పట్టాలు తప్పిన గూడ్స్ రైలు

ఆయిల్ ఉత్పత్తిలో కోత విధించినట్టయితే ధరలు పెరుగుతాయని, ఈ ఏడాది తర్వాత డిమాండ్‌ కూడా పుంజుకుంటుందని భావిస్తున్నారు.ఒపెక్స్ దేశాల నుంచి భారతదేశానికి సరఫరా అయిన చమురు వాటి గత నెలలో 39శాతానికి పడిపోయింది.భారతదేశానికి సౌదీఅరేబియా, ఇరాక్, యూఏఈ, అమెరికా దేశాల నుంచి కంటే రష్యా నుంచి క్రూడ్ దిగుమతులు పెరిగాయి.

ట్రెండింగ్ వార్తలు