New Bank Rules
New Bank Rules : బ్యాంకు, యూపీఐ వినియోగదారులకు అలర్ట్.. ఏప్రిల్ 1, 2025 నుంచి దేశమంతటా కొత్త బ్యాకింగ్ చట్టం అమల్లోకి వస్తోంది. బ్యాంకు ఖాతాదారులతో పాటు యూపీఐ యూజర్లు తప్పనిసరిగా కొత్త నిబంధనలను తెలుసుకోవాలి.
ఏటీఎంలో డబ్బులు డ్రా చేయడం దగ్గర నుంచి బ్యాంకు అకౌంట్లో మినిమం బ్యాలెన్స్, క్రెడిట్ కార్డుల బెనిఫిట్స్, పాజిటివ్ పే సిస్టమ్, డిజిటల్ బ్యాంకింగ్ ఫీచర్లు, సేవింగ్స్ అకౌంట్, FD వడ్డీ రేట్లు వంటి వాటిపై ప్రభావం పడనుంది. ఆర్థిక వ్యవస్థకు అనుగుణంగా మోసాలను నిరోధించేందుకు బ్యాంకులు ఎప్పటికప్పుడూ సరికొత్త విధానాలను సవరిస్తాయి. రాబోయే 7 కొత్త బ్యాంకు నిబంధనల గురించి పూర్తి వివరాలను ఓసారి చూద్దాం.
ఏప్రిల్ 1, 2025 నుంచి బ్యాంకింగ్ రూల్స్ :
ఏప్రిల్ 1 నుంచి అమల్లోకి వచ్చే బ్యాంకింగ్ రూల్స్ కారణంగా ఏటీఎం విత్‌డ్రా విధానాలు, సేవింగ్స్ అకౌంట్ రూల్స్, క్రెడిట్ కార్డ్ బెనిఫిట్స్ మరిన్నింటిపై ప్రభావం పడుతుంది. వినియోగదారులు తమ అకౌంట్ల భద్రత కోసం కొత్త ఫీచర్లు, సర్వీసులను పొందాలంటే బ్యాంకుల కొత్త రూల్స్ తప్పనిసరిగా పాటించాలి. లేదంటే భారీ మూల్యం చెల్లించుకోకతప్పదు.
ATM విత్‌డ్రా ఛార్జీలు :
ఆర్బీఐ ఏటీఎం లావాదేవీల ఛార్జీలకు సంబంధించి మార్గదర్శకాలను విడుదల చేసింది. ఫ్రీ లిమిట్, ప్రతి లావాదేవీకి గరిష్టంగా విధించే ఛార్జ్ అనమాట. ఈ మార్గదర్శకాలకు అనుగుణంగా అనేక బ్యాంకులు తమ ఏటీఎం విత్‌డ్రా రుసుములను సవరించాయి. నెలకు ఉచితంగా ఏటీఎం విత్‌డ్రాల సంఖ్యను తగ్గించాయి.
ముఖ్యంగా ఇతర బ్యాంకుల ఏటీఎంలో లావాదేవీలను తగ్గించాయి. ఇప్పుడు వినియోగదారులు ఇతర బ్యాంకు ఏటీఎంలో ప్రతి నెలా 3 ఫ్రీ విత్‌డ్రాలను మాత్రమే అనుమతిస్తారు. ఆ తర్వాత, ప్రతి లావాదేవీకి రూ.20 నుంచి రూ.25 వరకు ఛార్జ్ ఉంటుంది.
మినిమం బ్యాలెన్స్ :
సేవింగ్స్ అకౌంట్ కలిగిన అందరి అకౌంట్లలో తప్పనిసరిగా కనీస మినిమం బ్యాలెన్స్ ఉండాలి. అంతేకాకుండా, అవసరమైన సేవింగ్స్ అకౌంట్ బ్యాలెన్స్ మొత్తాన్ని బట్టి జరిమానా విధిస్తారు. అకౌంట్లలో ఉండాల్సిన కనీస మొత్తం కన్నా తక్కువగా ఉంటే పెనాల్టీలను విధిస్తాయి. అనేక బ్యాంకులు తమ మినిమం బ్యాలెన్స్ విధానాలను సవరిస్తున్నాయి. బ్యాంకులకు మినిమం బ్యాలెన్స్ ఎంత ఉండాలి అనేది ఆయా అకౌంట్ టైప్, బ్యాంక్, బ్రాంచ్ లొకేషన్ (మెట్రో, అర్బన్, సెమీ-అర్బన్ లేదా గ్రామీణ) ఆధారంగా మారుతూ ఉంటాయి.
పాజిటివ్ పే సిస్టమ్ (PPS) :
బ్యాంకింగ్ మోసాలకు చెక్ పెట్టేందుకు ఆర్బీఐ పాజిటివ్ పే సిస్టమ్ (PPS)ను ప్రవేశపెట్టింది. లావాదేవీ భద్రత కోసం అనేక బ్యాంకులు PPS రన్ చేస్తున్నాయి. రూ. 50వేల కన్నా ఎక్కువ మొత్తానికి చెక్కులను జారీ చేసే కస్టమర్లు, లబ్ధిదారులకు జారీ చేసిన చెక్కులపై ముఖ్యమైన వివరాలను ఎలక్ట్రానిక్‌గా బ్యాంకుకు అందించాలని PPS కోరుతుంది.
చెల్లింపు కోసం చెక్కును సమర్పించే ముందు ఈ డేటాను వెరిఫై చేస్తారు. CTS సమర్పించడంతో పాటు స్వీకరించే బ్యాంకుల మధ్య ఏదైనా తేడా ఉన్నట్టు తేలితే వెంటనే పరిష్కార దిశగా చర్యలు తీసుకుంటాయి.
డిజిటల్ బ్యాంకింగ్ ఫీచర్లు :
AI బ్యాంకింగ్ అసిస్టెన్స్ ద్వారా మనీ మేనేజ్‌మెంట్, డిజిటల్ అడ్వైజ్‌తో మొబైల్ సర్వీసులకు స్టాండర్డ్ రూల్స్ నిర్ణయించడం వంటివి కీలక డిజిటల్ బ్యాంకింగ్‌ను రూపొందిస్తాయి. కస్టమర్లకు అసిస్టెన్స్ అందించేందుకు బ్యాంకులు అడ్వాన్స్‌డ్ ఆన్‌లైన్ ఫీచర్లు, AI-ఆధారిత చాట్‌బాట్‌లను అందుబాటులోకి తీసుకొచ్చాయి. అదనంగా, డిజిటల్ లావాదేవీలు సురక్షితంగా ఉండేందుకు టూ-ఫ్యాక్టర్డ్ అథెంటికేషన్, బయోమెట్రిక్ వెరిఫికేషన్ వంటి మెరుగైన భద్రతా చర్యలను అందిస్తాయి.
సేవింగ్స్ అకౌంట్, FD వడ్డీ రేట్లు :
అనేక బ్యాంకులు సేవింగ్స్ అకౌంట్లు, ఫిక్స్‌డ్ డిపాజిట్లపై వడ్డీ రేట్లను సవరిస్తున్నాయి. SBI, IDBI బ్యాంక్, HDFC బ్యాంక్, ఇండియన్ బ్యాంక్, పంజాబ్ & సింద్ బ్యాంక్ వంటి ప్రముఖ బ్యాంకులు ఆకర్షణీయమైన రేట్లతో స్పెషల్ FD టెన్యూర్స్ ప్రవేశపెట్టాయి.
క్రెడిట్ కార్డ్ బెనిఫిట్స్ :
ఏప్రిల్ 1, 2025 నుంచి ప్రధాన బ్యాంకులు క్రెడిట్ కార్డ్ రూల్స్ సవరిస్తున్నాయి. రివార్డులు, ఛార్జీలు సహా మరిన్నింటిపై ప్రభావం పడనుంది. ముఖ్యంగా ఎస్బీఐ (SimplyCLICK) స్విగ్గీ రివార్డులను 5Xకి సగానికి తగ్గిస్తుంది. ఎయిర్ ఇండియా సిగ్నేచర్ పాయింట్లను 30 నుంచి 10కి తగ్గిస్తుంది. IDFC ఫస్ట్ క్లబ్ విస్తారా మైల్‌స్టోన్ బెనిఫిట్స్ కూడా నిలిపివేస్తుంది.
UPI ట్రాన్సాక్షన్స్ :
ఏప్రిల్ 1 నుంచి యూపీఐ అకౌంట్లకు లింక్ చేసిన చాలా కాలంగా ఉపయోగించని మొబైల్ నంబర్‌లు బ్యాంక్ రికార్డుల నుంచి తొలగిస్తారు. మీ ఫోన్ నంబర్ యూపీఐ యాప్‌కి లింక్ చేసి ఉండి చాలా కాలంగా వాడకపోతే.. బ్యాంకులు తమ రికార్డుల నుంచి వెంటనే ఆయా ఇన్‌యాక్టివ్ నెంబర్లను తొలగిస్తాయి. దాంతో మీ యూపీఐ అకౌంట్లలో యూపీఐ సర్వీసులు నిలిచిపోతాయి.