Dual SIM Users : వావ్.. వండర్‌ఫుల్.. ‘డ్యూయల్ సిమ్’ కోసం చీపెస్ట్ రీఛార్జ్ ప్లాన్లు ఇవే.. సింగిల్ రీఛార్జ్‌తో 84 రోజులు ఎంజాయ్ చేయొచ్చు..!

Dual SIM Users : ఈ రోజుల్లో చాలా మంది తమ ఫోన్లలో రెండు సిమ్ కార్డులను వాడుతున్నారు. జియో, ఎయిర్‌టెల్, వోడాఫోన్ ఐడియా అత్యంత సరసమైన 84 రోజుల రీఛార్జ్ ప్లాన్‌లను అందిస్తున్నాయి.

Dual SIM Users : వావ్.. వండర్‌ఫుల్.. ‘డ్యూయల్ సిమ్’ కోసం చీపెస్ట్ రీఛార్జ్ ప్లాన్లు ఇవే.. సింగిల్ రీఛార్జ్‌తో 84 రోజులు ఎంజాయ్ చేయొచ్చు..!

Dual SIM Users

Updated On : March 28, 2025 / 11:02 AM IST

Dual SIM Users : మొబైల్ యూజర్లకు గుడ్ న్యూస్.. ఇకపై ప్రతినెలా రీఛార్జ్ చేయాల్సిన అవసరం లేదు. ఒకసారి రీఛార్జ్ చేసుకుంటే కొన్ని రోజుల పాటు డేటా, ఫోన్ కాల్స్ ఎంజాయ్ చేయొచ్చు. ప్రస్తుతం స్మార్ట్‌ఫోన్లు వాడే చాలా మంది వినియోగదారులు రెండు ఫోన్ (డ్యుయల్ సిమ్) నంబర్లను వాడుతున్నారు.

రీఛార్జ్ ప్లాన్‌లు ఖరీదైనవి కావడంతో ఈ రెండు నెంబర్లను యాక్టివ్‌గా ఉంచుకోవడం వినియోగదారులకు ఆర్థిక భారంగా మారింది. ఫలితంగా, ఎక్కువ మంది యూజర్లు లాంగ్ టైమ్ రీఛార్జ్ ప్లాన్‌లను ఎంచుకుంటున్నారు.

Read Also : Window vs Split AC : ఈ వేసవిలో కొత్త ఏసీ కొంటున్నారా? విండోస్ ఏసీనా? స్ప్లిట్ ఏసీనా? ఏది కొంటే బెటర్? ఎక్స్‌పర్ట్స్ టిప్స్ మీకోసం..!

మీరు రిలయన్స్ జియో, ఎయిర్‌టెల్ లేదా వోడాఫోన్ ఐడియా సిమ్‌లను వాడుతుంటే.. మీకు ఆసక్తి కలిగించే కొన్ని రీఛార్జ్ ప్లాన్లు అందుబాటులో ఉన్నాయి. ఈ 3 ప్రైవేట్ టెలికం కంపెనీలు తరచుగా తమ కస్టమర్ల కోసం అద్భుతమైన రీఛార్జ్ ప్లాన్లను ప్రవేశపెడుతున్నాయి. మీరు నెలవారీ రీఛార్జింగ్ ఇబ్బందితో విసిగిపోయి ఉంటే.. జియో, ఎయిర్‌టెల్, వొడాఫోన్ ఐడియా నుంచి అత్యంత సరసమైన 84-రోజుల ప్లాన్లను ఎంచుకోవచ్చు.

జియో 84 రోజుల సరసమైన ప్లాన్ :
జియో దీర్ఘకాలిక ప్లాన్ల పోర్ట్‌ఫోలియోను భారీగా విస్తరించింది. 84 రోజుల ప్లాన్ ధర రూ. 799కు ఆఫర్ చేస్తోంది. ఈ ప్లాన్ వ్యాలిడిటీలో అన్ని నెట్‌వర్క్‌లకు అన్‌లిమిటెడ్ ఫ్రీ కాలింగ్‌ను అందిస్తుంది. అదనంగా, మీరు అన్ని నెట్‌వర్క్‌లలో ప్రతిరోజూ 100 SMSలతో పాటు ప్రతిరోజూ 1.5GB డేటాను అందుకుంటారు. అదనపు బెనిఫిట్స్ కోసం ఈ ప్లాన్‌లో జియో టీవీ, జియో హాట్‌స్టార్, జియోక్లౌడ్‌లకు ఫ్రీ సబ్‌స్ర్కిప్షన్లు కూడా ఉన్నాయి.

ఎయిర్‌టెల్ 84 రోజుల ప్లాన్ :
అదేవిధంగా, ఎయిర్‌టెల్ అనేక 84 రోజుల ప్లాన్‌లను అందిస్తుంది. చౌకైన ప్లాన్ ధర రూ. 859కు అందిస్తోంది. ఈ ప్లాన్‌లో ఏ నెట్‌వర్క్‌కైనా అన్‌లిమిటెడ్ కాల్స్ కూడా ఉంటాయి. రోజుకు 100 ఫ్రీ SMSలను అందిస్తుంది. డేటా పరంగా వినియోగదారులు ప్రతిరోజూ 1.5GB నుంచి బెనిఫిట్స్ పొందుతారు. ఎయిర్‌టెల్ రూ. 584 ప్లాన్ 84 రోజుల వ్యాలిడిటీ అందిస్తున్నప్పటికీ మొత్తంగా 7GBని మాత్రమే అందిస్తుంది.

Vi 84-రోజుల రీఛార్జ్ ప్లాన్ :
వోడాఫోన్ ఐడియా (Vi) 84 రోజుల అత్యంత సరసమైన ప్లాన్ రూ. 979కి అందిస్తోంది. జియో, ఎయిర్‌టెల్ కన్నా కొంచెం ఖరీదైనది. కానీ, అదనపు బెనిఫిట్స్ పొందవచ్చు. ఈ ప్లాన్ అన్‌లిమిటెడ్ ఫ్రీ కాలింగ్, మొత్తం 168GB డేటాను అందిస్తుంది. రోజువారీగా 2GB డేటా పొందవచ్చు. ఇందులో ప్రతిరోజూ 100 ఫ్రీ SMS కూడా పొందవచ్చు.

Read Also : Google Time Travel : వెరీ ఇంట్రెస్టింగ్.. గూగుల్ టైమ్ ట్రావెల్‌ చేయండిలా.. మీ ఊరు 30 ఏళ్ల క్రితం ఎలా ఉందో చూడొచ్చు..!

Vi అందించే అద్భుతమైన ఆఫర్‌లో వారాంతపు డేటా రోల్‌ఓవర్ కూడా ఉంది. వారం చివరిలో వాడని డేటాను మరో వారం వాడుకోవచ్చు. అంతేకాకుండా, వినియోగదారులు అనేక పాపులర్ యాప్‌లకు ఫ్రీ యాక్సెస్‌ను కూడా పొందుతారు. జియో, ఎయిర్‌టెల్, వోడాఫోన్ ఐడియా అందించే ఈ ప్లాన్‌లన్నీ లాంగ్ టైమ్ రీఛార్జ్‌లే. వినియోగదారులు సమయంతో పాటు డబ్బు రెండింటినీ ఆదా చేయొచ్చు.