Google Time Travel : వెరీ ఇంట్రెస్టింగ్.. గూగుల్ టైమ్ ట్రావెల్‌ చేయండిలా.. మీ ఊరు 30 ఏళ్ల క్రితం ఎలా ఉందో చూడొచ్చు..!

Google Time Travel : సినిమాల్లో మాదిరిగా టైమ్ ట్రావెల్ చేయాలని అనుకుంటున్నారా? గూగుల్ మీకోసం అద్భుతమైన టైమ్ ట్రావెల్ ఫీచర్ తీసుకొచ్చింది. ఇంతకీ ఈ ఫీచర్ ఎలా వాడాలో ఇప్పుడు తెలుసుకుందాం.

Google Time Travel : వెరీ ఇంట్రెస్టింగ్.. గూగుల్ టైమ్ ట్రావెల్‌ చేయండిలా.. మీ ఊరు 30 ఏళ్ల క్రితం ఎలా ఉందో చూడొచ్చు..!

Google Time Travel

Updated On : March 28, 2025 / 10:38 AM IST

Google Time Travel : మీకు నిజంగా ట్రామ్ ట్రావెల్ చేయాలని ఉందా? సైన్ ఫిక్సన్ సినిమాల్లోనే ఇది సాధ్యం అంటారా? కానీ, ఇప్పుడు రియల్‌గా కూడా సాధ్యమే.. అవును మీరు చదివింది నిజమే.. గూగుల్ ఇప్పుడు టైమ్ ట్రావెల్ సాధ్యమే అంటోంది.

మిలియన్ల మంది వినియోగదారుల కోసం గూగుల్ ఇటీవలే ఒక అద్భుతమైన టైమ్ ట్రావెల్ ఫీచర్ ప్రవేశపెట్టింది. ఈ కొత్త అప్‌డేట్‌తో గూగుల్ మ్యాప్స్ (Google Maps), గూగుల్ ఎర్త్ (Google Earth) ఇప్పుడు 30 ఏళ్ల క్రితం మీ సిటీ లేదా ఊరు ఎలా ఉండేదో చూడవచ్చు.

Read Also : Apple iPhone 15 : అమెజాన్‌లో క్రేజీ ఆఫర్.. లక్ష విలువైన ఐఫోన్‌ 15 అతి తక్కువ ధరకే.. ఇలా కొన్నారంటే?

ముఖ్యంగా సాంకేతిక పరిజ్ఞానం అభివృద్ధి చెందడంతో ప్రపంచం వేగంగా మార్పులు చెందుతోంది. నగరాలు అపూర్వమైన వేగంతో రూపాంతరం చెందుతున్నాయి. దాదాపు ప్రతి ప్రాంతం కొన్ని దశాబ్దాల క్రితంతో పోలిస్తే ఇప్పుడు గణనీయంగా మారిపోయింది. 30 ఏళ్లు లేదా 40 ఏళ్ల క్రితం నాటి ప్రదేశాన్ని భౌతికంగా తిరిగి సందర్శించడం సాధ్యం కాకపోవచ్చు. కానీ, సాంకేతికతతో కొంతవరకు గతాన్ని చూసేందుకు వీలుంది.

టెక్ దిగ్గజం గూగుల్ యూజర్లు వివిధ ప్రదేశాల చారిత్రక దృశ్యాలను చూసేందుకు అద్భుతమైన ఫీచర్ ఒకటి ప్రవేశపెట్టింది. గూగుల్ మ్యాప్స్, గూగుల్ ఎర్త్ కోసం గూగుల్ అద్భుతమైన కొత్త ఫీచర్‌ను అందుబాటులోకి తెచ్చింది. ఈ ఫీచర్ ద్వారా వినియోగదారులు ఒకప్పుడు ప్రదేశాలు ఎలా ఉండేవో అన్వేషించవచ్చు. ఇప్పుడు, మీ ఫోన్ లేదా కంప్యూటర్‌లో 30 లేదా 40 ఏళ్ల క్రితం మీ నగరం పరిస్థితిని మీరు చూడవచ్చు.

గూగుల్ టైమ్ ట్రావెల్ ఫీచర్‌తో గతంలోకి.. :
ఇటీవల, గూగుల్ మ్యాప్స్‌లో టైమ్ ట్రావెల్ వంటి అద్భుతమైన ఫీచర్‌ను గూగుల్ ఆవిష్కరించింది. ఈ వినూత్న టూల్ మీరు పాత రోజులకు వెనక్కి ప్రయాణించవచ్చు. చారిత్రక సందర్భంలో ఒక ప్రదేశాన్ని రియల్ టైమ్ వ్యూ చూడవచ్చు.

ఒక బిల్డింగ్, స్ట్రీట్ లేదా సిటీ మొదట నిర్మించినప్పుడు లేదా మోడ్రాన్ ఫెసిలిటీస్ లేనప్పుడు అది ఎలా కనిపించిందో మీరు చూడవచ్చు. గూగుల్ బ్లాగ్ పోస్ట్ ప్రకారం.. వినియోగదారులు 1930 నాటి వ్యూలతో బెర్లిన్, లండన్, పారిస్ వంటి దిగ్గజ నగరాలను అన్వేషించవచ్చు. గూగుల్ టైమ్ ట్రావెల్ ఫీచర్‌తో 1930లో లండన్ నేటితో పోలిస్తే.. ఎలా ఉందో మీరు సులభంగా చూడవచ్చు.

గూగుల్ టైమ్ ట్రావెల్ ఫీచర్‌ ఎలా వాడాలంటే? :
మీరు గూగుల్ టైమ్ ట్రావెల్ ఫీచర్‌ను ట్రై చేయాలనుకుంటే.. గూగుల్ మ్యాప్స్ (Google Maps) లేదా గూగుల్ ఎర్త్ (Google Earth)కి వెళ్లడం ద్వారా ఓసారి ట్రై చేయండి. ఆ తర్వాత, మీరు అన్వేషించాలనుకుంటున్న లోకేషన్ కోసం సెర్చ్ చేయండి. అక్కడి నుంచి లేయర్స్ ఆప్షన్ నావిగేట్ చేసి, టైమ్ లాప్స్‌ (Time Lapse)ను ఎంచుకోండి. ఈ సింపుల్ స్టెప్స్ ఫాలో అయితే చాలు.. మీరు ఆ ప్రదేశాన్ని గతంలో ఎలా కనిపించిందో మీరు చూడొచ్చు.

Read Also : Honda Activa 6G Scooter : మైండ్ బ్లోయింగ్ ఆఫర్.. రూ.97వేల హోండా యాక్టివా స్కూటర్ కేవలం రూ.19వేలకే.. ఫీచర్లు, మైలేజీ కేక..!

గూగుల్ స్ట్రీట్ వ్యూ అప్‌డేట్ :
ఈ ఫీచర్‌తో పాటు గూగుల్ మ్యాప్స్ స్ట్రీట్ వ్యూ యాక్టివిటీని కూడా అప్‌డేట్ చేసింది. లేటెస్ట్ అప్‌డేట్‌లో కార్లు, ట్రాకర్లను క్యాప్చర్ చేసిన కొత్త ఫొటోలు ఉన్నాయి. వ్యూ డేటాబేస్‌ను గణనీయంగా విస్తరిస్తాయి. స్ట్రీట్ వ్యూలో 280 బిలియన్ ఫోటోలకు యాక్సెస్‌తో మీరు నగరాలను అన్వేషించవచ్చు. అలాగే ప్రాంతాల వారీగా సెర్చ్ చేయొచ్చు. మీకు ప్రపంచవ్యాప్తంగా టైమ్ ట్రావెల్ చేసినట్టుగా రియల్ టైమ్ అద్భుతమైన ఎక్స్‌‌పీరియన్స్ అందిస్తుంది.