Bank Holidays : ఏప్రిల్‌లో మీకు బ్యాంకు పని ఉందా? ఈ నెలలో ఏయే రోజుల్లో బ్యాంకులకు సెలవులు ఉన్నాయంటే? ఫుల్ డిటెయిల్స్ మీకోసం..!
Bank Holidays : ఏప్రిల్ కొత్త ఆర్థిక సంవత్సరంలో బ్యాంకులు ఎన్ని రోజులు పనిచేయవో ముందుగానే తెలుసుకోవడం ముఖ్యం. బ్యాంకు సెలవులకు సంబంధించి పూర్తి జాబితాను ఓసారి చెక్ చేసుకోండి.

Bank Holidays in April
Bank Holidays : రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) ఏడాదికి రాష్ట్రాల వారీగా బ్యాంకు సెలవుల క్యాలెండర్‌ను రిలీజ్ చేస్తుంది. బ్యాంకు సెలవులు రాష్ట్రం నుంచి రాష్ట్రానికి మారుతూ ఉంటాయి. ఈ జాబితా బ్యాంకు కస్టమర్లకు చాలా ముఖ్యం. పండుగలు, ఆ నిర్దిష్ట రాష్ట్రానికి ఉండే ప్రాముఖ్యత ఆధారంగా బ్యాంకు సెలవుల జాబితాను అందిస్తుంది.
ఏప్రిల్ కొత్త ఆర్థిక సంవత్సరం ప్రారంభం కానుంది. ఈ నేపథ్యంలో బ్యాంకులు ఎన్ని రోజులు పనిచేయవో ముందుగానే తెలుసుకోవడం చాలా ముఖ్యం. అలాగే, వార్షిక అకౌంట్లు ఫైనల్ చేసేందుకు ఏప్రిల్ 1 అన్ని రాష్ట్రాలలో సెలవుదినంగా ప్రకటించింది.
ఏప్రిల్ 2025లో, మహావీర్ జయంతి, అంబేద్కర్ జయంతి, గుడ్ ఫ్రైడే, బోహాగ్ బిహు, బసవ జయంతి, అక్షయ తృతీయ సందర్భంగా బ్యాంకులు మూతపడనున్నాయి. అదనంగా, వార్షిక ఖాతాల ఫైనల్ లెక్కంపు కోసం ఏప్రిల్ 1 అన్ని రాష్ట్రాలలో బ్యాంకు సెలవు ఉంటుంది.
ఏప్రిల్ 2025 బ్యాంక్ సెలవులు.. రాష్ట్రాల వారీగా జాబితా :
మంగళవారం, ఏప్రిల్ 1, 2025 : జార్ఖండ్ రాష్ట్రంలో జరుపుకునే వసంత పండుగ.. సర్హుల్ సందర్భంగా బ్యాంకులు వార్షిక అకౌంట్లను క్లోజ్ చేసేందుకు బ్యాంకులకు సెలవుదినంగా ప్రకటించింది.
శనివారం, ఏప్రిల్ 5, 2025 : బాబు జగ్జీవన్ రామ్ పుట్టినరోజు సందర్భంగా హైదరాబాద్, తెలంగాణలో బ్యాంకులు పనిచేయవు.
గురువారం, ఏప్రిల్ 10, 2025 : మహావీర జన్మకల్యాణక్/మహావీర జయంతిగా జరుపుకుంటారు. గుజరాత్, మహారాష్ట్ర, కర్ణాటక, తమిళనాడు, రాజస్థాన్, ఉత్తరప్రదేశ్, పశ్చిమ బెంగాల్, తెలంగాణలో బ్యాంకులు పనిచేయవు.
సోమవారం, ఏప్రిల్ 14, 2025 : డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జయంతి, విషు, బిహు, తమిళ నూతన సంవత్సరం మొదలైనవి ఉన్నాయి. ఈరోజున బ్యాంకులు పనిచేయవు. మిజోరం, మధ్యప్రదేశ్, చండీగఢ్, అరుణాచల్ ప్రదేశ్, నాగాలాండ్, న్యూఢిల్లీ, ఛత్తీస్‌గఢ్, మేఘాలయ, హిమాచల్ ప్రదేశ్‌లలో బ్యాంకులు మూతపడతాయి.
మంగళవారం, ఏప్రిల్ 15, 2025 : బెంగాలీ నూతన సంవత్సరం, హిమాచల్ దినోత్సవం, బోహాగ్ బిహు వంటి రాష్ట్ర పండుగలను జరుపుకుంటారు. అస్సాం, పశ్చిమ బెంగాల్, అరుణాచల్ ప్రదేశ్, హిమాచల్ ప్రదేశ్‌లలో బ్యాంకులు మూతపడతాయి.
శుక్రవారం, ఏప్రిల్ 18, 2025 : చాలా ప్రధాన రాష్ట్రాల్లో గుడ్ ఫ్రైడే జరుపుకుంటారు. చండీగఢ్, త్రిపుర, అస్సాం, రాజస్థాన్, జమ్మూ, హిమాచల్ ప్రదేశ్, శ్రీనగర్ మినహా అన్ని రాష్ట్రాల్లో బ్యాంకులకు సెలవులు ఉంటాయి.
సోమవారం, ఏప్రిల్ 21, 2025 : త్రిపురలో జరిగే ఈ గిరిజన పండుగ రోజున బ్యాంకులు పనిచేయవు.
మంగళవారం, ఏప్రిల్ 29, 2025: విష్ణువు 6వ అవతారమైన పరశురాముడి జన్మదినోత్సవాన్ని జరుపుకునేందుకు హిమాచల్ ప్రదేశ్‌లో బ్యాంకులు పనిచేయవు.
బుధవారం, ఏప్రిల్ 30, 2025 : బసవ జయంతిని జరుపుకోవడానికి కర్ణాటకలో బ్యాంకులు మూతపడతాయి.