DA and DR Hike: సమయం ఆసన్నమవుతోంది.. డీఏ పెంపుపై ఇక గుడ్‌న్యూస్‌..

ఇందులోనే డీఏ, డీఆర్ పెంపు నిర్ణయానికి ఆమోదముద్ర వేస్తారని అందరూ భావిస్తున్నారు.

కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు త్వరలోనే కరవు భత్యం (డీఏ) పెంపుపై గుడ్‌న్యూస్‌ అందనుంది. డీఏ పెంపుపై వారంలో ప్రకటన వెలువడే అవకాశం ఉంది. ఏడో వేతన సంఘం ప్రతిపాదనల్లో భాగంగా కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు డీఏ పెంపు జరగనుంది.

దీనిపై హోలీ పండుగ లోపు నిర్ణయం వెలువడే అవకాశముంది. కేంద్ర సర్కారు బుధవారం క్యాబినెట్ సమావేశం నిర్వహించనుంది. ఇందులోనే డీఏ, డీఆర్ పెంపు నిర్ణయానికి ఆమోదముద్ర వేస్తారని అందరూ భావిస్తున్నారు. దీంతో ఉద్యోగుల మూల వేతనంలో డీఏ 55 శాతానికి పెరిగే అవకాశం ఉంది. మొత్తం 1.2 కోట్ల మందికి పైగా ఉద్యోగులు, పెన్షన్లరకు దీని ద్వారా లబ్ధి చేకూరనుంది.

కేంద్ర ఉద్యోగులకు ప్రతి ఏడాది మార్చి, అక్టోబర్ నెలల్లో రెండుసార్లు డీఏ పెంపు ఉంటుంది. మార్చిలో డీఏ పెంపు జనవరి నుంచి, అలాగే అక్టోబర్‌ నెలలో చేసే ప్రకటన జూలై నుంచి అమల్లోకి వస్తాయి.

Also Read: గుడ్‌న్యూస్‌.. తగ్గిన ధర.. తెలుగు రాష్ట్రాల్లో బంగారం ధరలు ఎలా ఉన్నాయో తెలుసా?

అయితే, 2025 మార్చి 5 న్యూఢిల్లీలో జరిగిన క్యాబినెట్ సమావేశంలో డీఏ పెంపుపై ఎటువంటి చర్చ జరగలేదు. చివరిసారిగా కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు డీఏ పెంపు గత ఏడాది జూలైలో జరిగింది. అప్పుడు దాన్ని 50 శాతం నుంచి 53 శాతానికి పెంచారు.

దీనికి ముందు, 2024 మార్చి 7 కేబినెట్ 46 శాతం నుంచి 50 శాతానికి డీఏ పెంపును ఆమోదించింది. దీన్ని మార్చి 25 (హోలీకి కొన్ని రోజుల ముందు) అధికారికంగా ప్రకటించారు.

7వ వేతన సంఘం సిఫార్సుల మేరకు ప్రభుత్వం గత ఏడాది అక్టోబర్ 16న కూడా డీఏ, డీఆర్‌లను 3 శాతం పెంచింది. 2024 జూలై 1 నుంచి అమలులోకి వచ్చేలా రెండింటినీ 53 శాతానికి పెంచింది.

అదనంగా, ఈ ఏడాది జనవరిలో కేంద్ర ప్రభుత్వం ప్రభుత్వం 8వ వేతన సంఘ ప్రణాళికలను ప్రకటించింది. ఇది వచ్చే ఏడాది నాటికి అమలు అవుతుందని భావిస్తున్నారు. 8వ వేతన సంఘం అమలులోకి వచ్చిన తర్వాత, ఇప్పటికే ఉన్న అలవెన్సులను రద్దు చేసి, కొత్త అలవెన్సులు ప్రవేశపెట్టవచ్చని పలు రిపోర్టులు చెబుతున్నాయి.