Gold And Silver Price: గుడ్‌న్యూస్.. తగ్గిన ధర.. తెలుగు రాష్ట్రాల్లో బంగారం ధరలు ఎలా ఉన్నాయో తెలుసా?
హైదరాబాద్‌లో కిలో వెండి ధర రూ.1,07,000గా ఉంది.

దేశంలో ఇవాళ బంగారం ధరలు తగ్గాయి. ఇవాళ ఉదయం నమోదైన వివరాల ప్రకారం.. దేశంలో బంగారం ధరల్లో రూ.300 తగ్గుదల కనపడింది. అలాగే, వెండి ధరల్లో రూ.1000 తగ్గుదల కనపడింది. గోల్డ్‌లో పెట్టుబడులకు ప్రజలు ఆసక్తి చూపుతున్నారు.
అంతర్జాతీయంగానూ సెంట్రల్ బ్యాంకులు కూడా బంగారాన్ని అధిక మొత్తంలో కొనుగోలు చేస్తున్నాయి. ఆర్థిక అనిశ్చితి నుంచి బంగారం ధరలు బయటపడేస్తాయన్న కారణంతో సెంట్రల్ బ్యాంకులు పసిడిని పెద్ద మొత్తంలో దిగుమతి చేసుకుంటున్నాయి.
తెలుగు రాష్ట్రాల్లో పసిడి ధరలు
ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో పసిడి ధరలు తులానికి దాదాపు 80 వేల రూపాయలు దాటిపోయాయి. హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్నంలో ఇవాళ ఉదయం 10 గ్రాముల 22 క్యారెట్ల పసిడి ధర రూ.80,200గా ఉంది. 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.87,490గా ఉంది.
ఢిల్లీ, ముంబైలో..
- ఢిల్లీలో 22 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.80,350గా ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.87,640గా ఉంది
- ముంబైలో ఇవాళ ఉదయం 10 గ్రాముల 22 క్యారెట్ల పసిడి ధర రూ.80,200గా ఉంది. 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.87,490గా ఉంది.
వెండి ధరలు
దేశంలో వెండి ధరల్లో రూ.1000 తగ్గుదల కనపడింది. వివిధ నగరాల్లో ధరల వివరాలు ఇలా ఉన్నాయి.
- హైదరాబాద్‌లో కిలో వెండి ధర రూ.1,07,000గా ఉంది
- విజయవాడలో కిలో వెండి ధర రూ.1,07,000గా ఉంది
- విశాఖలో కూడా కిలో వెండి ధర రూ.1,07,000గా ఉంది
- ఢిల్లీలో కిలో వెండి ధర రూ.1000 తగ్గి రూ.98,000గా ఉంది
- ముంబైలో కిలో వెండి ధర రూ.1000 తగ్గి రూ.98,000గా ఉంది
ఈ బంగారం ధరలు ఇవాళ ఉదయం ఉన్న వివరాల ప్రకారం ఇచ్చాం. బంగారం ధరల్లో మార్పులు చోటుచేసుకుంటుంటాయి. బంగారం కొనుక్కునే సమయంలో అప్పటి వివరాలను చూసి కొనుగోలు చేయాలి.