8th Pay Commission
8th Pay Commission : కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లకు గుడ్ న్యూస్.. దేశంలోని లక్షలాది మంది ప్రభుత్వ ఉద్యోగులలో 8వ వేతన సంఘం గురించి ఉత్కంఠ నెలకొంది.
Read Also : BSNL Recharge Plan : గుడ్ న్యూస్.. BSNL రూ. 299 ప్లాన్‌తో రోజుకు 3GB డేటా, అన్‌లిమిటెడ్ కాలింగ్..!
8వ వేతన సంఘం అమలు తర్వాత ఉద్యోగుల, పెన్షనర్ల జీతం ఎంత పెరుగుతుంది? ఎవరికి ఎంత ప్రయోజనం లభిస్తుంది అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి.
ఉద్యోగి జీతం పెంపుదల ఫిట్‌మెంట్ ఫ్యాక్టర్‌పై ఆధారపడి ఉంటుంది. కానీ, కేంద్ర ప్రభుత్వం నుంచి ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు.
వేతన కమిషన్‌లోని ప్రధాన అంశమైన ఫిట్‌మెంట్ అంశంపై చర్చ ఎత్తి చూపాయి. పెరుగుతున్న ద్రవ్యోల్బణంతో సెంట్రల్ పే కమిషన్ (CPC) ఫిట్‌మెంట్ ఫ్యాక్టర్ కూడా సవరిస్తుందని కొందరు వాదిస్తున్నారు.
8వ వేతన సంఘం కింద కొత్త షరతులు ప్రకటించినప్పుడల్లా రూ. 50 లక్షలకు పైగా ఉద్యోగులు, రూ. 65 లక్షల మంది పెన్షనర్ల జీతం పెరగనుంది.
ఫిట్‌మెంట్ ఫ్యాక్టర్ 2.86 :
8వ వేతన సంఘం కింద CPC 2.86 ఫిట్‌మెంట్ ఫ్యాక్టర్ ఉండవచ్చు. ప్రస్తుత ద్రవ్యోల్బణం పరిశీలిస్తే.. 8వ వేతన సంఘం ప్రకారం.. 2.86 ఫిట్‌మెంట్ ఫ్యాక్టర్ అని నిపుణులు అంచనా వేస్తున్నారు.
జీతం ఎంత పెరగనుంది? :
సీపీసీ CPC 2.86 ఫిట్‌మెంట్ ఫ్యాక్టర్ నిర్ణయిస్తే.. జీతంలో భారీ పెంపు ఉంటుంది. ఫిట్‌మెంట్ ఫ్యాక్టర్ బట్టి కొత్త వేతనల పెంపు ఉంటుంది. ప్రభుత్వ ఉద్యోగి కనీస వేతనాన్ని ఫిట్‌మెంట్ ఫ్యాక్టర్‌తో వేతనల్లో పెరుగుదల ఉంటుంది.
Read Also : AC Blast : వేసవిలో ఏసీలు పేలుతున్నాయి.. అదేపనిగా ఆన్ చేస్తున్నారా? ఈ 5 విషయాల్లో జాగ్రత్త..!
కనీస వేతనం x ఫిట్‌మెంట్ కారకం = కొత్త పెంపు :
CPC రూ. 10వేలు, 2.86 ఫిట్‌మెంట్ ఫ్యాక్టర్‌గా నిర్ణయిస్తే.. కొత్త పెంపు 2.86X10,000 = 28,600 అవుతుంది. ఈ ఏడాది డిసెంబర్‌లో 7వ వేతన సంఘం ముగియనుంది. దీని ప్రకారం.. 2.57 ఫిట్‌మెంట్ ఫ్యాక్టర్ నిర్ణయించారు. 8వ వేతన సంఘం ప్రకారం.. ఈసారి 2.86గా ఫిట్‌మెంట్ ఫ్యాక్టర్ నిర్ణయిస్తే.. ప్రభుత్వ ఉద్యోగుల జీతం మరింత పెరుగుతుంది.