BSNL Recharge Plan : గుడ్ న్యూస్.. BSNL రూ. 299 ప్లాన్‌‌తో రోజుకు 3GB డేటా, అన్‌లిమిటెడ్ కాలింగ్‌..!

BSNL Recharge Plan : బీఎస్ఎన్ఎల్ యూజర్ల కోసం రూ.299 ప్లాన్‌తో 3GB డేటా, అన్‌లిమిటెడ్ కాలింగ్‌ పొందొచ్చు. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.

BSNL Recharge Plan : గుడ్ న్యూస్.. BSNL రూ. 299 ప్లాన్‌‌తో రోజుకు 3GB డేటా,  అన్‌లిమిటెడ్ కాలింగ్‌..!

BSNL

Updated On : May 18, 2025 / 11:56 AM IST

BSNL Recharge Plan : బీఎస్ఎన్ఎల్ యూజర్లకు గుడ్ న్యూస్.. ప్రభుత్వ టెలికాం సంస్థ బీఎస్ఎన్ఎల్ అద్భుతమైన రీఛార్జ్ ప్లాన్లను అందిస్తోంది. ప్రభుత్వ సంస్థ రీఛార్జ్ ప్లాన్‌లు చౌకైన ధరకే అందుబాటులో ఉన్నాయి.

Read Also : iPhone 16 Pro Max : ఐఫోన్ 16 ప్రో మ్యాక్స్ ధర తగ్గిందోచ్.. ఏకంగా రూ.15,700 డిస్కౌంట్.. ఇలా చేస్తే ఇంకా తక్కువ ధరకే..!

రూ.300 కన్నా తక్కువ రీఛార్జ్ ప్లాన్ :
అన్‌లిమిటెడ్ కాలింగ్, బంపర్ వ్యాలిడిటీ, డేటాను కూడా పొందొచ్చు. మీరు ఈ రీఛార్జ్ ప్లాన్‌ సులభంగా పొందవచ్చు. ఇంటర్నెట్ స్పీడ్‌తో ఫ్రీ కాలింగ్‌ కూడా పొందవచ్చు.

రూ.299 ప్లాన్‌ బంపర్ :
బీఎస్ఎన్ఎల్ రూ.299 ప్రీపెయిడ్ ప్లాన్‌లో యూజర్లు 30 రోజుల వ్యాలిడిటీతో అందిస్తుంది. ఈ రీఛార్జ్‌లో యూజర్లు రోజుకు 3GB డేటాను కూడా అందిస్తుంది.

రోజుకు 100 SMS మెసేజ్‌లను కూడా పొందొచ్చు. డేటా లిమిట్ తర్వాత ఇంటర్నెట్ 40kbps స్పీడ్‌‌తో వస్తుంది. రోజువారీ డేటా లిమిట్ తర్వాత తక్కువ స్పీడ్ ఇంటర్నెట్‌ పొందొచ్చు.

Read Also : iPhone 15 Plus : ఐఫోన్ 15 ప్లస్‌పై బిగ్ డిస్కౌంట్.. కేవలం రూ. 18,750కే సొంతం కొనేసుకోండి..!

411 ప్రీపెయిడ్ ప్లాన్ :
BSNL రూ.411 ప్లాన్ ధరగా నిర్ణయించింది. ఈ ప్లాన్ వ్యాలిడిటీ 3 నెలలు అంటే.. 90 రోజులుగా ఉంటుంది. ఈ ప్లాన్‌లో యూజర్లు రోజుకు 2GB డేటా పొందవచ్చు. డేటా లిమిట్ తర్వాత ఇంటర్నెట్ 40kbps తగ్గుతుంది.