8th Pay Commission
8th Pay Commission : 8వ వేతన సంఘం ఎప్పుడు అమల్లోకి వస్తుందా? అని కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ వేతన సంఘం అమల్లోకి వచ్చిన వెంటంనే భారీగా జీతాలు పెరగనున్నాయి. ఇంతకీ, ఏయే ఉద్యోగులకు ఎంతమేర జీతం పెరుగుతుంది? అసలు ఫిట్‌మెంట్ ఫ్యాక్టర్ ఎంత ఉండనుంది? డీఏ ఎంత పెంపు ఉంటుంది అనేక విషయాలపై కూడా దాదాపు క్లారిటీ వచ్చినట్టే కనిపిస్తోంది.
అదేగానీ జరిగితే.. ఉద్యోగుల వేతనాలు లక్ష వరకు పెరిగినా ఆశ్చర్యం పడనక్కర్లేదు. ఇప్పటికే, కేంద్ర ప్రభుత్వం 8వ వేతన సంఘం ఏర్పాటుకు ఆమోదం తెలిపిన సంగతి తెలిసిందే. దాంతో 50 లక్షల మంది ఉద్యోగులు, 65 లక్షల మంది పెన్షనర్లకు భారీగా ప్రయోజనాలు అందనున్నాయి. ఇప్పుడు ఉద్యోగులు, పెన్షనర్లలో ఇదే పెద్ద చర్చ నడుస్తోంది.
8వ వేతన సంఘం అమలు ఎప్పుడంటే? :
దేశవ్యాప్తంగా 1 కోటి మందికి పైగా ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్ల జీతం, పెన్షన్ పెరుగుతుంది. చాలా మంది కొత్త జీత కింద తమ నెలవారీ ఆదాయం ఎంత పెరుగుతుందో తెలుసుకోవాలని ఆసక్తి కనబరుస్తున్నారు. ముఖ్యంగా తమ వేతనాలు, పెన్షన్ ఎంతవరకు పెంచబోతున్నారే ఉత్కంఠ నెలకొంది.
గత 7వ వేతన సంఘం మాదిరిగానే జీతాల పెంపు ఉండనుందా? అనే చర్చ కూడా జరుగుతోంది. నివేదికల ప్రకారం.. ప్రధానంగా గ్రేడ్ల వారీగా లెవెల్ 1 నుంచి లెవెల్ 10 ఉద్యోగుల వరకు భారీగా వేతనాలు పెరుగుతాయని అంచనా వేస్తున్నారు. 8వ వేతన సంఘం వచ్చే ఏడాది అంటే 2026 జనవరి 1 నుంచి అమల్లోకి రానుందని అంటున్నారు.
ఫిట్‌మెంట్ ఫ్యాక్టర్ ఏంటి? :
ఫిట్‌మెంట్ ఫ్యాక్టర్ అనేది కనీస వేతనాన్ని పెంపును సూచిస్తుంది. 7వ వేతన సంఘంలో 2.57గా ఉంది. లెవల్ 1 కనీస వేతనం రూ.7,000 (6వ వేతన సంఘం) నుంచి రూ.18,000కి పెరిగింది. డియర్‌నెస్ అలవెన్స్ (DA), ఇంటి అద్దె అలవెన్స్ (HRA), రవాణా అలవెన్స్, ఇతర ప్రయోజనాలతో మొత్తం వేతనం రూ. 36,020గా ఉంటుంది.
ఫిట్‌మెంట్ కారకం 2.86 పెంపు అంచనా :
8వ వేతన సంఘంలో ఫిట్‌మెంట్ కారకాన్ని 2.86కి పెంచవచ్చునని అంటున్నారు. ఇదే జరిగితే, లెవల్ 1లో కనీస వేతనం రూ.18,000 నుంచి రూ.51,480కి పెరుగుతుంది. ఉద్యోగుల జీతం, పెన్షన్‌లో గణనీయమైన పెరుగుదల ఉండనుంది.
8వ వేతన కమిషన్ జీతాల పెంపు.. ఏ ఉద్యోగికి ఎంతంటే? :