Cybersecurity Layoffs : ముందు రోజు ఉద్యోగులకు గ్రాండ్‌గా మందు పార్టీ.. మరుసటి రోజున అందరిని పీకేసింది.. టెక్ కంపెనీ భలే షాకిచ్చిందిగా..!

Cybersecurity Layoffs : బిషప్ ఫాక్స్ (Bishop Fox) అనే సైబర్ సెక్యూరిటీ కంపెనీ 50 మంది ఉద్యోగులను తొలగించింది. కంపెనీ శ్రామిక శక్తిలో దాదాపు 13 శాతం. ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఆర్థిక పరిస్థితిని దృష్టిలో ఉంచుకుని, ఖర్చులను ఆదా చేసుకునేందుకు ఉద్యోగులను తొలగించింది.

Cybersecurity Layoffs : టెక్ కంపెనీల్లో ఉద్యోగాల కోత ఇంకా కొనసాగుతూనే ఉంది. ఈ ఏడాదిలో అనేక టెక్ కంపెనీలు తమ ఉద్యోగులను ఇంటికి పంపించాయి. ప్రస్తుత పరిస్థితులు చూస్తుంటే.. ఇంకా ఉద్యోగుల తొలగింపుల సీజన్ ముగియలేదనే చెప్పాలి. ఇప్పటికీ చాలా కంపెనీలు తమ ఉద్యోగులను తొలగిస్తున్నాయని తెలుస్తోంది. బిషప్ ఫాక్స్ (Bishop Fox) అనే సైబర్ సెక్యూరిటీ కంపెనీ 50 మంది ఉద్యోగులను తొలగించింది. (TechCrunch) వివరాల ప్రకారం.. ఈ సైబర్ సెక్యూరిటీ కంపెనీ శ్రామిక శక్తిలో దాదాపు 13 శాతం ఉద్యోగులను తొలగించాలని నిర్ణయించింది.

ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే.. బిషప్ ఫాక్స్ ఇటీవలే తన ఉద్యోగుల కోసం ఒక పెద్ద పార్టీని కూడా ఏర్పాటు చేసింది. అందులో బ్రాండెడ్ పానీయాలను ఉద్యోగులకు అందించింది. దీనిని కంపెనీ ‘సైబర్ సూప్’ అని అంటోంది. ఆసక్తికరంగా, కంపెనీ స్వయంగా పోస్ట్ చేసిన ట్వీట్‌ చేసింది. ఈ ఏడాది తరువాత వేగాస్‌లో ఇతర ఈవెంట్‌లను నిర్వహించాలని కంపెనీ యోచిస్తోందని వెల్లడించింది. ఎందుకంటే.. బ్లాక్ హ్యాట్, డెఫ్ కాన్ సెక్యూరిటీ సమావేశాలు ప్రతి సంవత్సరం ఒకే స్థలంలో నిర్వహిస్తుంటుంది.

Read Also : NoMoPhobia : మీ ఫోన్ కనిపించకపోతే ఇలానే టెన్షన్ పడుతున్నారా? మీకు ఈ ఫోబియా ఉన్నట్టే.. భారత్‌లో 75శాతం మందికి ఇదేనట..!

ముందు జాగ్రత్తగా తొలగింపులు..
ఈ సైబర్ కంపెనీ తమ ఉద్యోగులను తొలగించడానికి అసలు కారణం ఆశ్చర్యపరిచే విషయం కాదు. ప్రపంచవ్యాప్తంగా ఆర్థిక పరిస్థితిని దృష్టిలో ఉంచుకుని, కంపెనీ ఖర్చులను ఆదా చేసుకునేందుకు ఈ తొలగింపులు చేసినట్లు కంపెనీ వెల్లడించింది. ప్రస్తుతానికి తమ కంపెనీ వ్యాపారం స్థిరంగానే ఉందని సైబర్‌ సెక్యూరిటీ సంస్థ తెలిపింది. అయితే, ఆర్థిక మాంద్యం కారణంగా భవిష్యత్తులో ఏమి జరుగుతుందో కచ్చితంగా తెలియదని, అందుకే.. ప్రపంచ ఆర్థిక పరిస్థితి, తమ వ్యాపారాన్ని మరింత మెరుగుపర్చేందుకు ఉద్యోగాల్లో కోత విధించినట్టు నివేదిక వెల్లడించింది. మా సొల్యూషన్స్‌కు డిమాండ్ బలంగా ఉంది.

Cybersecurity Layoffs : A cybersecurity company throws a party with branded drinks and then fires 13 per cent of its workforce

మా వ్యాపారం స్థిరంగా ఉన్నప్పటికీ.. ఈ భిన్నమైన ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో మార్కెట్ అనిశ్చితి, పెట్టుబడి పోకడలను విస్మరించలేమని బిషప్ ఫాక్స్ CEO విన్నీ లియు అన్నారు. బిషప్ ఫాక్స్ రాబోయే త్రైమాసికాలు, సంవత్సరాల్లో వృద్ధి, సాంకేతిక పెట్టుబడులను బట్టి ముందుకు కొనసాగనున్నట్టు కంపెనీ తెలిపింది.

అధిక నియామకాలే కారణమా? :
ఈ సైబర్‌ సెక్యూరిటీ సంస్థలో తొలగింపులకు ముందు దాదాపు 400 మంది ఉద్యోగులు ఉన్నారని ఓ నివేదిక ధృవీకరించింది. దీని ప్రకారం.. ప్రస్తుతం కంపెనీలో దాదాపు 350 మంది ఉద్యోగులు మిగిలారు. బిషప్ ఫాక్స్ తొలగించిన కొంతమంది ఉద్యోగులు తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. ఊహించని విధంగా ఉద్యోగాల్లో కోత విధించడంపై ట్విట్టర్‌ వేదికగా విమర్శించారు.

అంతర్గత పునర్నిర్మాణం కారణంగా ఉద్యోగుల తొలగింపులు జరిగాయని తొలగించిన ఉద్యోగుల్లో ఒకరు నివేదించారు. గత ఏడాదిలో బిషప్ ఫాక్స్ (LinkedIn) ఫాక్స్ డెన్‌లోని అనేక విభిన్న టీంలను నియమించింది. పెంటెస్టింగ్ నుంచి టెక్నికల్ ఎడిటింగ్ వరకు భారీగా నియామకాలను చేపట్టింది. ఇప్పుడు కంపెనీలో ఉద్యోగాల కోత వెనుక అధిక నియామకాలు కూడా ఒక కారణమని నివేదికలు సూచిస్తున్నాయి.

Read Also : Apple CEO Tim Cook : ఆపిల్‌ ఉద్యోగులను తొలగించే ఆలోచనే లేదు.. అది చివరి ప్రయత్నం మాత్రమే.. టిమ్ కుక్ క్లారిటీ..!

ట్రెండింగ్ వార్తలు