NoMoPhobia : మీ ఫోన్ కనిపించకపోతే ఇలానే టెన్షన్ పడుతున్నారా? మీకు ఈ ఫోబియా ఉన్నట్టే.. భారత్‌లో 75శాతం మందికి ఇదేనట..!

NoMoPhobia : మీ ఫోన్ గురించి పదేపదే ఆందోళన చెందుతున్నారా? భారతీయ మొబైల్ యూజర్లలో ప్రతి నలుగురిలో ముగ్గురు నో మొబైల్ ఫోబియా (NoMoPhobia)తో బాధపడుతున్నారని తాజా అధ్యయనంలో తేలింది.

NoMoPhobia : మీ ఫోన్ కనిపించకపోతే ఇలానే టెన్షన్ పడుతున్నారా? మీకు ఈ ఫోబియా ఉన్నట్టే.. భారత్‌లో 75శాతం మందికి ఇదేనట..!

NoMoPhobia _ Is your smartphone your lifeline_ You may have a phobia which affects 75 per cent of Indians

NoMoPhobia : అరచేతిలో స్మార్ట్‌ఫోన్.. ఇది లేకుండా మనిషి జీవితాన్ని ఊహించుకోవడం కష్టమే. ప్రతిఒక్కరి జీవితంలో మొబైల్ ఫోన్ (Mobile Phone Users) అనేది ఒక నిత్యావసరంగా మారిపోయింది. లేచిన దగ్గర నుంచి మళ్లీ నిద్ర పోయేవరకు పక్కన ఫోన్ ఉండాల్సిందే.. ఒక రోజులో క్షణం పాటు ఫోన్ కనిపించకపోతే ఆ టెన్షన్ మాములుగా ఉండదు.. ఉక్కిబిక్కిరి అయిపోతుంటారు. ఏం చేయాలో తోచదు. క్షణం కూడా ఫోన్ లేకుండా జీవించలేరంటే అతిశయోక్తి కాదు. ఈ మొబైల్ ఫోన్ మనుషుల జీవితాన్ని అంతగా ప్రభావితం చేసింది. అరచేతిలో ఫోన్ ఉంటే చాలు.. ప్రపంచాన్ని చుట్టిరావొచ్చు. అలాంటి స్మార్ట్‌ఫోన్ (Smartphone Phobia) విషయంలో భారతీయుల్లో చాలామంది తీవ్ర ఆందోళన చెందుతున్నారని ఓ కొత్త అధ్యయనంలో తేలింది. ఫోన్ లేదనే భావన కలిగితేనే తెగ టెన్షన్ పడిపోతున్నారట..

నలుగురిలో ముగ్గురికి ఈ ఫోబియా :
ఇలాంటి ఆందోళన కలిగితే వారికి ఫోబియా ఉండే అవకాశం ఉందని అధ్యయనం సూచిస్తోంది. ఇప్పటికే చాలామంది భారతీయ మొబైల్ యూజర్లు ఈ ఫోబియా బారిన పడ్డారని తెలిపింది. అంటే.. భారతీయ మొబైల్ యూజర్లలో నలుగురిలో ముగ్గురిని ఈ ఫోబియా ప్రభావితం చేస్తుందని తేలింది. అంటే.. భారతీయ జనాభాలో దాదాపు 75 శాతం మందిపై ఈ ఫోబియా ప్రభావం చాలా ఎక్కువగా ఉందని రుజువైంది. ఈ భయానికి ఒక పేరు కూడా పెట్టారని మీకు తెలుసా? అదే.. నో మొబైల్ ఫోభియా (NoMoPhobia). భారత మార్కెట్లో ప్రతి నలుగురిలో ముగ్గురిని ఈ ఫోబియా ప్రభావితం చేస్తుందని ఒప్పో కౌంటర్‌పాయింట్ లేటెస్ట్ అధ్యయనం వెల్లడించింది.

65 శాతం మందిలో బ్యాటరీ డ్రైన్ ఆందోళన :
నో మొబైల్ ఫోబియా (NoMoPhobia) అంటే.. మొబైల్ ఫోన్ కనిపించకపోవడం వల్ల కలిగే భయం లేదా ఆందోళనను సూచిస్తుంది. భారత్‌లో 65 శాతం మంది స్మార్ట్‌ఫోన్ యూజర్లలో తమ బ్యాటరీ డ్రైన్ అయినప్పుడు మానసికంగా అసౌకర్యానికి గురవుతున్నారని అధ్యయనం కనుగొంది. ఇందులో ఆందోళన, ఆత్రుత, డిస్‌కనెక్ట్, నిస్సహాయత, ఫోన్ ఎక్కడ పోతుందనే భయం, నాడీ, అసురక్షిత భావన వంటి ఎన్నో భయాందోళనలు ఉన్నాయని తెలిపింది. ఈ ఫోబియా తీవ్రతను గుర్తించేందుకు ఒప్పో ఇండియా (Oppo India) కౌంటర్ పాయింట్‌తో కలిసి టైర్ 1, కొన్ని టైర్ 2 నగరాల్లోని 1,500 మంది స్మార్ట్‌ఫోన్ యూజర్లపై సర్వే నిర్వహించింది.

Read Also : Google Employee : గూగుల్ ఉద్యోగి ఆత్మహత్య.. న్యూయార్క్ ఆఫీసు భవనంపై నుంచి దూకేశాడు.. ఉద్యోగాల్లో కోత కారణమా?

ఈ సర్వేలో బ్యాటరీ పర్ఫార్మెన్స్ సరిగా లేనందున 60 శాతం మంది తమ స్మార్ట్‌ఫోన్‌లను రీప్లేస్ చేయబోతున్నారని అధ్యయనం వెల్లడించింది. ఈ అధ్యయనం చాలా కీలకమైనదిగా Oppo చీఫ్ మార్కెటింగ్ ఆఫీసర్ దమ్యంత్ సింగ్ ఖనోరియా (Damyant Singh Khanoria) పేర్కొన్నారు. ఈ అధ్యయనం ద్వారా తమ ప్రొడక్టులను తయారు చేసే విధానంలో చాలా కీలకంగా ఉంటుందని తెలిపారు.

NoMoPhobia _ Is your smartphone your lifeline_ You may have a phobia which affects 75 per cent of Indians

NoMoPhobia _ Is your smartphone your lifeline_ You may have a phobia which affects 75 per cent of Indians

మహిళల్లో 74 శాతం.. పురుషుల్లో 82 శాతం :
అంతేకాదు.. 74 శాతం మంది మహిళా యూజర్లతో పోలిస్తే.. 82 శాతం మంది పురుష యూజర్లు మరింత ఆందోళన చెందుతున్నారని కూడా అధ్యయనం కనుగొంది. 92.5 శాతం మంది పవర్-సేవింగ్ మోడ్‌ను ఉపయోగిస్తున్నారని, 87 శాతం మంది తమ ఫోన్‌లను ఛార్జింగ్ చేస్తున్నప్పుడు ఉపయోగిస్తున్నారని, మెజారిటీ యూజర్లలో తమ ఫోన్ బ్యాటరీ లైఫ్ గురించి ఎక్కువ మంది అవగాహన కలిగి ఉన్నారని సర్వే వెల్లడించింది. స్మార్ట్‌ఫోన్ల వినియోగం పరంగా పరిశీలిస్తే.. 42 శాతం మంది ప్రతివాదులు తమ స్మార్ట్‌ఫోన్‌లను ప్రధానంగా ఎంటర్‌టైన్మెంట్ కోసం ఉపయోగిస్తున్నారని నివేదించారు. సోషల్ మీడియాలో అదనంగా 65 శాతం మంది వినియోగదారులు తమ బ్యాటరీని సేవ్ చేసేందుకు తమ ఫోన్ వినియోగాన్ని పరిమితం చేస్తే.. 82 శాతం మంది తమ సోషల్ మీడియా వినియోగాన్ని పరిమితం చేశారు.

NoMoPhobia _ Is your smartphone your lifeline_ You may have a phobia which affects 75 per cent of Indians

NoMoPhobia _ Is your smartphone your lifeline_ You may have a phobia which affects 75 per cent of Indians

ఫోన్ ఫోబియాను అధిగమించాలంటే? :
ప్రస్తుతం మన చేతుల్లో స్మార్ట్‌ఫోన్‌లు ప్రపంచ సాధనంగా మారాయి. వ్యక్తిగతంగా, వృత్తిపరంగా వినోదం కోసం కూడా కనెక్ట్ అయ్యేందుకు వీలు కల్పిస్తాయి. మనలో చాలా మందికి ఫోన్‌లు లేకుండా ఉండాలంటేనే భయంగా అనిపిస్తుంటుంది. వారిలో చాలామంది తరచుగా ఫోన్ గురించి ఆందోళన చెందుతారు. బ్యాటరీ అయిపోవడం, వారి ఫోన్‌లను వాడకలేకపోవడం, 31 నుంచి 40 ఏళ్ల వయస్సు గల వర్కింగ్ వయస్సు గలవారిలో బ్యాటరీ తక్కువగా ఉండే ఆందోళన ఎక్కువగా ఉంటుంది. వారి తర్వాత 25 నుంచి 30 ఏళ్ల వయస్సు గల వారిలో ఈ ఫోబియా ఉందని కౌంటర్‌పాయింట్ రీసెర్చ్ డైరెక్టర్, తరుణ్ పాఠక్ చెప్పారు.

ప్రస్తుత రోజుల్లో మన స్మార్ట్‌ఫోన్‌లు మనం మాట్లాడే విధానాన్ని, ఇతరులతో కనెక్ట్ అయ్యే విధానాన్ని మార్చేశాయి. అలాగే, జీవితాలపై ప్రతికూల ప్రభావాలను కూడా కలిగిస్తాయని గుర్తించాలి. అందుకే ఫోన్ల విషయంలో కలిగే ఆందోళనలను తగ్గించుకునేందుకు ప్రయత్నించాలని మానసిక నిపుణులుస సూచిస్తున్నారు. గంటలకొద్ది ఫోన్ వినియోగించరాదు. మధ్య కొద్ది సమయమైన ఫోన్ వాడకానికి గ్యాప్ ఇవ్వాలి. ఫోన్ మితంగా వాడటం అలవాటు చేసుకోవాలి. మన ఫోన్‌ల వాడకంపై అవగాహనతో పాటు జాగ్రత్తగా ఉండాలి. కొద్దిరోజులు ఇలా చేయడం ద్వారా క్రమంగా నో ఫోన్ ఫోబియా (NoMoPhobia)ని అధిగమించవచ్చు.

Read Also : Cognizant AI Tools : కాగ్నిజెంట్‌లో 3,500 మంది ఉద్యోగుల తొలగింపు.. ఏఐ టూల్స్‌పై పెట్టుబడి కోసమేనా?