Varanasi : వారణాసిలో మహేశ్ బాబు మేనల్లుడు!

వారణాసి (Varanasi) మూవీపై నెక్స్ట్‌ లెవల్‌ హైప్ కంటిన్యూ అవుతోంది.

Varanasi : వారణాసిలో మహేశ్ బాబు మేనల్లుడు!

Gossip Garage Mahesh Babu nephew in Varanasi movie

Updated On : November 26, 2025 / 10:39 AM IST

Varanasi : వారణాసి మూవీపై నెక్స్ట్‌ లెవల్‌ హైప్ కంటిన్యూ అవుతోంది. టైటిల్‌ రిలీజ్‌ ఈవెంట్ దునియా దృష్టిని ఆకట్టుకోవడంతో పాటు మూవీపై ఇంట్రెస్ట్‌ను పెంచుతోంది. హిస్టారిల్‌గా మూవీగా తెరకెక్కబోతున్న వారణాసి (Varanasi) మూవీలో యంగ్‌ మహేష్‌గా ఎవరైతే బాగుంటుందన్న చర్చ జరుగుతోంది.

అయితే మహేష్ బాబు బావ, కృష్ణ అల్లుడు అయిన యాక్టర్ సుధీర్ బాబు కొడుకు దర్శన్‌.. యంగ్‌ మహేష్‌గా కనిపించబోతున్నాడట. మహేష్ టీనేజ్ కుర్రాడిగా కనిపించే సీన్స్‌లో దర్శన్ నటించబోతున్నట్టుగా ప్రచారం జరుగుతోంది.

Sampath Nandi : టాలీవుడ్ ద‌ర్శ‌కుడు సంప‌త్ నంది ఇంట తీవ్ర విషాదం

సుధీర్‌బాబు రెండో కుమారుడు దర్శన్ ఇప్పటికే ప్రభాస్ యంగ్ వెర్షన్‌గా సలార్‌లో ఫ్లాష్‌ బ్యాక్ సీన్స్‌లో కనిపించి, సోషల్ మీడియాలో వైరల్ అయ్యాడు. ఇప్పుడు మహేష్ బాబు కథలో ఎంట్రీ చేస్తున్నాడనే టాక్‌తో ఫ్యాన్స్ ఫుల్‌ ఎగ్జైట్‌మెంట్‌గా ఫీల్‌ అవుతున్నారు.

Malavika Mohanan : ప్రభాస్ ‘రాజాసాబ్’ సినిమాపై హీరోయిన్ కామెంట్స్.. ఏదో రెండు మూడు సీన్స్ ఇస్తారనుకున్నా..

వారణాసి మూవీలో మహేష్ క్యారెక్టర్ ఒక బ్రాహ్మణ్ ఫ్యామిలీ నుంచి వచ్చిన యువకుడు, వారణాసి గంగా తీరంలో జీవితం గడిపే స్టోరీ అంటున్నారు. యంగ్ ఏజ్ పది పదిహేనేళ్లలో అతను ఇన్నోసెంట్‌లాగా చూపించాలి. దర్శన్‌కు ఈ రోల్ పర్‌ఫెక్ట్‌గా సూట్ అవుతుందంట. దర్శన్‌ ఫేస్‌ కట్‌.. స్మైల్, ఎక్స్‌ప్రెషన్స్ అన్ని మహేష్‌ లాగే ఉంటాయంటున్నారు. దర్శన్ స్క్రీన్‌ టెస్ట్ చేసి, లుక్ టెస్ట్‌ పాస్ అయ్యాకే ఓకే చేశారని అంటున్నారు. యంగ్ మహేష్‌గా కనిపించేది దర్శనేనా.? లేక మరో ఆర్టిస్ట్‌ను తీసుకుంటారా అనేది వేచి చూడాలి.