F1 Visa : భారతీయ విద్యార్థులకు అమెరికా భారీ ఊరట.. ఎఫ్-1 విద్యార్థి వీసాల్లో కీలక మార్పులు
F1 Visa : అమెరికాకు వెళ్లి విద్యనభ్యసించాలనుకున్న భారతీయ విద్యార్థులకు గుడ్ న్యూస్. ఎఫ్-1 వీసాల్లో కీలక మార్పులు చేసింది.
F-1 Visa
F1 Visa : అమెరికాకు వెళ్లి విద్యనభ్యసించాలనుకున్న భారతీయ విద్యార్థులకు గుడ్ న్యూస్. ఎఫ్-1 వీసాల్లో కీలక మార్పులు చేసేందుకు ఆ దేశం సిద్ధమైంది. ఇకపై విద్యార్థులు తమ గ్రాడ్యుయేషన్ పూర్తయిన తరువాత తప్పనిసరిగా స్వదేశానికి తిరిగెళ్తామని నిరూపించుకోవాల్సిన అవసరం లేదు. పూర్తి వివరాల్లోకి వెళితే..
ఉన్నత చదువుల కోసం అమెరికా వెళ్లాలనుకునే విద్యార్థులకు అగ్రరాజ్యం భారీ ఊరట కల్పించేందుకు సిద్ధమైంది. ఇందుకోసం ఎఫ్-1 విద్యార్థి వీసాల్లో కీలక మార్పులు తీసుకురానుంది. ప్రస్తుతం అనుసరిస్తున్న ‘ఇంటెంట్ టు లీవ్’ నిబంధన రద్దు దిశగా డిగ్నిటీ యాక్ట్-2025ను చట్టసభ్యులు ప్రతిపాదించారు.
Also Read: మలేషియాలో 16 ఏళ్లలోపు పిల్లలు సోషల్ మీడియా వాడకుండా బ్యాన్.. ఇప్పటివరకు ఏయే దేశాలు ఇలా..?
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ రెండోసారి అధ్యక్ష పీఠాన్ని అదిరోహించిన తరువాత విదేశీ విద్యార్థులపై అనేక నిబంధనలు విధించారు. దీంతో.. ముఖ్యంగా భారతీయులకు ఈ నిబంధనలు ఇబ్బందికరంగా మారాయి. ఫలితంగా ఈ ఏడాది భారత విద్యార్థులకు ఎఫ్-1 వీసాల జారీ సంఖ్య భారీగా తగ్గింది. వీటిలో అత్యధికంగా ఇంటెంట్ టు లీవ్ ను నిరూపించుకోలేని అభ్యర్థులవే ఉండటం గమనార్హం.
‘ఇంటెంట్ టు లీవ్’ నిబంధన రద్దు దిశగా డిగ్నిటీ యాక్ట్-2025ను చట్టసభ్యులు ప్రతిపాదించారు. ఈ ప్రతిపాదనలు బిల్లు దశలోనే ఉన్నాయి. అమెరికా కాంగ్రెస్ ఉభయసభల్లో ఇది ఆమోదం పొంది అధ్యక్షుడు సంతకం చేసిన తరువాత డిగ్నిటీ చట్టం అమల్లోకి రానుంది. అదే జరిగితే అమెరికాకు వచ్చే విదేశీ విద్యార్థుల సంఖ్య పెరిగే అవకాశం ఉందని ట్రంప్ యంత్రాంగం భావిస్తోంది.
