×
Ad

Aadhaar-PAN Deadline : టాక్స్ పేయర్లకు బిగ్ అలర్ట్.. మీ ఆధార్, పాన్ కార్డు లింక్ చేయలేదా? ఈరోజే లాస్ట్ భయ్యా.. స్టేటస్ చెకింగ్ ఇలా..

Aadhaar-PAN Deadline : ఆధార్-పాన్ లింక్ గడువు నేటితో ముగుస్తుంది. ఆదాయ పన్ను శాఖ అధికారిక వెబ్‌సైట్ లో SMS ద్వారా లింక్ స్టేటస్ చెక్ చేసుకోవచ్చు.

Aadhaar-PAN Deadline (Image Credit to Original Source)

  • ఆధార్-పాన్ లింకింగ్ డిసెంబర్ 31, 2025తో ముగుస్తుంది.
  • ఆధార్ లింక్ చేయని పాన్‌ కార్డులు 2026 జనవరి 1 నుంచి చెల్లవు.
  • ఆన్‌లైన్‌లో లేదా SMS ద్వారా స్టేటస్ చెక్ చేయవచ్చు.

Aadhaar-PAN Deadline : ఆధార్ కార్డు, పాన్ కార్డుదారులకు బిగ్ అలర్ట్.. మీ ఆధార్, పాన్ లింక్ చేశారా? లేదంటే ఇప్పుడే లింక్ చేయండి.. డిసెంబర్ 31, 2025తో ఆధార్, పాన్ కార్డు లింక్ డెడ్ లైన్ ముగుస్తోంది. ఈరోజుతో లాస్ట్ డేట్.. మీరు ఇంకా రెండింటినీ లింక్ చేయకపోతే పన్ను చెల్లింపుదారులు భారీగా మూల్యం చెల్లించాల్సి రావొచ్చు. 2025 ఏడాదిలో ఆధార్, పాన్ లింక్ చేసుకున్నారో లేదో చెక్ చేసుకోవాలని కేంద్ర ప్రభుత్వం హెచ్చరిస్తోంది.

డిసెంబర్ 31, 2025 (నేడు) ఆధార్ పాన్ లింక్ ప్రక్రియకు చివరి గడువు. రేపటి నుంచి (జనవరి 1, 2026) మీ పాన్ కార్డు చెల్లదు. మీ ఆదాయపు పన్ను రిటర్న్‌లు, వాపసులు, బ్యాంకింగ్, పెట్టుబడి వంటి ఆర్థిక లావాదేవీలపై తీవ్ర ప్రభావం పడుతుంది. ఆదాయపన్ను అధికారిక వెబ్‌సైట్‌లో SMS ఉపయోగించి మీరు ఆధార్-పాన్ లింక్ స్టేటస్ ఎలా చేయాలో ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం..

ఆధార్-పాన్ లింక్ స్టేటస్ చెక్ చేసేందుకు మీరు తెలుసుకోవాల్సిన విషయాలివే..

  • వ్యాలీడ్ పాన్ కార్డ్
  • వ్యాలీడ్ ఆధార్ నంబర్
  • మీ ఆధార్ కార్డుకు లింక్ చేసిన యాక్టివ్ మొబైల్ నంబర్.

1. ఆదాయపు పన్ను వెబ్‌సైట్‌లోకి లాగిన్ అవ్వకుండానే ఇలా చెక్ చేయండి

  • మీ వెబ్ బ్రౌజర్‌ను ఓపెన్ చేయండి.
  • ఆదాయపు పన్ను ఇ-ఫైలింగ్ వెబ్‌సైట్‌కు వెళ్లండి.
  • మీ పాన్ నంబర్, ఆధార్ నంబర్‌ను ఎంటర్ చేసి View Link ఆధార్ స్టేటస్‌ను ట్యాప్ చేయండి.
  • ఒకసారి పూర్తి చేసిన తర్వాత మీరు ఈ కింది రిజల్ట్స్ దేనినైనా చూడవచ్చు.

లింక్ అయితే.. ‘మీ పాన్ ఇప్పటికే ఇచ్చిన ఆధార్‌తో లింక్ అయింది’ అనే ప్రాంప్ట్‌తో మీకు కనిపిస్తుంది.
రిక్వెస్ట్ ప్రాసెస్‌లో ఉంటే.. ప్రాంప్ట్ ‘మీ ఆధార్-పాన్ లింకింగ్ రిక్వెస్ట్ వెరిఫికేషన్ కోసం UIDAIకి పంపుతుంది. Please Check Later అనే మెసేజ్ కనిపిస్తుంది.
లింక్ చేయకపోతే.. ‘పాన్ ఆధార్‌తో లింక్ చేయలేదు. లింక్ చేసేందుకు దయచేసి ‘Link Aadhaar’పై క్లిక్ చేయండి’ అని ప్రాంప్ట్ చేస్తుంది.

Aadhaar-PAN Deadline (Image Credit to Original Source)

Read Also : Google Pixel 10 Pro : భలే ఉంది భయ్యా ఫోన్.. ఈ గూగుల్ పిక్సెల్ 10ప్రోపై భారీ డిస్కౌంట్, ఇలాంటి డీల్ వదులుకోవద్దు

2. ఆదాయపు పన్ను వెబ్‌సైట్‌లోకి లాగిన్ అవ్వడం ద్వారా చెక్ చేయండి

మీ వెబ్ బ్రౌజర్ ఓపెన్ చేసి ఆదాయపు పన్ను ఇ-ఫైలింగ్ వెబ్‌సైట్‌కు వెళ్లండి.
ఆదాయపు పన్ను ఇ-ఫైలింగ్ పోర్టల్‌లోకి లాగిన్ అవ్వండి.
డాష్‌బోర్డ్‌కి వెళ్లి ‘Link Aadhaar Status’పై క్లిక్ చేయండి.
ప్రత్యామ్నాయంగా, మీరు ‘My Profile’కు వెళ్లి ‘Link Aadhaar Status’ను కూడా ఎంచుకోవచ్చు.

మీకు ఏ మెసేజ్ కనిపిస్తుందంటే? :

ఇప్పుడు మీరు లాగిన్ అయిన తర్వాత మీ ఆధార్-పాన్ లింక్ స్టేటస్ బట్టి కింది పేర్కొన్న మెసేజ్‌లలో ఒకటి కనిపిస్తుంది.
లింక్ అయితే : మీ ఆధార్ నంబర్ కనిపిస్తుంది.
లింక్ చేయకపోతే : ‘లింక్ ఆధార్ స్టేటస్’ అనే ఆప్షన్ కనిపిస్తుంది.
UIDAI వద్ద వెరిఫికేషన్ పెండింగ్‌లో ఉంటే.. మీరు తర్వాత మళ్ళీ చెక్ చేయాలి.

3.SMS ద్వారా ఆధార్–పాన్ లింక్ స్టేటస్ చెక్ చేయండి.

  • మీ మెసేజ్ యాప్‌ను ఓపెన్ చేయండి.
  • ఈ కింది మెసేజ్ టైప్ చేయండి.
  • UIDPAN > 12-అంకెల ఆధార్ నంబర్ > 10-అంకెల పాన్ నంబర్
  • ఈ మెసేజ్ 567678 లేదా 56161కు పంపండి.
  • మీరు మెసేజ్ పంపిన తర్వాత మీరు ఆన్సర్ కోసం వేచి ఉండాలి.
  • SMS రెస్పాండ్ ఈ కింది విధంగా ఉండవచ్చు.
  • లింక్ అయితే ‘ITD డేటాబేస్‌లో ఆధార్ ఇప్పటికే పాన్‌తో లింక్ అయిందనే అనే మెసేజ్ వస్తుంది.
  • లింక్ చేయకపోతే ‘ITD డేటాబేస్‌లో ఆధార్ పాన్‌తో లింక్ చేయలేదు’ అనే మెసేజ్ వస్తుంది.