×
Ad

Aadhaar-PAN : ఆధార్-పాన్ లింక్ డెడ్‌లైన్.. డిసెంబర్ 31లోగా ఈ ఒక్క పనిచేయండి.. లేదంటే భారీ పెనాల్టీ తప్పదు.. సెప్ట్ బై స్టెప్ గైడ్ ఇదిగో..!

Aadhaar-PAN : అక్టోబర్ 1, 2024 కి ముందు ఆధార్ ఎన్‌రోల్‌మెంట్ ఐడీని ఉపయోగించి పాన్ జారీ చేసినవారంతా ఆధార్‌తో పాన్ లింక్ చేయడం తప్పనిసరి. సకాలంలో పూర్తి చేయకపోతే జనవరి 1, 2026 నుంచి మీ పాన్ పనిచేయదు.

Aadhaar-PAN

Aadhaar-PAN : మీ పాన్ కార్డు ఆధార్ కార్డుతో లింక్ చేశారా? లేదంటే ఇప్పుడే లింక్ చేసుకోండి. లేదంటే భారీగా నష్టపోతారు. పాన్ కార్డు లేదా ఆధార్ కార్డులో ఏమైనా తప్పులుంటే ఇప్పుడే సరిదిద్దుకోండి. ఆధార్, పాన్ కార్డు లింక్ గడువు డిసెంబర్ 31, 2025తో ముగియనుంది. రూ. 1,000 పెనాల్టీ చెల్లించాల్సి ఉంటుంది. ముఖ్యంగా ఆర్థిక పన్ను సంబంధిత సేవలు నిలిచిపోకుండా ఉండాలంటే పన్ను చెల్లింపుదారులు ఈ ప్రక్రియను వెంటనే పూర్తి చేయాలి.

పాన్-ఆధార్ లింక్ ఎందుకు ముఖ్యమంటే? :
అక్టోబర్ 1, 2024 కి ముందు ఆధార్ ఎన్‌రోల్‌మెంట్ ఐడీని ఉపయోగించి పాన్ జారీ చేసిన వ్యక్తులకు ఆధార్‌తో పాన్ లింక్ చేయడం చాలా తప్పనిసరి. ఈ అవసరాన్ని సకాలంలో పూర్తి చేయకపోతే జనవరి 1, 2026 నుంచి మీ పాన్ కార్డు పనిచేయదు. ఆదాయపు పన్ను రిటర్న్‌లను దాఖలు చేయలేరు. టాక్స్ రీఫండ్ స్వీకరించడం లేదా బ్యాంకింగ్ లావాదేవీలను నిర్వహించడం వంటి కీలక సేవలను వినియోగించుకోలేరు.

Read Also : 2026 New Cars Launch : కొత్త కారు కొంటున్నారా? 2026లో ఇండియా రోడ్లను షేక్ చేయబోయే SUV, EV కార్లు ఇవే.. ఓ లుక్కేయండి..!

పాన్ ఆధార్‌తో లింక్ చేయకపోతే ఏమౌతుంది? :

  • ఆధార్‌తో లింక్ చేయకపోతే మీ పాన్ కార్డు పనిచేయదు. తద్వారా అనేక సేవలను కోల్పోవాల్సి వస్తుంది.
  • మీ ఆదాయపు పన్ను రిటర్న్ (ITR) దాఖలు చేయలేరు. ఎందుకంటే పన్ను శాఖ మీ రిటర్న్‌ను రిజెక్ట్ చేయొచ్చు.
  • హై TDS/TCS డిడెక్షన్లు, ఫారం 26ASలో క్రెడిట్ రిఫ్లెక్ట్ కావు. TDS/TCS సర్టిఫికెట్లు అందుబాటులో ఉండవు.
  • బ్యాంకు అకౌంట్ ఓపెన్ చేయలేరు. డెబిట్ లేదా క్రెడిట్ కార్డులు పొందలేరు.
    రూ. 50వేల కన్నా ఎక్కువ క్యాష్ డిపాజిట్ చేయడం లేదా రూ. 10వేల కన్నా ఎక్కువ లావాదేవీలు వంటి బ్యాంకింగ్ కార్యకలాపాలపై లిమిట్స్ ఉంటాయి.
  • వివిధ ఆర్థిక సేవలకు సంబంధించి కేవైసీ సంబంధిత సమస్యలు
  • మ్యూచువల్ ఫండ్ హౌస్‌లు, స్టాక్ బ్రోకర్ల సేవలు నిలిచిపోతాయి
  • సకాలంలో పాన్‌ను ఆధార్‌తో లింక్ చేయడం వల్ల ఈ సమస్యలను నివారించవచ్చు. ఆర్థిక పన్ను సేవలను ఎప్పటిలానే పొందవచ్చు.

పాన్‌ను ఆధార్‌తో ఆన్‌లైన్‌లో లింక్ చేయాలా? స్టెప్ బై స్టెప్ గైడ్ :

  • మీ పాన్, ఆధార్‌తో ఆన్‌లైన్‌లో లింకింగ్ ప్రాసెస్ ఇలా చేయండి
  • ఆదాయపు పన్ను ఇ-ఫైలింగ్ పోర్టల్‌ను విజిట్ చేయండి.
  • మీరు ఇంకా పెనాల్టీ చెల్లించకపోతే రూ. 1,000 రుసుము వర్తించవచ్చు.
  • క్విక్ లింక్స్ సెక్షన్ కింద “Link Aadhaar” ఎంచుకోండి.
  • మీ వివరాలను ఎంటర్ చేయండి. మీ ఆధార్ నంబర్, పాన్ ఆధార్ ప్రకారం పేరును ఎంటర్ చేసి ఆపై COnfirm ఆప్షన్ క్లిక్ చేయండి.
  • OTP పేమెంట్‌తో వెరిఫై చేయండి. మీ ఆధార్-లింక్ చేసిన మొబైల్ నంబర్‌కు పంపిన OTPని ఎంటర్ చేయండి.
  • ఛార్జీలు వర్తిస్తే రూ. 1,000 పేమెంట్ చేయండి. పేమెంట్ వెరిఫికేషన్ కోసం వెయిట్ చేయండి.
  • కొన్ని రోజుల తర్వాత, ఇ-ఫైలింగ్ పోర్టల్‌ను తిరిగి ఓపెన్ చేయండి.
  • “Link Aadhaar”కి తిరిగి వెళ్లండి. మీ వివరాలను మళ్ళీ ఎంటర్ చేయండి.
  • మీ పేమెంట్ వివరాలు వెరిఫై అయినట్టుగా అని పాప్-అప్ వస్తుంది. Continue ఆప్షన్ క్లిక్ చేయండి.
  • ఆధార్ పేరు, మొబైల్ నంబర్‌ను ఎంటర్ చేయండి : మీ పూర్తి సమాచారాన్ని ఒకటికి రెండుసార్లు చెక్ చేయండి.
  • వెరిఫికేషన్ : మీ ఆధార్ వివరాలను కన్ఫార్మ్ చేసేందుకు (Agree) బాక్సులో టిక్ చేయండి.
  • లింకింగ్ పూర్తి చేయండి : లింక్ ఆధార్ పై క్లిక్ చేసి 6-అంకెల OTP ఎంటర్ చేయండి. ఆపై (Validate)పై క్లిక్ చేయండి.
  • పూర్తయిన తర్వాత మీ పాన్ మీ ఆధార్‌తో లింక్ అవుతుంది. పన్ను ఇతర సర్వీసులకు ఎలాంటి ఆటంకం ఉండదు.