Adani Group Airport : గౌతమ్ అదానీ చేతికి మరో ఎయిర్ పోర్టు

ప్రముఖ పారిశ్రమికవేత్త గౌతమ్ అదానీ చేతికి మరో ఎయిర్ పోర్టు దక్కింది. ముంబైలోని అంతర్జాతీయ విమానాశ్రయం నిర్వహణ, అభివృద్ధి కాంట్రాక్టు జీవీకే గ్రూపు నుంచి అదానీ గ్రూప్ చేతికి వెళ్లింది.

Adani Group Mumbai International Airport : ప్రముఖ పారిశ్రమికవేత్త గౌతమ్ అదానీ చేతికి మరో ఎయిర్ పోర్టు దక్కింది. ముంబైలోని అంతర్జాతీయ విమానాశ్రయం నిర్వహణ, అభివృద్ధి కాంట్రాక్టు జీవీకే గ్రూపు నుంచి అదానీ గ్రూప్ చేతికి వెళ్లింది. జీవీకే గ్రూప్ నుంచి యాజమాన్య బాధ్యతలు అదానీ గ్రూప్‌నకు మారడంపై గౌతమ్ అదానీ ప్రకటన చేశారు. ప్రపంచస్థాయి ఎయిర్ పోర్టు అదానీ గ్రూపు చేతికి రావడం ఆనందంగా ఉందన్నారు. ఈ ప్రక్రియలో స్థానికులు వేలాది మందికి కొత్తగా ఉద్యోగాలు కల్పించనున్నామని, పోర్టును మరింతగా విస్తరించేలా తమ వద్ద ప్రణాళికలున్నాయని అదానీ వెల్లడించారు.

2024 నాటికి ప్రపంచంలోనే అతిపెద్ద మూడో సివిల్ ఏవియేషన్ మార్కెట్ గా భారత్ అవతరించబోతున్నదన్నారు అదానీ. ఏవియేషన్ రంగంలో అవకాశాలను అదానీ గ్రూపు అందిపుచ్చుకుంటుందని, 2024 నాటికి నవీ ముంబై గ్రీన్ ఫీల్డ్ ఎయిర్ పోర్ట్ అందుబాటులోకి వస్తుందని అశాభావం వ్యక్తం చేశారు అదానీ. కేవలం మెట్రో నగరాల్లోని ఎయిర్ పోర్టులపైనే కాకుండా, దేశంలోని టైర్ 2, 3 సిటీల్లోనూ ఏవియేషన్ సేవల విస్తరణకు తమ గ్రూప్ ప్రయత్నిస్తున్నదన్నారు అదానీ.


ఇప్పటికే జైపూర్, కొచ్చి, తిరువనంతపురం, గువాహటి సహా 6 ఎయిర్ పోర్టుల నిర్వహణకు ఒప్పందం చేసుకున్న విషయాన్ని అదానీ గుర్తుచేశారు. ఇక ప్రస్తుతం దేశీయ ఎయిర్ పోర్టు రంగంలో అదానీ గ్రూప్ వాటా 25శాతానికి చేరింది. దేశంలో అతిపెద్ద ఎయిర్ పోర్టు సంస్థగా అవతరించింది. అదానీ ఎయిర్ పోర్ట్ హోల్డింగ్ లిమిటెడ్.. ఇండియన్ ఎయిర్ కార్గోలో 33శాతం మార్కెట్ వాటానూ సొంతం చేసుకుంది.

ట్రెండింగ్ వార్తలు