టాటాలు.. మనసున్న మంచోళ్లు.. అవును డబ్బున్నోళ్లకు మంచి మనసు ఉండదు అంటారు కదా? కానీ టాటాలకు మాత్రం డబ్బుతో పాటు మనసు కూడా మంచిగా ఉంది అని నిరూపించుకున్నారు. దేశానికి ఏదైనా కష్టం వచ్చిందంటే మేమున్నాం అంటూ ముందుకు వచ్చే టాటాలు మరోసారి మంచి మనసు చాటుకున్నారు.
టాటా గ్రూప్ హోల్డింగ్ కంపెనీ టాటా సన్స్ శనివారం(28 మార్చి 2020) దేశంలో కోవిడ్ -19 సంక్షోభంపై పోరాటానికి రూ.వెయ్యి కోట్లు ఇస్తున్నట్లు ప్రకటించింది. అంతకుముందు కరోనా వైరస్‌ను ఎదుర్కోవడానికి భారీ విరాళాన్ని ప్రకటించారు రతన్ టాటా. రూ. 500కోట్లు ఇస్తున్నట్లు చెప్పారు. దీంతో మొత్తంగా రూ.1,500 కోట్ల మేర నిధులను టాటాలు కరోనా కోసం వినియోగిస్తున్నారు.
కరోనా వైరస్ మహమ్మారిని ఎదుర్కోవడానికి దేశీ పారిశ్రామిక దిగ్గజాలు ఒక్కొక్కరుగా కిలిసి వస్తుండగా.. టాటా ట్రస్ట్స్ చైర్మన్ రతన్ టాటా రూ.500 కోట్ల విరాళం అందించడం.. టాటా సన్స్ రూ.1000కోట్లు ప్రకటించడంపై ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి. టాటా సన్స్ వెంటిలేటర్లు కోసం ఇంకా కరోనా నివారణ కోసం అవసరం అయినవాటి కోసం ఈ డబ్బును వినియోగిస్తామని తెలిపారు.