బైక్ లేదా స్కూటర్ వాడుతున్నారా? కొత్తది కొనాలని ప్లాన్ చేస్తున్నారా? అయితే ఈ వార్త మీకోసమే. దేశంలో రోజురోజుకు పెరుగుతున్న రోడ్డు ప్రమాదాలను అరికట్టేందుకు కేంద్ర ప్రభుత్వం ఒక చరిత్రాత్మక నిర్ణయం తీసుకుంది. వచ్చే ఏడాది జనవరి 1 నుంచి దేశంలో అమ్ముడయ్యే ప్రతి ద్విచక్ర వాహనానికి యాంటీ-లాక్ బ్రేకింగ్ సిస్టమ్ (ABS) తప్పనిసరి కానుంది. ఈ నిర్ణయంతో మీకు భద్రత పెరిగినా, మీపై కేంద్ర సర్కారు కాస్త ఆర్థిక భారం మోపనుంది. పూర్తి వివరాలు ఇప్పుడు చూద్దాం..
అసలు ఏంటి ఈ కొత్త నిబంధన?
ఇప్పటివరకు 150cc కన్నా ఎక్కువ ఇంజన్ సామర్థ్యం ఉన్న బైక్‌లకు మాత్రమే ABS తప్పనిసరి. కానీ కొత్త ప్రతిపాదన ప్రకారం.. ఇకపై 100cc, 125cc వంటి ఎంట్రీ-లెవల్ బైక్‌లు సహా అన్ని ద్విచక్ర వాహనాలకు ఈ నిబంధన వర్తిస్తుంది. త్వరలోనే దీనిపై అధికారిక నోటిఫికేషన్ వెలువడనుంది.
Also Read: కాగ్నిజెంట్ కంపెనీకి స్వాగతం.. రూ.1583 కోట్ల పెట్టుబడి.. 8 వేల ఉద్యోగాలు: లోకేశ్
ABS ఎందుకు ఇంత ముఖ్యం? మీకెలా మేలు చేస్తుంది?
యాంటీ-లాక్ బ్రేకింగ్ సిస్టమ్ (ABS) అనేది ఒక అడ్వాన్స్‌డ్ సేఫ్టీ ఫీచర్. మీరు వేగంగా వెళ్తూ సడన్‌గా బ్రేక్ వేసినప్పుడు, టైర్లు లాక్ అయి బైక్ జారిపడిపోకుండా ఇది కాపాడుతుంది.
లాభాలు
ప్రభుత్వం ఈ కఠిన నిర్ణయం తీసుకోవడానికి కారణాలు
నిపుణులు ఏమంటున్నారు?
రోడ్డు భద్రతా నిపుణులు ఈ నిర్ణయాన్ని స్వాగతిస్తున్నారు. “ఈ నిర్ణయాన్ని చాలా ఆలస్యంగా తీసుకున్నప్పటికీ, ఎంతగానో అవసరమైన నిర్ణయం. చాలా ప్రమాదాలు హఠాత్తుగా బ్రేకులు వేయడం వల్లే జరుగుతున్నాయి” అని IRTE డైరెక్టర్ రోహిత్ బాలూజా అన్నారు.
“ద్విచక్ర వాహనాల ప్రమాదాలు ఎక్కువగా ఉన్న నేపథ్యంలో భద్రత కోసం ABS తప్పనిసరి చేయడం సరైనదే. ఖర్చు కన్నా ప్రాణాలు ముఖ్యం” అని IRF అధ్యక్షుడు కేకే కపిలా చెప్పారు.
ధరల పెరుగుదల
భద్రత పెరిగినా, ఈ నిర్ణయం వల్ల వాహనాల ధరలు పెరగనున్నాయి. ఒక్కో బైక్‌పై రూ.2,500 నుంచి రూ.5,000 వరకు ధర పెరిగే అవకాశం ఉందని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. భారత మార్కెట్‌లో అత్యధికంగా అమ్ముడయ్యేది 75cc-125cc బడ్జెట్ బైక్‌లే. కాబట్టి ఈ ప్రభావం మధ్యతరగతి వినియోగదారులపై ఎక్కువగా ఉంటుంది.
ద్విచక్ర వాహనాల అమ్మకాలు ఏటా పెరుగుతున్న నేపథ్యంలో భద్రతా ప్రమాణాలను పెంచడం అత్యవసరం. ధర కొంచెం పెరిగినా, ABS వల్ల ఎన్నో ప్రాణాలు నిలబడతాయనడంలో సందేహం లేదు.