Amazon Great Freedom Sale : గెట్ రెడీ.. ఈ నెల 31 నుంచే అమెజాన్ గ్రేట్ ఫ్రీడమ్ సేల్.. కొత్త స్మార్ట్‌ఫోన్లపై 80శాతం వరకు డిస్కౌంట్లు..!

Amazon Great Freedom Sale : మరో నాలుగు రోజుల్లో అమెజాన్ గ్రేట్ ఫ్రీడమ్ సేల్ ప్రారంభం కానుంది. ఈ నెల 31 నుంచి అందుబాటులోకి రానుంది.

Amazon Great Freedom Sale

Amazon Great Freedom Sale : అమెజాన్ వినియోగదారులకు గుడ్ న్యూస్.. ఈ-కామర్స్ దిగ్గజం అమెజాన్ ఫ్రీడమ్ సేల్‌ను ప్రకటించింది. మరో ఈ-కామర్స్ దిగ్గజం ఫ్లిప్‌కార్ట్ స్వాతంత్య్ర  (Amazon Great Freedom Sale) దినోత్సవ సేల్‌ను ప్రకటించిన వెంటనే అమెజాన్ కూడా సేల్ తేదీని ప్రకటించింది. అతి త్వరలో అమెజాన్ సేల్ ప్రారంభం కానుంది.

ఈ సేల్ సమయంలో కొనుగోలుదారులు స్మార్ట్‌ఫోన్‌లు, ల్యాప్‌టాప్‌లు, హోం అప్లియన్సెస్ సహా అనేక రకాల వస్తువులను డిస్కౌంట్ ధరకే సొంతం చేసుకోవచ్చు. ప్రత్యేకించి అమెజాన్ ప్రైమ్ యూజర్లు 12 గంటల ముందస్తుగా సేల్ యాక్సస్ చేయగలరు. ఈ సేల్‌లో గోల్డ్ రివార్డులు, గిఫ్ట్ కార్డ్ వోచర్లు, ట్రెండింగ్ డీల్స్, రాత్రి 8 గంటల డీల్స్, బ్లాక్‌బస్టర్ డీల్స్ వంటి స్పెషల్ ఆఫర్‌లు కూడా ఉన్నాయి.

జూలై 31 నుంచే అమెజాన్ సేల్ :
అమెజాన్ ఫ్రీడమ్ సేల్ జూలై 31న మధ్యాహ్నం 12 గంటలకు ప్రారంభమవుతుంది. ప్రైమ్ యూజర్ల కోసం ఈ సేల్ 12 గంటల ముందుగానే (జూలై 31 అర్ధరాత్రి నుంచి) ప్రారంభమవుతుంది. SBI కార్డ్‌తో షాపింగ్ చేసే యూజర్లు ఇన్‌స్టంట్ 10 శాతం డిస్కౌంట్ పొందవచ్చు. ఈ సేల్ కోసం కంపెనీ స్పెషల్ మైక్రోసైట్‌ను క్రియేట్ చేసింది. గోల్డ్ రివార్డులతో అదనంగా 5 శాతం తగ్గింపు లభిస్తుంది.

Read Also : Vodafone Idea : Vi కస్టమర్లకు గుడ్ న్యూస్.. ఈ రీఛార్జ్ ప్లాన్లపై 50GB ఎక్స్‌ట్రా హైస్పీడ్ డేటా, జియోహాట్ స్టార్, అమెజాన్ ప్రైమ్ ఫ్రీగా చూడొచ్చు..!

గిఫ్ట్ కార్డ్ వోచర్ల ద్వారా అదనంగా 10 శాతం సేవ్ చేసుకోవచ్చు. ఇటీవల అమెజాన్ ప్రైమ్ డే సేల్‌ సందర్భంగా స్మార్ట్‌ఫోన్‌లు, టీవీలు, ఏసీలు, రిఫ్రిజిరేటర్‌లతో సహా హోం అప్లియన్సెస్‌పై ఆకర్షణీయమైన డీల్స్ అందించింది. కానీ, ప్రైమ్ యూజర్లకు మాత్రమే యాక్సస్ చేయగలిగారు. కానీ, అమెజాన్‌లో రాబోయే ఫ్రీడమ్ సేల్ ప్రైమ్ అందరి యూజర్లకు అందుబాటులో ఉంటుంది.

అమెజాన్ ఫ్రీడమ్ సేల్ డీల్స్, ఆఫర్లు :
ఈ-కామర్స్ వెబ్‌సైట్‌లోని ‘Bazaar’ సెగ్మెంట్‌లో ఫ్యాషన్, హోం అప్లియన్సెస్‌‌లపై 80 శాతం వరకు డిస్కౌంట్ లభిస్తుంది. స్మార్ట్‌ఫోన్‌లు, టీవీలు, ల్యాప్‌టాప్‌లు, టాబ్లెట్‌లు, ఏసీలు, రిఫ్రిజిరేటర్‌లు వంటి ఎలక్ట్రానిక్ వస్తువులపై ట్రెండింగ్ డీల్స్, 8PM డీల్స్, బ్లాక్‌బస్టర్ డీల్స్ కింద భారీ తగ్గింపులు లభిస్తాయి. అనేక ప్రొడక్టులపై ఎక్స్ఛేంజ్ బెనిఫిట్స్ కూడా పొందవచ్చు. అయితే, ఈ అమెజాన్ సేల్‌ను ముందుగా ప్రైమ్ సభ్యులు యాక్సస్ చేయొచ్చు.

అమెజాన్ ప్రైమ్ మెంబర్‌షిప్ షాపింగ్ ఎడిషన్ ప్లాన్ రూ.399 నుంచి తీసుకోవచ్చు. ఈ రూ.399 ప్లాన్ అమెజాన్ ప్రైమ్ మెంబర్‌షిప్‌ను 12 నెలల పాటు అందిస్తుంది. అమెజాన్ ప్రైమ్ లైట్ వార్షిక ప్లాన్ రూ.799 కాగా, స్టాండర్డ్ ప్రైమ్ మెంబర్‌షిప్ వార్షికంగా రూ.1,499 చెల్లించాలి. నెలవారీ పేమెంట్ల కోసం స్టాండర్డ్ ప్లాన్ నెలకు రూ.299 నుంచి అందుబాటులో ఉంది.