Vodafone Idea : Vi కస్టమర్లకు గుడ్ న్యూస్.. ఈ రీఛార్జ్ ప్లాన్లపై 50GB ఎక్స్‌ట్రా హైస్పీడ్ డేటా, జియోహాట్ స్టార్, అమెజాన్ ప్రైమ్ ఫ్రీగా చూడొచ్చు..!

Vodafone Idea : వోడాఫోన్ ఐడియా తమ యూజర్ల కోసం అనేక ప్లాన్‌లలో 50GB అదనపు డేటాను అందిస్తోంది. అన్‌లిమిటెడ్ కాలింగ్ బెనిఫిట్స్ అందిస్తుంది.

Vodafone Idea : Vi కస్టమర్లకు గుడ్ న్యూస్.. ఈ రీఛార్జ్ ప్లాన్లపై 50GB ఎక్స్‌ట్రా హైస్పీడ్ డేటా, జియోహాట్ స్టార్, అమెజాన్ ప్రైమ్ ఫ్రీగా చూడొచ్చు..!

Vodafone Idea

Updated On : July 27, 2025 / 5:22 PM IST

Vodafone Idea : వోడాఫోన్ ఐడియా యూజర్ల కోసం అనేక ప్రీపెయిడ్ ప్లాన్‌లను ఆఫర్ చేస్తోంది. ప్రముఖ టెలికాం కంపెనీ అధికారిక వెబ్‌సైట్‌లో అనేక రీఛార్జ్ (Vodafone Idea) ప్లాన్‌లను అందిస్తోంది. ఆసక్తిగల వినియోగదారులు నచ్చిన రీఛార్జ్ ప్లాన్‌లను ఎంచుకోవచ్చు. ఈ ప్లాన్‌లలో అన్‌లిమిటెడ్ డేటా కూడా అందుబాటులో ఉంది.

వర్క్ ఫ్రమ్ హోం, ఆఫీస్ వర్క్ లేదా ఆన్‌లైన్‌లో చదువుకునే వారికి హై డేటాతో కూడిన ప్యాక్‌లు కూడా పొందవచ్చు. ఈ రీఛార్జ్ ప్లాన్‌లపై అన్‌లిమిటెడ్ కాలింగ్, SMS, అనేక OTT ప్లాట్‌ఫామ్‌లకు ఫ్రీ సబ్‌స్ర్కిప్షన్ కూడా అందిస్తాయి. ఇంతకీ ఏయే ప్లాన్‌లపై అధిక డేటా ఇతర బెనిఫిట్స్ పొందవచ్చు అనేది ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం..

ఈ Vi ప్లాన్లలో అధిక డేటా :
వోడాఫోన్ ఐడియా అధికారిక వెబ్‌సైట్‌లో వివిధ కేటగిరీలో వివిధ ప్రీపెయిడ్ ప్లాన్‌లను అందిస్తోంది. వోడాఫోన్ ఐడియా సూపర్ హీరో ప్రీపెయిడ్ ప్లాన్ విభాగంలో అదనపు మొబైల్ డేటా అందించే కొన్ని ప్లాన్‌లు ఉన్నాయి. ఈ ప్లాన్లలో లాంగ్ వ్యాలిడిటీతో పాటు వివిధ బెనిఫిట్స్ కూడా పొందవచ్చు. వోడాఫోన్ ఐడియా ఈ ప్లాన్ ధర రూ. 3699కు అందిస్తోంది. అన్‌లిమిటెడ్ కాలింగ్ కూడా ఉంది.

ప్రతిరోజూ 2GB డేటా, 100 ఫ్రీ SMS బెనిఫిట్స్ పొందవచ్చు. ప్రముఖ OTT ప్లాట్‌ఫామ్ JioHotstar సబ్‌స్క్రిప్షన్ కూడా ఈ ప్లాన్‌లో పొందవచ్చు. ఆసక్తిగల వినియోగదారులు అర్ధరాత్రి 12 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు అన్‌లిమిటెడ్ డేటాను పొందవచ్చు. ఈ ప్యాక్ వారాంతపు డేటా రోల్‌ఓవర్‌తో వస్తుంది. వినియోగదారులకు కంపెనీ 50GB అదనపు డేటాను కూడా అందిస్తోంది. ఈ ప్లాన్ వ్యాలిడిటీ 365 రోజులు ఉంటుంది.

Read Also : BSNL All Rounder Plan : పండగ చేస్కోండి.. BSNL కొత్త ఆల్ రౌండర్ ప్లాన్ అదుర్స్.. 84 రోజుల వ్యాలిడిటీ, 252GB హైస్పీడ్ డేటా..!

అదనపు డేటాతో OTT సబ్‌స్క్రిప్షన్ :
ఈ ప్లాన్‌లో అన్‌లిమిటెడ్ కాలింగ్, రోజూ 100 ఫ్రీ SMS బెనిఫిట్స్ పొందవచ్చు. ప్రతిరోజూ 2GB డేటాను పొందవచ్చు. రాత్రి 12 గంటల నుంచి అర్ధరాత్రి 12 గంటల వరకు అన్‌లిమిటెడ్ డేటాను పొందవచ్చు. ఈ ప్యాక్ వారాంతపు డేటాతో వస్తుంది. అమెజాన్ ప్రైమ్ లైట్, వీడియో సబ్‌స్ర్కిప్షన్ ఏడాది పాటు అందిస్తోంది. ఈ ప్లాన్‌లో 50GB డేటా అదనంగా పొందవచ్చు. ఈ ప్లాన్ ధర రూ. 3799 ఉండగా, వ్యాలిడిటీ 365 రోజులు ఉంటుంది.

కంపెనీ ఆఫర్ కింద 130GB డేటా పొందవచ్చు. ఈ ఆఫర్ రూ. 299 లేదా అంతకంటే ఎక్కువ ప్లాన్‌లకు వర్తిస్తుంది. “Vi గ్యారెంటీ” ప్రోగ్రామ్ కింద ఆఫర్ అందుబాటులో ఉంది. ఈ ఆఫర్ కొత్త 4G కస్టమర్లు, 5G కస్టమర్లందరికి వర్తిస్తుంది. ఆసక్తిగల వినియోగదారులు ప్రతి 28 రోజులకు 10GB డేటాను పొందవచ్చు. Vi యాప్ నుంచి ఈ రీఛార్జ్ ప్లాన్ పొందవచ్చు. ఈ ఆఫర్ ఎంపిక చేసిన కస్టమర్లకు మాత్రమే అందుబాటులో ఉంటుంది.