Amazon Sale : స్టూడెంట్స్ కోసం అమెజాన్ స్పెషల్ సేల్.. ల్యాప్‌టాప్స్, హెడ్‌ఫోన్స్, స్మార్ట్‌వాచ్‌‌లపై మైండ్ బ్లోయింగ్ డిస్కౌంట్లు.. డోంట్ మిస్!

Amazon Back to School Sale : అమెజాన్ బ్యాక్ టు స్కూల్ సేల్ మొదలైంది.. ఈ సేల్ సమయంలో విద్యార్థులు తమకు అవసరమైన ల్యాప్‌టాప్స్, హెడ్ ఫోన్లు, స్మార్ట్‌వాచ్‌లపై 80శాతం వరకు డిస్కౌంట్లను ఆఫర్ చేస్తోంది.

Amazon Back to School Sale

Amazon Back to School Sale : మీరు ఇంట్లో లేదా క్యాంపస్‌లో చదువుకునేందుకు సిద్ధమవుతున్నారా? ప్రత్యేకించి విద్యార్థుల కోసం ఈ-కామర్స్ దిగ్గజం అమెజాన్ బ్యాక్ టు స్కూల్ సేల్ ప్రారంభించింది. విద్యార్థుల కోసం అమెజాన్ అద్భుతమైన డీల్స్ అందిస్తోంది.

Read Also : Realme 14T Launch : రియల్‌మి యూజర్లకు గుడ్ న్యూస్.. కొత్త రియల్‌మి 14T వచ్చేస్తోంది.. ఈ నెల 25నే లాంచ్.. ఫీచర్లు, ధర లీక్..!

ప్రత్యేకించి విద్యాపరమైన స్మార్ట్ డివైజ్‌లపై ఆకర్షణీయమైన డిస్కౌంట్లను అందిస్తోంది. ప్రస్తుతం అమెజాన్ ‘బ్యాక్ టు స్కూల్’ సేల్‌ తీసుకొచ్చింది. విద్యార్థులు, తల్లిదండ్రులు, ఉపాధ్యాయుల కోసం 80 శాతం వరకు డిస్కౌంట్లను ఆఫర్ చేస్తోంది.

ఈ సేల్‌లో ల్యాప్‌టాప్‌లు, టాబ్లెట్‌లు, ప్రింటర్లు, హెడ్‌ఫోన్‌లు, స్మార్ట్‌వాచ్‌లు వంటి టాప్ రేంజ్ డీల్స్ ఉన్నాయి. ఈ సేల్ లిమిటెడ్ టైమ్ మాత్రమే అందుబాటులో ఉంటుంది. మీరు స్కూల్, కాలేజీ లేదా మీ హోమ్ ఆఫీస్ కోసం షాపింగ్ చేస్తున్నా.. ఈ డీల్స్ అద్భుతంగా ఉంటాయి. ఇప్పుడే షాపింగ్ చేయండి. ఈ స్పెషల్ సేల్ ముగిసేలోపు తక్కువ ధరలో మీకు నచ్చిన డివైజ్ కొనేసుకోండి. టాప్ అమెజాన్ బ్యాక్-టు-స్కూల్ డీల్స్ ఓసారి లుక్కేయండి.

ల్యాప్‌టాప్‌లపై 40 శాతం వరకు తగ్గింపు
బడ్జెట్-ఫ్రెండ్లీ ల్యాప్‌టాప్‌ల నుండి స్కూల్ ప్రాజెక్ట్‌లు మరియు ఆన్‌లైన్ తరగతుల కోసం అధిక-పనితీరు గల యంత్రాల వరకు, అమెజాన్ అగ్ర ల్యాప్‌టాప్ బ్రాండ్‌లపై 40 శాతం వరకు తగ్గింపును అందిస్తోంది. విద్యార్థుల కోసం రూపొందించిన విస్తృత శ్రేణి మోడళ్ల నుండి ఎంచుకోండి మరియు ఈరోజే మీ పరిపూర్ణ అభ్యాస సహచరుడిని పొందండి.

టాబ్లెట్లపై 40 శాతం వరకు డిస్కౌంట్ :
ట్రావెలింగ్ సమయంలో చదువుకుంటున్నారా? అమెజాన్ సేల్‌లో Samsung, Lenovo వంటి ప్రముఖ బ్రాండ్‌ల టాబ్లెట్‌లపై 40 శాతం వరకు తగ్గింపు అందిస్తోంది. లైట్ వెయిట్ ఉండటమే కాదు.. ఎక్కువ బ్యాటరీ లైఫ్ డివైజ్‌లు నోట్-టేకింగ్, రీడింగ్, ఆన్‌లైన్ క్లాసులకు సరైనవిగా ఎంచుకోవచ్చు.

ప్రింటర్లపై 35 శాతం వరకు డిస్కౌంట్ :
ఈ సేల్ సమయంలో ప్రింటర్లపై 35 శాతం వరకు తగ్గింపు పొందవచ్చు. సమయంతో పాటు డబ్బు కూడా ఆదా చేయొచ్చు. కాంపాక్ట్ ఇంక్‌జెట్‌ల నుంచి ఆల్-ఇన్-వన్ మల్టీఫంక్షన్ ప్రింటర్ల వరకు అమెజాన్ డీల్స్ ప్రింటింగ్ అసైన్‌మెంట్‌లు, ప్రాజెక్ట్‌లను గతంలో కన్నా తక్కువ ధరకే ఆఫర్ చేస్తోంది.

హెడ్‌ఫోన్‌లపై 60 శాతం వరకు తగ్గింపు :
ఆన్‌లైన్ క్లాసుల సమయంలో టాప్-రేటెడ్ హెడ్‌ఫోన్‌లపై 60 శాతం వరకు తగ్గింపు పొందవచ్చు. మీరు నాయిస్-క్యాన్సిలింగ్, వైర్‌లెస్ లేదా వైర్డు మోడళ్లను ఇష్టపడినా, అమెజాన్ ప్రతి బడ్జెట్ ఆప్షన్లను అందిస్తోంది.

మానిటర్లపై 50 శాతం వరకు డిస్కౌంట్ :
Dell, LG వంటి కంపెనీల మానిటర్లపై 50 శాతం వరకు తగ్గింపు పొందవచ్చు. ఈ స్క్రీన్‌లు ఫుల్ HD డిస్‌ప్లేతో వస్తాయి. ఎక్కువ సమయం స్ర్కీనింగ్ వల్ల కంటికి ఎలాంటి ఇబ్బంది ఉండదు.

స్మార్ట్‌వాచ్‌లపై 80 శాతం వరకు తగ్గింపు :
స్మార్ట్‌వాచ్‌లపై 80 శాతం వరకు తగ్గింపు పొందవచ్చు. స్టైలిష్, ఫంక్షనల్ వేరబుల్స్‌తో ఫిట్‌నెస్‌ను ట్రాక్ చేయొచ్చు. కాల్ అలర్ట్‌ వంటి మరెన్నో ఫీచర్లు కలిగిన స్మార్ట్ వాచ్‌లను అతి తక్కువ ధరకే సొంతం చేసుకోండి.

Read Also : iPhone 16 Pro Max : సూపర్ డిస్కౌంట్ భయ్యా.. ఆపిల్ ఐఫోన్ 16ప్రో మ్యాక్స్‌ భారీగా తగ్గిందోచ్.. ఈ ఆఫర్ అసలు మిస్ చేయొద్దు!

పీసీ యాక్సెసరీస్‌పై 80 శాతం వరకు తగ్గింపు :
కీబోర్డులు, స్టైలస్ పెన్, మౌస్ వంటి ముఖ్యమైన పీసీ అప్లియన్సెస్ 80 శాతం వరకు తగ్గింపుతో పొందవచ్చు. ఈ బడ్జెట్-ఫ్రెండ్లీ యాడ్-ఆన్స్ ఏదో ఒకటి ఇప్పుడే కొనేసి ఇంటికి తెచ్చుకోండి.