OnePlus Phones Deals : పండగ చేస్కోండి.. ఈ వన్‌ప్లస్ ఫోన్లపై బెస్ట్ డీల్స్ మీకోసం.. అమెజాన్‌లో ఇలా కొన్నారంటే చౌకైన ధరకే..!

OnePlus Phones Deals : వన్‌ప్లస్ ఫోన్ కొనేవారికి గుడ్ న్యూస్.. అమెజాన్ సేల్‌లో అనేక వన్‌ప్లస్ మోడళ్లపై కిర్రాక్ డిస్కౌంట్లను అందిస్తోంది. ఈ బెస్ట్ డీల్స్ ఎలా పొందాలంటే?

OnePlus Phones Deals : పండగ చేస్కోండి.. ఈ వన్‌ప్లస్ ఫోన్లపై బెస్ట్ డీల్స్ మీకోసం.. అమెజాన్‌లో ఇలా కొన్నారంటే చౌకైన ధరకే..!

OnePlus Phones Deals

Updated On : September 25, 2025 / 6:16 PM IST

OnePlus Phones Deals : కొత్త వన్‌ప్లస్ ఫోన్ కొంటున్నారా? ప్రస్తుతం అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్ 2025 సందర్భంగా అనేక స్మార్ట్ ఫోన్లపై అద్భుతమైన డిస్కౌంట్లను అందిస్తోంది. ఈ సేల్ సమయంలో (OnePlus Phones Deals) స్మార్ట్‌ఫోన్‌లపై క్రేజీ డీల్స్ ఆఫర్ చేస్తోంది. మీ వన్‌ప్లస్ ఫోన్ అప్‌గ్రేడ్ చేయాలని ప్లాన్ చేస్తుంటే.. ఇదే బెస్ట్ టైమ్.. తక్కువ ధరలో బ్రాండ్-న్యూ ఫోన్‌ కొనేసుకోవచ్చు. అమెజాన్ సేల్ సందర్భంగా టాప్ వన్‌ప్లస్ స్మార్ట్‌ఫోన్ డీల్స్ ఓసారి పరిశీలిద్దాం..

వన్‌ప్లస్ 13s :
వన్‌ప్లస్ 13s ఫోన్ 120Hz డైనమిక్ రిఫ్రెష్ రేట్‌తో 6.32-అంగుళాల LTPO అమోల్డ్ డిస్‌ప్లే, 1,600 నిట్‌ల గరిష్ట బ్రైట్‌నెస్‌ను కలిగి ఉంది. హుడ్ కింద, ఈ కాంపాక్ట్ ఫోన్ స్నాప్‌డ్రాగన్ 8 ఎలైట్ చిప్‌సెట్ ద్వారా పవర్ పొందుతుంది. 80W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్‌తో 5,850mAh బ్యాటరీని అందిస్తుంది. ఫోటోగ్రఫీ విషయానికి వస్తే.. వన్‌ప్లస్ 13sలో 50MP మెయిన్ కెమెరా, 50MP (2X ఆప్టికల్ జూమ్) టెలిఫోటో లెన్స్ ఉన్నాయి. ఫ్రంట్ సైడ్ 32MP కెమెరా కలిగి ఉంది. అమెజాన్‌లో వన్‌ప్లస్ 13s రూ. 50,999 తగ్గింపు ధరకు పొందవచ్చు.

వన్‌ప్లస్ నార్డ్ 4 :

వన్‌ప్లస్ నార్డ్ 4 ఫోన్ క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 7+ జెన్ 3 ప్రాసెసర్‌తో వస్తుంది. 100W సూపర్‌వూక్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్‌తో 5,500mAh బ్యాటరీతో వస్తుంది. ఈ వన్‌ప్లస్ ఫోన్ 1.5K రిజల్యూషన్, 120Hz రిఫ్రెష్ రేట్‌తో 6.74-అంగుళాల అమోల్డ్ ProXDR డిస్‌ప్లే కలిగి ఉంది. ఇంకా, వన్‌ప్లస్ ఫోన్‌లో 50MP మెయిన్ కెమెరా, 8MP అల్ట్రావైడ్ షూటర్ ఉన్నాయి. సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం 16MP ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా ఉంది. అమెజాన్‌లో వన్‌ప్లస్ నార్డ్ 4 రూ.26,999 తగ్గింపు ధరకు లభిస్తుంది.

Read Also : Vivo V50 5G Price : కొత్త వివో V50 5G ధర తగ్గిందోచ్.. అమెజాన్‌లో అతి చౌకైన ధరకే.. ఇప్పుడే ఆర్డర్ పెట్టేసుకోండి!

వన్‌ప్లస్ 13 :
వన్‌ప్లస్ 13లో 120Hz రిఫ్రెష్ రేట్‌తో 6.82-అంగుళాల డిస్‌ప్లే, 4,500 నిట్స్ గరిష్ట బ్రైట్‌నెస్ ఉన్నాయి. హుడ్ కింద, ఈ వన్‌ప్లస్ ఫోన్ స్నాప్‌డ్రాగన్ 8 ఎలైట్ చిప్‌సెట్ ద్వారా పవర్ పొందుతుంది. 100W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్, 50W వైర్‌లెస్ ఛార్జింగ్ సపోర్ట్‌తో 6,000mAh బ్యాటరీతో సపోర్టు ఇస్తుంది. కెమెరా విషయానికొస్తే.. వన్‌ప్లస్ 13లో 50MP ప్రైమరీ కెమెరా, 3x ఆప్టికల్ జూమ్‌తో కూడిన 50MP టెలిఫోటో సెన్సార్, 120x డిజిటల్ జూమ్ ఉన్నాయి. అలాగే, 50MP అల్ట్రా-వైడ్ లెన్స్ కూడా ఉంది. సెల్ఫీల విషయానికి వస్తే.. ఈ హ్యాండ్‌సెట్ 32MP ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా కలిగి ఉంది. అమెజాన్‌లో వన్‌ప్లస్ 13 రూ. 61,999 తగ్గింపు ధరకు లభిస్తుంది.

వన్‌ప్లస్ 13R 5G :
వన్‌ప్లస్ 13R 5G ఫోన్ 120Hz రిఫ్రెష్ రేట్, 4,500 నిట్స్ పీక్ బ్రైట్‌నెస్, కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 7i ప్రొటెక్షన్‌తో 6.78-అంగుళాల డిస్‌ప్లే కలిగి ఉంది. ఈ వన్‌ప్లస్ ఫోన్ స్నాప్‌డ్రాగన్ 8 జెన్ 3తో వస్తుంది. 80W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్‌తో 6,000mAh బ్యాటరీ కలిగి ఉంది. ఆప్టిక్స్ విషయానికి వస్తే.. ఈ స్మార్ట్‌ఫోన్‌లో 50MP ప్రైమరీ కెమెరా, 8MP అల్ట్రా-వైడ్ లెన్స్, 50MP టెలిఫోటో లెన్స్ ఉన్నాయి. సెల్ఫీల కోసం ఈ వన్‌ప్లస్ ఫోన్ 16MP ఫ్రంట్ కెమెరా కలిగి ఉంది. అమెజాన్‌లో వన్‌ప్లస్ 13R రూ.37,999 తగ్గింపు ధరకు లభిస్తుంది.