ప్రముఖ ఈ-కామర్స్ దిగ్గజం అమెజాన్ తమ మ్యూజిక్ స్ట్రీమింగ్ సర్వీసు కోసం ఓ వెర్షన్ ప్రవేశపెట్టింది. గత సెప్టెంబర్ లోనే ఎకో డివైజ్ లపై అలెక్సా యూజర్లు వాడే మ్యూజిక్ స్ట్రీమింగ్ సర్వీసు కోసం యాడ్ సపోర్టెడ్ ఫ్రీ వెర్షన్ తీసుకొచ్చినట్టు అమెజాన్.కామ్ ఇంక్ ఒక ప్రకటనలో తెలిపింది. స్పాటీఫై టెక్నాలజీకి పోటీగా అమెజాన్ ఈ మ్యూజిక్ వెర్షన్ అందుబాటులోకి తెచ్చింది. ఇప్పటికే స్పాటిఫై టెక్నాలజీ ఫ్రీ వెర్షన్ వాడేవారిలో దాదాపు 140 మిలియన్ల మంది యూజర్లు ఉన్నారు.
అమెజాన్ అందించే మ్యూజిక్ స్ట్రీమింగ్ సర్వీసును ప్రైమ్ బండెల్ లో భాగంగా నెలవారీ సబ్ స్ర్కిప్షన్ ప్రారంభ ధర 9.99 డాలర్లతో ఆఫర్ చేస్తోంది. ఎకో డివైజ్ వాడే అలెక్సా మ్యూజిక్ సర్వీసు యూజర్ల కోసం ఈ ఫ్రీ వెర్షన్ తీసుకొచ్చినట్టు కంపెనీ తెలిపింది. Spotify మ్యూజిక్ టెక్నాలజీ.. ప్రపంచంలోనే అత్యంత పాపులర్ మ్యూజిక్ స్ట్రీమింగ్ సర్వీసు. ఈ కంపెనీ Freemium మోడల్ ఆఫర్ చేస్తోంది. ఇందులో ఫ్రీ యాడ్-సపోర్టెడ్ వెర్షన్ కూడా ఉంది.
పెయిడ్ యాడ్-ఫ్రీ వెర్షన్ నెలవారీ సబ్ స్ర్కిప్షన్ కింద 9.99 డాలర్లు ఛార్జ్ చేస్తోంది. మరోవైపు ఆపిల్ ఇంక్ కూడా ఆపిల్ మ్యూజిక్ ఆఫర్ చేస్తోంది. తమ యూజర్ల కోసం ప్రత్యేకించి పెయిడ్ సబ్ స్ర్కిప్షన్ సర్వీసును నెలకు 9.99 డాలర్లతో ఆఫర్ చేస్తోంది. మ్యూజిక్ స్ట్రీమింగ్ మార్కెట్లలో కనీసం ఐదో పెయిడ్ మ్యూజిక్ సర్వీసు అకౌంట్లు ఆపిల్ కంపెనీవే ఉన్నట్టు కౌంటర్ పాయింట్ రీసెర్చ్ తెలిపింది. ఇక అమెజాన్ షేర్లు కనీసం 0.5శాతం పెరగగా, పోటీదారు కంపెనీ స్పాటీఫీ షేర్లు 5 శాతం మేర క్షీణించాయి.