Moto Edge 50 Pro
Amazon Sale : కొత్త మోటోరోలా ఫోన్ కావాలా? అమెజాన్‌లో ట్రిపుల్ కెమెరా ఫోన్ అద్భుతమైన డిస్కౌంట్ అందిస్తోంది. ఇటీవలే, మోటోరోలా ఎడ్జ్ 60 స్టైలస్ ఫోన్ టెక్ మార్కెట్లో లాంచ్ చేసింది. ఇప్పుడు కంపెనీ మోటోరోలా ఎడ్జ్ 50ప్రో ధరను భారీగా తగ్గించింది.
ఈ మోటోరోలా మోటో ఎడ్జ్ 50ప్రోను తగ్గింపు ధరకే పొందవచ్చు. మీరు ఈ ఫోన్ కొనాలని ప్లాన్ చేస్తుంటే.. ఇదే సరైనా ఛాన్స్. ఈ ఫోన్‌ను అమెజాన్ నుంచి సరసమైన ధరకు కొనుగోలు చేయవచ్చు. ధర, ఆఫర్లు, ఫీచర్లకు సంబంధించి పూర్తి వివరాలను ఓసారి లుక్కేయండి.
మోటోరోలా ఎడ్జ్ 50 ప్రో 5Gపై డిస్కౌంట్ :
ధర విషయానికి వస్తే.. 12GB RAM/256GB ఇంటర్నల్ స్టోరేజ్ వేరియంట్ ధర రూ. 41,999కు పొందవచ్చు. అమెజాన్ నుంచి 17శాతం తగ్గింపుతో కొనుగోలు చేయవచ్చు. ఈ తగ్గింపు తర్వాత రూ. 34999కు కొనుగోలు చేయవచ్చు. మీరు దాదాపు రూ. 7వేలు ఆదా చేయవచ్చు.
ఆఫర్ల విషయానికి వస్తే.. బ్యాంక్ ఆఫర్ కింద HDFC బ్యాంక్ కార్డ్‌పై రూ. 2500 డిస్కౌంట్ పొందవచ్చు. మీకు యెస్ బ్యాంక్ కార్డుపై రూ.2,250 డిస్కౌంట్ పొందవచ్చు. రూ.27,350 ఎక్స్ఛేంజ్ ఆఫర్ మాత్రమే కాదు.. రూ.1697 EMI ఆప్షన్ కూడా పొందవచ్చు. కండిషన్స్ అప్లయ్ అని గుర్తుంచుకోవాలి.
మోటోరోలా ఎడ్జ్ 50 ప్రో 5G స్పెషిఫికేషన్లు :
మోటో నుంచి వచ్చిన ఈ 5G స్మార్ట్‌ఫోన్ 6.7-అంగుళాల pOLED 3D కర్వ్డ్ డిస్‌ప్లేతో వస్తుంది. 144 Hz రిఫ్రెష్ రేట్ సపోర్ట్‌తో వస్తుంది. పీక్ బ్రైట్‌నెస్ 2000 నిట్‌లతో వస్తుంది. ఈ ఫోన్ క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 7 జెన్ 3 ప్రాసెసర్‌తో వస్తుంది. కార్నింగ్ గొరిల్లా గ్లాస్ డిస్‌ప్లే ప్రొటెక్షన్‌తో వస్తుంది. ఈ మోటోరోలా ఫోన్ IP68 అండర్ వాటర్ ప్రొటెక్షన్‌తో వస్తుంది.
కెమెరా, బ్యాటరీ :
కెమెరా క్వాలిటీ విషయానికి వస్తే.. ఈ మోటోరోలా ఫోన్ ట్రిపుల్ కెమెరా సెటప్‌ను కలిగి ఉంది. 50MP ప్రైమరీ కెమెరాతో వస్తుంది. సెకండ్ కెమెరా 10MP, థర్డ్ కెమెరా 13MP కలిగి ఉంది. సెల్ఫీ ఫోటోల కోసం ఫ్రంట్ సైడ్ 50MP ఏఐ కెమెరాను అందిస్తోంది. పవర్ కోసం ఈ మోటో ఫోన్ 4,500mAh పవర్‌ఫుల్ బ్యాటరీని కలిగి ఉంది. 50W వైర్‌లెస్ ఛార్జింగ్ సపోర్ట్‌తో వస్తుంది.