Anant Ambani Radhika Merchant wedding food menu full details
Anant Ambani Radhika Merchant wedding: ఎప్పటి నుంచో చిన్న ఆశ. చిన్నకొడుకు పెండ్లి ఓ రేంజ్‌లో చేయాలని.. ఆ కల నిజం కాబోతుంది. అందుకు తగ్గట్లుగా ఆర్థిక వనరులకు ఏం లోటు. పిలిస్తే రాలేమని చెప్పేవారు కూడా ఎవరుండరు. వచ్చే అతిథులకు మర్యాదలేం తక్కువ ఉండవు. షార్ట్ కట్‌లో అపర కుబేరుడు ముకేశ్ అంబానీ ఇంట పెండ్లి వేడుకల ట్రైలర్ ఇది. సినిమా మాత్రం ముందుంది. ఇంటా, బయటా ఆనందాలకు అవధులు లేకుండా.. దేశమే కాదు.. యావత్ దునియా మొత్తం మాట్లాడుకునేలా అనంత్ అంబానీ పెళ్లి జరిపించబోతున్నారు ముకేశ్ అంబానీ.
స్వాగతానికి ఫిదా కావాల్సిందే..
ముకేశ్ అంబానీ, నీతా అంబానీ మూడో సంతానం అనంత్ అంబానీ. ఇప్పటికే ఓ కొడుకు, కూతురు మ్యారేజ్ చేసిన ఈ ధనవంతుల కుటుంబం.. ఇప్పుడు అనంత్ వివాహం గ్రాండ్‌గా చేయబోతుంది. పెద్దకొడుకు కూతురు మ్యారేజీ వాళ్లకో బాధ్యత. అనంత్ అంబానీ వివాహం మాత్రం ముకేశ్, నీతాకు ఏదో తెలియని ఎమోషనల్ ఫీల్ అన్నట్లుగా ఉంది.. చిన్న కుమారుడనే అమితమైన ప్రేమ.. అస్తమా లాంటి తీవ్ర అనారోగ్య సమస్యలను దాటి వచ్చాడన్న తెలియని భావోద్వేగం.. వాళ్ల కళ్లలో కనిపిస్తూ ఉంటుంది. అనంత్ అంబానీ పేరు తీస్తేనే చాలు నీతా అంబానీ ఎమోషనల్ అయిపోతారు. పేదోడి ఇంట్లో చిన్నకొడుకు పెండ్లి అంటేనే ఉన్నంతలో ఎంతబాగ చేయాలో అంతకంటే పెద్దస్థాయిలోనే చేస్తారు. అలాంటిది నీతా, ముకేశ్ అంబానీ గారాల కొడుకు అనంత్ అంబానీ పెళ్లి మామూలు విషయమా. అంతా బాండింగ్ ఉన్న చిన్నకుమారుడి మ్యారేజ్ మామూలుగా చేయొద్దని ఫిక్స్ అయిపోయింది ముకేశ్ ఫ్యామిలీ. ఖర్చు విషయంలో వెనకాడేదే లేదు. తరలివచ్చే అతిథులకు ఆతిధ్యానికి లోటు లేదు. స్వాగతానికి ఫిదా కావాల్సిందే.
పాపులర్ సింగర్స్‌తో జిల్ జిగేల్..
పెళ్లి పత్రిక నుంచి వివాహ వేదిక వరకు, ధరించే దుస్తులు నుంచి అతిథులకు వడ్డించే భోజనాల వరకు అన్నీ స్పెషలే. ఎంగేజ్‌మెంట్, ప్రీ వెడ్డింగ్‌నే ఓ రేంజ్‌లో చేసిన ముకేశ్ అంబానీ.. అనంత్ అంబానీ పెండ్లి వేడుకను కనీవినీ ఎరుగని రీతిలో చేసేందుకు రెడీ అయ్యారు. మూడ్రోజుల పెండ్లి వేడుక అంటే మామూలు విషయం కాదు. అనంత్ అంబానీ వివాహం, రాధిక మర్చెంట్ వివాహం జులై 12న జరగనుంది. ముంబైలోని బాంద్రా కుర్లా కాంప్లెక్స్లోని జియో వరల్డ్ కన్వెన్షన్ సెంటర్లో పెళ్లి అట్టహాసంగా నిర్వహించనున్నారు. స్వర్గమే భూలోకానికి దిగొచ్చిందన్న ఫీలింగ్ కలిగేలా.. తారాలోకం తరలిరానుంది. అతిరథ మహారథులు ఆశీర్విదించనున్నారు.. పెద్దపెద్ద సింగర్లు తమ గాత్రంతో అలరించబోతున్నారు.
త్రీ డేస్ వెడ్డింగ్.. 3 వేల రుచులు
త్రీ డేస్ వెడ్డింగ్‌కు ఇప్పటికే ప్రిపరేషన్స్ పూర్తయ్యాయి. జులై 12న శుభ్ వివాహ్‌తో వేడుకలు స్టార్ట్ అవుతాయి. జులై 13న శుభ్ ఆశీర్వాద్, జులై 14న మంగళ్ ఉత్సవ్‌తో ఈ వివాహ తంతు ముగియనుంది. ప్రీ-వెడ్డింగ్ వేడుకలతోనే పిచ్చెక్కించారు. ఇక పెండ్లి అంటే మినిమమ్ ఉంటుంది. ప్రీ వెడ్డింగ్‌లో 2 వేల 5వందల రకాల రుచులతో భోజనాలు పెట్టారు. ఇక అతిపెద్ద వేడుకైన పెళ్లిలో ఎన్ని వేల రుచులు ఉంటాయో ఊహించుకోవచ్చు. అనంత్ అంబానీ పెళ్లిలో దాదాపు 3 వేల రుచులు అతిథులకు వడ్డించేందుకు రెడీ అవుతున్నారు.
భోజనాల కోసమే 230 కౌంటర్లు
దేశవిదేశీ ప్రముఖులు వస్తుండటంతో భారతీయ రుచులతో పాటు, కాంటినెంటల్ వంటకాలన్నింటినీ మెనూలో చేర్చారు. ఇప్పటికే వివిధ దేశాల నుంచి చెఫ్లు ముంబై చేరుకున్నారు. బాంద్రా కుర్లా కాంప్లెక్స్లోని జియో వరల్డ్ కన్వెన్షన్ సెంటర్లో ప్రిపరేషన్స్ జరుగుతున్నాయి. ప్రపంచం నలుమూలల్లో దొరికే దాదాపు అన్ని రకాల ప్రధాన వంటకాల్ని అనంత్ అంబానీ పెళ్లిలో వడ్డించబోతున్నారు. వరల్డ్ క్లాస్ ఫుడ్ ఫెస్టివల్ లాగా అన్నిరకాల వంటకాలు పెట్టనున్నారు. కేవలం భోజనాల కోసమే 230 కౌంటర్లు ఏర్పాట్లు చేస్తున్నారట.
Also Read : పెళ్లికి అతిథులను తీసుకురావడానికి 3 ఫాల్కన్-2000 జెట్లను రెంటుకి తీసుకున్న అంబానీ ఫ్యామిలీ
రీసెంట్గా నీతా అంబానీ పెళ్లి పత్రిక తీసుకొని కాశీ విశ్వేశ్వరుడి దర్శనానికి వెళ్లివచ్చారు. అక్కడ కాశీ ఛాట్ భండార్లో రుచులు ఆస్వాదించారు. అవి నచ్చడంతో, ప్రత్యేకంగా ఆ కౌంటర్ను కూడా అనంత్ పెళ్లి భోజనాల మెనూలో చేర్చారు. టిక్కీ ఛాట్, టమాట ఛాట్, పాలక్ ఛాట్, కుల్ఫీ ఇక్కడ ప్రత్యేకతలు.
Also Read : అంబానీ ఇంట పెళ్లికి మెగాపవర్ స్టార్ రామ్ చరణ్.. టాలీవుడ్ నుంచి ఒక్కడేనా..?
బాలీవుడ్ తారలు తరలివచ్చిన వేళ..
ఇప్పటికే నిర్వహించిన హల్దీ ఫంక్షన్ అదిరిపోయింది. బాలీవుడ్ తారలు తరలివచ్చిన వేళ.. అనంత్ అంబానీ, రాధిక మర్చంట్.. పసుపు నీళ్లలో తడిసిముద్దయ్యారు. సల్మాన్ ఖాన్, జాన్వీ కపూర్, సారా అలీ ఖాన్, అనన్య పాండే, బోనీ కపూర్, ఉదిత్ నారాయణ్‌తో పాటు పలువురు నటీనటులు మెరిసిపోయారు. సాంప్రదాయ, వెస్ట్రన్ కళాకారుల సంగీతం, బాలీవుడ్ నటుల స్టెప్పులతో అదిరిపోయింది అనంత్, రాధిక హల్దీ ఈవెంట్.