పెళ్లికి అతిథులను తీసుకురావడానికి 3 ఫాల్కన్-2000 జెట్లను రెంటుకి తీసుకున్న అంబానీ ఫ్యామిలీ

పెళ్లికి సంబంధించిన ఈవెంట్ల కోసం 100కు పైగా ప్రైవేట్ విమానాలను..

పెళ్లికి అతిథులను తీసుకురావడానికి 3 ఫాల్కన్-2000 జెట్లను రెంటుకి తీసుకున్న అంబానీ ఫ్యామిలీ

రిలయన్స్ ఇండస్ట్రీస్ ఛైర్మన్ ముకేశ్ అంబానీ ఇంట పెళ్లి వేడుక అంగరంగ వైభవంగా జరుగుతోంది. ముకేశ్ అంబానీ చిన్న కుమారుడు అనంత్ అంబానీ శుక్రవారం ముంబైలో రాధికా మర్చంట్ మెడలో మూడు ముళ్లు వేయనున్నారు. వివాహానికి అతిరథ మహారథులు విచ్చేయనున్నారు.

పెళ్లికి వచ్చే కొందరు ప్రత్యేక అతిథుల కోసం అంబానీ ఫ్యామిలీ మూడు ఫాల్కన్-2000 జెట్లను రెంటుకి తీసుకున్నట్లు తెలుస్తోంది. అతిథుల కోసం అంబానీ కుటుంబం మూడు ఫాల్కన్-2000 జెట్లను రెంటుకి తీసుకున్నారని, అలాగే, పెళ్లికి సంబంధించిన ఈవెంట్ల కోసం 100కు పైగా ప్రైవేట్ విమానాలను వాడాలని అనుకుంటున్నారని ఎయిర్ చార్టర్ కంపెనీ క్లబ్ వన్ ఎయిర్ సీఈవో రాజన్ మెహ్రా చెప్పారు.

ప్రపంచంలోని నలుమూలల నుంచి అతిథులు వస్తున్నారని అన్నారు. ఆయా విమానాలు దేశంలోని అనేక ప్రాంతాల మీదుగా ప్రయాణిస్తాయని తెలిపారు. ముంబైలోని బాంద్రా కుర్లా కాంప్లెక్స్‌లోని జియో వరల్డ్‌ కన్వెన్షన్‌ సెంటర్‌లో పెళ్లి జరగనున్న నేపథ్యంలో ఆయా ప్రాంతాల్లో ట్రాఫిక్ సమస్యలు తలెత్తకుండా పోలీసులు జాగ్రత్తలు తీసుకుంటున్నారు.

ముంబై ట్రాఫిక్ పోలీసులు మూడు రోజుల పాటు ఆ ప్రాంతంలో ట్రాఫిక్ ఆంక్షలు ఉంటాయని తెలిపారు. అనంత్ అంబానీ, రాధికా మర్చంట్ నిశ్చితార్థం నుంచి ప్రీ వెడ్డింగ్‌ వేడుకల వరకు ఎంతో ఘనంగా జరిగాయి. ఇప్పుడు పెళ్లి వేడుక అంతకంటే ఘనంగా జరగనుంది.

Also Read : టికెట్ రేట్ల విషయంలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఏం చెప్పారంటే.. సురేష్ బాబు తాజా వ్యాఖ్యలు..