MG Hector Blackstorm : కొత్త ఆల్-బ్లాక్ ఎంజీ హెక్టర్ బ్లాక్‌స్టార్మ్ ఎస్‌యూవీ కారు వచ్చేసిందోచ్.. ఏ వేరియంట్ ధర ఎంతంటే?

MG Hector Blackstorm : కొత్త ఎంజీ హెక్టర్ బ్లాక్‌స్టార్మ్ కారు మొత్తం ఐదు సీట్ల నుంచి ఆరు, ఏడు సీట్ల కాన్ఫిగరేషన్‌లలో అందిస్తోంది. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.

MG Hector Blackstorm : కొత్త ఆల్-బ్లాక్ ఎంజీ హెక్టర్ బ్లాక్‌స్టార్మ్ ఎస్‌యూవీ కారు వచ్చేసిందోచ్.. ఏ వేరియంట్ ధర ఎంతంటే?

Another all-black SUV enters the market, MG Hector Blackstorm

MG Hector Blackstorm : ప్రముఖ ఆటోమొబైల్ దిగ్గజం ఎంజీ ఇండియా నుంచి సరికొత్త హెక్టర్ బ్లాక్‌స్టార్మ్ ఎడిషన్‌ను రూ. 21.25 లక్షల ప్రారంభ ధర (ఎక్స్-షోరూమ్) వద్ద లాంచ్ చేసింది. ఎంజీ హెక్టర్ బ్లాక్‌స్టార్మ్ బ్లాక్-కలర్ ఎక్స్‌టీరియర్, ఇంటిరియర్ థీమ్‌ కలిగి ఉంది.

ఈ కొత్త కారు ఐదు సీట్ల నుంచి ఆరు, ఏడు సీట్ల కాన్ఫిగరేషన్‌లలో అందిస్తోంది. ఎంజీ హెక్టర్ బ్లాక్‌స్టార్మ్ డార్క్ క్రోమ్ బ్రాండ్ లోగోలు, డార్క్ క్రోమ్ ఆర్గైల్-ప్రేరేపిత డైమండ్ మెష్ ఫ్రంట్ గ్రిల్, స్కిడ్ ప్లేట్‌లపై డార్క్ క్రోమ్ ఇన్సర్ట్‌లు, డార్క్ క్రోమ్ టెయిల్‌గేట్ గార్నిష్, బాడీ సైడ్ క్లాడింగ్‌లో డార్క్ క్రోమ్ ఫినిషింగ్ వంటి డార్క్ క్రోమ్ ఎలిమెంట్‌లను కలిగి ఉంది.

Read Also : Meta AI Chatbot : ఇన్‌స్టాగ్రామ్, వాట్సాప్‌లోనూ మెటా ఏఐ చాట్‌బాట్‌.. పరిమిత యూజర్లకు మాత్రమే..!

రెడ్ కాలిపర్‌లతో కూడిన 18-అంగుళాల ఆల్-బ్లాక్ అల్లాయ్‌లు, పియానో ​​బ్లాక్ రూఫ్ రెయిల్‌లు, పియానో ​​బ్లాక్ బెజెల్‌తో కూడిన ఎల్ఈడీ హెడ్‌ల్యాంప్, స్మోక్డ్ కనెక్టింగ్ టెయిల్‌లైట్‌లతో సహా బ్లాక్ హైలైట్‌ల ద్వారా ఎస్‌యూవీ రూపాన్ని మరింత మెరుగుపరుస్తుంది.

మరెన్నో స్పెషిఫికేషన్లు, ఫీచర్లు :
అదనంగా, కస్టమర్లు ఎలాంటి అదనపు ఖర్చు లేకుండా డీలర్‌షిప్ వద్ద ‘బ్లాక్‌స్టార్మ్’ ఐకాన్ పొందవచ్చు. ఎంజీ హెక్టర్ బ్లాక్‌స్టార్మ్ గన్ మెటల్ యాక్సెంట్‌లతో బ్లాక్-థీమ్ ఇంటీరియర్‌ను కలిగి ఉంది. కన్సోల్, డాష్‌బోర్డ్‌లో గన్ మెటల్ గ్రే ఫినిషింగ్‌తో పాటు ఎస్‌యూవీ 14-అంగుళాల హెచ్‌డీ పోర్ట్రెయిట్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, డ్యూయల్-పేన్ పనోరమిక్ సన్‌రూఫ్‌తో వస్తుంది. ఫ్రంట్ హెడ్‌రెస్ట్‌లో ‘బ్లాక్‌స్టార్మ్’ డీబాసింగ్‌తో కూడిన ఆల్-బ్లాక్ లెదర్ అప్‌హోల్‌స్టరీ, గన్ మెటల్ ఫినిషింగ్‌తో లెదర్-ర్యాప్డ్ స్టీరింగ్ వీల్, ప్రీమియం అప్పీల్‌ను అందిస్తుంది.

100 వాయిస్ కమాండ్స్.. 75కిపైగా కనెక్టెడ్ ఫీచర్లు :
ఎంజీ హెక్టర్ బ్లాక్‌స్టార్మ్ ఎడిషన్‌లో ఎల్ఈడీ ప్రొజెక్టర్ హెడ్‌ల్యాంప్‌లు, ఫ్లోటింగ్ లైట్ టర్న్ ఇండికేటర్‌లు, ఎల్ఈడీ కనెక్ట్ చేసిన టెయిల్‌ల్యాంప్‌లు, పూర్తిగా డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్, వైర్‌లెస్ ఆపిల్ కార్ ప్లే, ఆండ్రాయిడ్ ఆటో, వైర్‌లెస్ ఫోన్ ఛార్జర్ ఉన్నాయి. ఈ కొత్త ఎడిషన్ సెగ్మెంట్-ఫస్ట్ డిజిటల్ బ్లూటూత్ కీ, కీ-షేరింగ్ సామర్థ్యాన్ని కూడా అందిస్తుంది. 100 వాయిస్ కమాండ్‌లతో సహా 75కి పైగా కనెక్ట్ చేసిన ఫీచర్‌లను కలిగి ఉంది.

ఎంజీ హెక్టర్ బ్లాక్‌స్టార్మ్‌లో రెండు ఇంజన్ ఆప్షన్లు ఉన్నాయి. 1.5-లీటర్ టర్బో-పెట్రోల్ (143పీఎస్ గరిష్ట శక్తి, 250ఎన్ఎమ్ గరిష్ట స్థాయి), 2.0-లీటర్ డీజిల్ (170పీఎస్ గరిష్ట శక్తి, 350ఎన్ఎమ్ గరిష్ట టార్క్) ఉంటుంది. పెట్రోల్ యూనిట్ సీవీటీతో డీజిల్ యూనిట్ 6-స్పీడ్ ఎంటీతో వస్తుంది. పెట్రోల్ ఇంజన్‌లో మ్యాన్యువల్ ట్రాన్స్‌మిషన్ ఆప్షన్ లేదు. వేరియంట్ వారీగా ఎంజీ హెక్టర్ బ్లాక్‌స్టార్మ్ ధరలు (ఎక్స్-షోరూమ్) ఈ కింది విధంగా ఉన్నాయి.

  • 5-సీటర్ పెట్రోల్ సీవీటీ షార్ప్ ప్రో – రూ. 21.25 లక్షలు
  • 5-సీటర్ డీజిల్ ఎంటీ షార్ప్ ప్రో – రూ. 21.95 లక్షలు
  • 7-సీటర్ పెట్రోల్ సీవీటీ షార్ప్ ప్రో – రూ. 21.98 లక్షలు
  • 7-సీటర్ డీజిల్ ఎంటీ షార్ప్ ప్రో – రూ. 22.55 లక్షలు
  • 6-సీటర్ డీజిల్ ఎంటీ షార్ప్ ప్రో – రూ. 22.76 లక్షలు

Read Also : Realme P1 5G Launch : రియల్‌మి P1 5జీ ఫోన్ వచ్చేస్తోంది.. ఈ నెల 15నే ఎర్లీ బర్డ్ సేల్.. ఏయే ఫీచర్లు ఉండొచ్చుంటే?