Apple Back to School : స్టూడెంట్స్ కోసం ‘ఆపిల్ బ్యాక్ టు స్కూల్’ ఆఫర్లు.. ఐప్యాడ్ ఎయిర్, మ్యాక్‌బుక్ ప్రో, ఐమ్యాక్‌పై బిగ్ డిస్కౌంట్లు..!

Apple Back to School : విద్యార్థుల కోసం ఆపిల్ బ్యాక్ టు స్కూల్ ఆఫర్ అందిస్తోంది. ఐప్యాడ్ ఎయిర్, మ్యాక్‌బుక్ ప్రో, ఐమ్యాక్‌పై అందిస్తోంది.

Apple Back to School

Apple Back to School : స్టూడెంట్స్ కోసం ఆపిల్ అద్భుతమైన ఆఫర్.. భారత మార్కెట్లో ఆన్‌లైన్ ఎడ్యుకేషన్ స్టోర్‌లో బ్యాక్ టు స్కూల్ ఆఫర్‌ ప్రకటించింది. ఈ సేల్ జూన్ 17న ప్రారంభమై సెప్టెంబర్ 30 వరకు కొనసాగుతుంది.

హైయర్ స్టడీస్ చదివే విద్యార్థుల నుంచి విద్యావేత్తలతో పాటు, ఐప్యాడ్ , మ్యాక్‌బుక్, ఎయిర్‌పాడ్స్ వంటి ఆపిల్ ప్రొడక్టులపై స్పెషల్ డిస్కౌంట్లను ఆఫర్ చేస్తోంది.

Read Also : PM Kisan : పీఎం కిసాన్ 20వ విడత తేదీ ఇదే..? రూ. 2వేలు పడాలంటే ఈ 4 పనులు వెంటనే చేయండి..!

ధరల తగ్గింపుతో పాటు కొనుగోలుదారులు కొన్ని ప్రొడక్టుల కొనుగోళ్లపై ఫ్రీ ఎయిర్‌పాడ్స్, ఆపిల్ పెన్సిల్‌ను కూడా పొందవచ్చు.

భారత్‌లో ఆపిల్ బ్యాక్ టు స్కూల్ సేల్ ఆఫర్లు :
ఆపిల్ ఆన్‌లైన్ ఎడ్యుకేషన్ స్టోర్‌లో సెప్టెంబర్ 30 వరకు ఐప్యాడ్ ఎయిర్, ఐప్యాడ్ ప్రో, మ్యాక్‌బుక్ ఎయిర్, మ్యాక్‌బుక్ ప్రో, ఐమ్యాక్ కంప్యూటర్ కొనుగోళ్లపై డిస్కౌంట్లను అందిస్తోంది.

ఐప్యాడ్ ఎయిర్ (2025) :
భారత మార్కెట్లో ఐప్యాడ్ ఎయిర్ (2025) 128GB ఆన్‌బోర్డ్ స్టోరేజ్‌తో 11-అంగుళాల Wi-Fi మోడల్‌ ధర రూ. 59,900 నుంచి లభ్యమవుతుంది. ఆపిల్ బ్యాక్ టు స్కూల్ ఆఫర్‌తో రూ. 54,900కు కొనుగోలు చేయవచ్చు. రూ. 5వేలు సేవ్ చేయొచ్చు.

ఐప్యాడ్ ప్రో (2024) :
ఐప్యాడ్ ప్రో (2024)పై రూ. 10వేలు తగ్గింపు పొందవచ్చు. Wi-Fi కనెక్టివిటీతో కూడిన 11-అంగుళాల మోడల్‌ ధర రిటైల్ ధర రూ. 99,900 నుంచి తగ్గి రూ. 89,900కు లభ్యమవుతుంది.

ఐప్యాడ్ ఎయిర్ (2025), ఐప్యాడ్ ప్రో (2024) సెల్యులార్ వేరియంట్‌లపై కూడా డిస్కౌంట్‌ పొందవచ్చు. ఈ రెండు ప్రొడక్టులలో ఏది కొనుగోలు చేసినా ఫ్రీ ఆఫర్ పొందవచ్చు. ఆపిల్ పెన్సిల్ ప్రో లేదా ఎయిర్‌పాడ్స్ 4 మధ్య ఏదైనా ఎంచుకోవచ్చు .

మ్యాక్‌బుక్ ఎయిర్ (2025) :
మ్యాక్‌బుక్ ఎయిర్ (2025) కొనుగోలుపై రూ. 10వేలు సేవ్ అవుతుంది. ఈ ల్యాప్‌టాప్ 16GB ర్యామ్, 256GB ఆన్‌బోర్డ్ స్టోరేజ్‌తో బేస్ వేరియంట్‌ ధర రూ. 99,900కు లభిస్తుంది. బ్యాక్ టు స్కూల్ ఆఫర్‌లో సెప్టెంబర్ వరకు రూ. 89,900కు అందుబాటులో ఉంటుంది.

మ్యాక్‌బుక్ ప్రో (2024) :
భారత మార్కెట్లో మ్యాక్‌బుక్ ప్రో (2024)లో M4 చిప్, 256GB ఆన్‌బోర్డ్ స్టోరేజ్, 14-అంగుళాల స్క్రీన్ కలిగి ఉంది. బేస్ మోడల్‌ ధర రూ. 1,69,999 ఉండగా, రూ. 10వేలు తగ్గింపుతో రూ. 1,59,900కు కొనుగోలు చేయొచ్చు.

మ్యాక్‌బుక్ ఎయిర్ (2025), మ్యాక్‌బుక్ ప్రో (2024) కొనుగోళ్లతో పాటు మ్యాజిక్ మౌస్, టచ్ ఐడీతో మ్యాజిక్ కీబోర్డ్, మ్యాజిక్ ట్రాక్‌ప్యాడ్, యాక్టివ్ నాయిస్ క్యాన్సిలేషన్ (ANC)తో ఎయిర్‌పాడ్స్ 4 వంటి ఫ్రీ యాక్సెసరీ కూడా పొందవచ్చు. ఐప్యాడ్, మ్యాక్‌బుక్ కొనుగోలుదారులు ఇంగ్లీష్ సహా 7 ప్రాంతీయ భాషలలో ఫ్రీగా పొందవచ్చు.

Read Also : Post Office RD Scheme : పోస్టాఫీసులో అద్భుతమైన స్కీమ్.. రోజుకు రూ. 100 పెట్టుబడితో రూ. 2లక్షలకు పైగా రాబడి..!

iMac 24-అంగుళాల (2024) :
24-అంగుళాల iMac ధర 8-కోర్ CPU, 8-కోర్ GPU, 16GB ర్యామ్, 256GB స్టోరేజీ బేస్ మోడల్‌ ధర రూ. 1,34,900 నుంచి ప్రారంభమవుతుంది. ఆపిల్ బ్యాక్ టు స్కూల్ ఆఫర్ ద్వారా రూ. 5వేలు డిస్కౌంట్‌తో ధర రూ. 1,29,900కి తగ్గుతుంది.